మెసేజింగ్ యాప్‌లు వచ్చాక ఎమోజీల వినియోగం బాగా పెరిగిపోయింది. బాధ, ఆనందం, కోపం, అభినందనలు, ప్రేమ, అనుమానం.. ఇంకా ఇలాంటివి ఏవైనా సరే ఎమోజీలతో చెప్పే అవకాశం ఉంది. మాటల్లో చెప్పలేని వాటిని ఎమోజీలతో వ్యక్తీకరించవచ్చు. ట్విట్టర్‌లోనూ ఎమోజీలను తెగ వాడేస్తుంటారు యూజర్లు. ఇప్పుడు మరింత అడ్వాన్స్‌డ్‌గా మరొక ఫీచర్‌ను ట్విట్టర్(Twitter New Features) తీసుకొచ్చేందుకు టెస్టింగ్ నిర్వహిస్తోంది. యూజర్ ఓ ట్వీట్‌కు(twitter updates) ఎమోజీలను వాడాలంటే రిప్లై బాక్స్‌లోకి వెళ్లి సమాధానం ఇవ్వాల్సి ఉండేది. ఇక టెస్టింగ్ ఓకే అయితే ఎలాంటి ఆలస్యం లేకుండా ట్వీట్‌కే ఎమోజీలను జోడించేందుకు ట్విట్టర్ ఫీచర్‌ను(Twitter New updates) అప్‌డేట్ చేయనుంది. అయితే ఫేస్‌బుక్‌లో ఉన్నట్లు 'యాంగ్రీఫేస్', 'థంబ్స్‌డౌన్' ఎమోజీలు ట్విట్టర్‌లో కనిపించవు. దీనికి కారణమేంటో కూడా ట్విట్టర్ వివరణ ఇచ్చింది.
నెగిటివిటీ ఎమోజీలను వాడటం వల్ల యూజర్ల ఆలోచనలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఎమోజీ రియాక్షన్ ఫీచర్ ప్రస్తుతానికి టర్కీ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వస్తుందని ట్విట్టర్ తెలిపింది. టెస్టింగ్‌కు వచ్చిన రెస్పాన్స్‌ను బట్టి మిగతా దేశాల యూజర్లకు విస్తరిస్తామని వెల్లడించింది.
ఎమోజీ రియాక్షన్స్ ఫీచర్ తీసుకు వచ్చేందుకు ప్రధాన ఉద్దేశం ట్వీట్‌కు స్పాట్‌లోనే రిప్లయ్ ఇవ్వడమేనని ట్విట్టర్ తెలిపింది. లైక్ బటన్‌ను లాంగ్ ప్రెస్ చేస్తే ఎమోజీలు వస్తాయి. అందులో మీ భావానికి తగ్గట్టుగా ఉన్న ఎమోజీతో స్పందించవచ్చు. ఎమోజీ రియాక్షన్స్ ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సాప్‌లో ఇప్పటికే ఉన్నాయి. అయితే వీటిల్లో డైరెక్ట్ మెసేజ్ ఆప్షన్‌లో మాత్రమే ఎమోజీలు ఉండేవి. ఇప్పుడు ట్విట్టర్ తీసుకు రానున్న ఫీచర్‌లో నెగిటివ్ ఎమోజీలకు స్థానం ఉండవని తెలుస్తోంది. రానున్న రోజుల్లో టర్కీలోని యూజర్లకు ఫీచర్‌ను పరిచయం చేసి.. విజయవంతమైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లకు అందించనుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్లలో టెస్టింగ్ నిర్వహిస్తున్నట్లు ట్విట్టర్ తెలిపింది.
ఇదీ చూడండి: Ray- Ban Stories: ఫేస్‌బుక్ స్మార్ట్ గ్లాసెస్ వచ్చేశాయ్- ధర, ఫీచర్లివే!