'అన్డూ ట్వీట్' అనే సరికొత్త ఫీచర్ తీసుకురావడానికి మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ యత్నిస్తోంది. దీని ద్వారా టైపింగ్ లేదా ఇతర తప్పులున్న ట్వీట్లను.. నిర్దిష్ట సమయంలోగా తొలగించే వీలుంటుంది. అయితే ఈ ఆప్షన్‌ను డబ్బులు చెల్లించిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి తీసుకురానున్నారు.
అక్షర దోషాలు లేదా ఇతర తప్పులను సరిచేసేందుకు ట్విట్టర్లో ఎడిట్ ఆప్షన్ లేదు. ఎప్పటినుంచో వినియోగదారులు దానికోసం డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఉన్న డిలీట్ ఆప్షన్‌కు భిన్నంగా ఈ అన్డూ ఆప్షన్‌ను ట్విట్టర్ తీసుకురానుందని టెక్ నిపుణులు జేన్ మన్చున్ తెలిపారు.
-
Twitter is working on app subscription for paid features like “Undo Tweet” https://t.co/CrqnzIPcOH pic.twitter.com/Ct16Gk2RL1
— Jane Manchun Wong (@wongmjane) March 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Twitter is working on app subscription for paid features like “Undo Tweet” https://t.co/CrqnzIPcOH pic.twitter.com/Ct16Gk2RL1
— Jane Manchun Wong (@wongmjane) March 19, 2021Twitter is working on app subscription for paid features like “Undo Tweet” https://t.co/CrqnzIPcOH pic.twitter.com/Ct16Gk2RL1
— Jane Manchun Wong (@wongmjane) March 19, 2021
అన్డూ ఎలా పని చేస్తుంది?
ఒక ట్వీట్ చేసినప్పుడు.. ఏదైనా కారణాలతో దానిని తొలగించాలనుకుంటే 'డిలీట్' ఆప్షన్ నొక్కేస్తాం. కానీ అప్పటికే అది చాలామందికి చేరువైపోయి ఉంటుంది. కానీ, అన్డూ ఆప్షన్‌తో 'ట్వీట్' అని నొక్కిన తర్వాత అది పోస్టు కావడానికి కొంత వ్యవధి లభిస్తుంది. ఈలోగా దానిని వద్దనుకుంటే 'అన్డూ' నొక్కితే సరి.
ఇదీ చూడండి: 110 వర్క్అవుట్ మోడ్లతో వన్‌ప్లస్ స్మార్ట్ వాచ్