ETV Bharat / science-and-technology

బ్రౌజర్​లో ట్విట్టర్​ వాడుతున్నారా.. ఇక అది అవసరమే!

author img

By

Published : Jul 1, 2023, 12:03 PM IST

Twitter New Login : వెబ్​ బ్రౌజర్​లో లాగిన్​ కాకుండా ట్విట్టర్​ను ఉపయెగించే నెటిజన్లకు ఆ సంస్థ గట్టి షాక్ ఇచ్చింది. ఇకపై లాగిన్ కాకుండా ట్వీట్స్​ చూడలేరంటూ ఓ ప్రకటనలో పేర్కొంది. 'విపరీతమైన డేటా స్క్రాపింగ్' కారణంగా ఇటువంటి అత్యవసర చర్యను తీసుకున్నట్లు ఎలన్​ మస్క్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Twitter Elon Musk
Twitter shuts access to people sans accounts

Twitter new Login : వెబ్​ బ్రౌజర్​లో లాగిన్​ అవ్వకుండా ట్విట్టర్​ను ఉపయోగించే నెటిజన్లకు మస్క్​ టీమ్​ బడా ట్విస్ట్ ఇచ్చింది. ఇకపై కచ్చితంగా లాగిన్ అయితే తప్ప మనం ట్వీట్స్​ను చూడలేమంటూ ఓ కొత్త రూల్​ను అమలు చేసింది. కనుక ట్విట్టర్​ అకౌంట్​ లేని వారు కచ్చితంగా ఓ నయా ఖాతాను ​క్రియేట్​ చేసుకుని మరి వాడాల్సిందే అంటూ చెప్పుకొచ్చింది. అయితే 'విపరీతమైన డేటా స్క్రాపింగ్' కారణంగా ఇటువంటి అత్యవసర చర్యను తీసుకున్నట్లు ఎలన్​ మస్క్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు ఇది తాత్కాలిక చర్య అని కూడా మస్క్ వెల్లడించారు.

Twitter Login News : అంకుర సంస్థల నుంచి అగ్రస్థాయి కంపెనీల వరకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్​ను ఉపయోగించే ప్రతీ సంస్థ.. ఖాతాల్లోని డేటాను ఉచితంగా తీసుకుంటున్నాయని మస్క్​ అన్నారు. దీని వల్ల సాధారణ యూజర్ డేటా దోపిడీకి గురవుతోందని ఆయన పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సు ద్వారా జరిగే అనవసరమైన సెర్చింగ్​ను అరికట్టేందుకు తీసుకుంటున్న ఈ నిర్ణయం వల్ల బయటి లింక్స్​, ఎంబేడెడ్స్​​ ద్వారా ట్విట్టర్ ఖాతాల్లోని డేటాకు ఎటువంటి హానికారం కలగదని.. తమ వద్దనున్న డేటా సురక్షితంగా ఉంటుందని ట్విట్టర్​ సంస్థ వెల్లడించింది. ఇక ముందు దీనికి ఓ దీర్ఘకాలిక పరిష్కారం దొరుకుతుందని తాము ఆశిస్తున్నట్లు ట్విట్టర్ పేర్కొంది.

Twitter Monetization : ఇటీవలే ట్విట్టర్​ యాప్​లో మోనటైజేషన్​ అనే ఓ కొత్త ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.​ కొత్త సీఈఓ లిండా యాకరినో ట్విట్టర్​ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. దీని ద్వారా వెరిఫైడ్​ కంటెంట్ క్రియేటర్స్​కి మాత్రమే ఈ మోనటైజేషన్​ ఇవ్వనున్నట్లు ట్విట్టర్​ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందు కోసం సుమారుగా 5 మిలియన్​ డాలర్లు అంటే సుమారుగా రూ.41 కోట్ల రూపాయలను కేటాయించినట్లుగా ఆ సంస్థ పేర్కొంది. అయితే వెరిఫైడ్ కంటెంట్​ క్రియేటర్స్​​ ఖాతాలకు మాత్రమే యాడ్​లను సర్వ్​ చేస్తామని ట్విట్టర్ మాజీ సీఈఓ ఎలాన్​ మస్క్ ఈ సందర్భంగా తెలిపారు.

ప్రస్తుతం ఈ వరల్డ్​ పాపులర్​ మెసేజింగ్​ యాప్​ గంటకు 5 నుంచి 6 సెంట్లు సంపాదిస్తోందని తెలిపిన మస్క్​.. యూజర్ల నుంచి మరింత ఆదరణ కనుక పొందితే గంటకు కచ్చితంగా 15 సెంట్లు వరకు సంపాదించవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆ దిశగానే ట్విట్టర్ అడుగులు వేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.