ETV Bharat / science-and-technology

రష్యా నిషేధం.. ట్విటర్​లో టార్‌ ఆనియన్‌ సేవలు! - ట్విట్టర్​ డార్క్​

Twitter Dark Web: యూజర్ల గోపత్యకు భంగం కలగకుండా సురక్షితమైన సేవలను అందించడానికి డార్క్‌ వెబ్‌ టార్‌ సర్వీసెస్‌ను తీసుకొచ్చింది ట్విటర్​. టార్‌ ఆనియన్‌ పేరుతో.. వినియోగదారులకు ఈ కొత్త సర్వీసును అందుబాటులోకి తెచ్చింది.

twitter launches dark web
ట్విటర్​లో టార్‌ ఆనియన్‌
author img

By

Published : Mar 10, 2022, 12:28 AM IST

Twitter Dark Web: ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ట్విటర్‌ కొత్త సేవలను ప్రారంభించింది. యూజర్ల గోపత్యకు భంగం కలగకుండా సురక్షితమైన సేవలను అందించడానికి డార్క్‌ వెబ్‌ టార్‌ సర్వీసెస్‌ను తీసుకొచ్చింది. వినియోగదారులు కొత్తగా టార్‌ ఆనియన్‌ సేవలను ఉపయోగించి ట్విటర్‌ను యాక్సెస్ చేయవచ్చని తెలిపింది. ఈ విషయాన్ని ప్రముఖ సైబర్‌ నిపుణులు అలెక్‌ మఫెట్‌ వెల్లడించారు.

'ఈ సమయం కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాం. ట్విటర్‌లో డార్క్‌ వెబ్‌ టార్ ఆనియన్‌ సర్వీసెస్‌ను తీసుకొస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. వినియోగదారులు ట్విటర్‌ సేవలను సులువుగా పొందేందుకు ఈ సర్వీసెస్‌ను ప్రారంభిస్తున్నాం' అని అలెక్ మఫెట్ ట్వీట్ చేశారు.

ఉక్రెయిన్‌పై జరుపుతోన్న సైనిక చర్యను ఖండిస్తూ.. పలు దిగ్గజ సంస్థలు రష్యాలో వాటి ఉత్పత్తులు, సేవలపై ఆంక్షలు విధించాయి. అయితే, దీనికి రష్యా రివర్స్‌లో ఇదే తరహా చర్యలు చేపట్టి సామాజిక మాధ్యమం ట్విటర్‌ను నిషేధించింది. దీంతో ఆ దేశంలో ట్విటర్‌ సేవలు నిలిచిపోయాయి. తిరిగి రష్యాలో ట్విటర్‌ తన సేవలను పునఃప్రారంభించడానికి ప్రత్యామ్నాయ మార్గాల వైపు అడుగులు వేసింది. ఇందులో భాగంగా ట్విటర్‌ డార్క్‌ వెబ్‌లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. కాగా, టార్‌ ప్రాజెక్టు ఇచ్చిన నివేదిక ప్రకారం.. మార్చిలో 12.77 శాతం మంది యూజర్లు రష్యా నుంచి ట్విటర్‌కు కనెక్ట్‌ అవుతున్నారని వెల్లడించింది.

ఇదీ చూడండి:

బంగారం ఎక్కడి నుంచి పుట్టిందో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.