ట్విట్టర్ మరో అద్భుతమైన ఫీచర్ మీద టెస్టింగ్ నిర్వహిస్తోంది. కొత్త ప్రైవసీ టూల్స్‌ను తీసుకొచ్చేందుకు ఇప్పటికే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఎవరైనా ఫాలోవర్‌ను బ్లాక్ చేయకుండానే డైరెక్ట్‌గా తొలగించేలా 'సాఫ్ట్‌బ్లాక్' ఫీచర్‌ను ట్విట్టర్ కల్పించనుంది. ఇప్పటికే 'సాఫ్ట్‌బ్లాక్' ఆప్షన్‌ను వెబ్ పోర్టల్‌లో టెస్ట్ చేశామని ట్విట్టర్ వెల్లడించింది. ట్విట్టర్ యాప్‌లోనూ పరీక్షించి త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొంది. ఇప్పటివరకైతే ట్విట్టర్లో మీ ఫాలోవర్‌ను అన్‌ఫాలో చేసేవారు లేకపోతే ఫాలోవర్ ఖాతాలోకి వెళ్లి బ్లాక్ కొట్టేసేవాళ్లు. అయితే ఇకపై 'సాఫ్ట్‌బ్లాక్' ఆప్షన్‌తో డైరెక్ట్‌గా రిమూవ్ చేసేందుకు ఆస్కారం కలుగుతుందని ట్విట్టర్ తెలిపింది.
ఒక అకౌంట్‌ను బ్లాకింగ్ చేయడం, సాఫ్ట్‌బ్లాక్ చేయడం మధ్య వ్యత్యాసం ఉందని ట్విటర్ చెబుతోంది. కొత్తగా వచ్చే రిమూవల్ ఫాలోవర్ ఫీచర్ అన్‌ఫాలో కంటే బెటర్ ఆప్షన్ అని పేర్కొంది. మీరు మీ ఫాలోవర్లను బ్లాక్ చేసినప్పుడు.. మీ టైమ్‌లైన్‌లోని ట్వీట్లను చూడాలంటే తప్పనిసరిగా మిమ్మల్ని అనుసరించాల్సి(ఫాలో) ఉంటుంది. అదే రిమూవ్ చేసిన తర్వాత మీ వ్యక్తిగత ట్వీట్లను చూడాలంటే మిమ్మల్ని ఫాలో అయ్యేందుకు తప్పనిసరిగా మీ అనుమతిని తీసుకోవాల్సిందే. కొత్త ఫీచర్ వల్ల యూజర్లూ ఎంతో ప్రయోజనం పొందుతారని ట్విట్టర్ చెప్పుకొచ్చింది.
ఇదీ చూడండి: Twitter New Feature: ట్విట్టర్ కొత్త ఫీచర్.. ఇకపై 'ఎమోజీ'తో రిప్లే!