అమెరికాకు చెందిన మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విట్టర్.. త్వరలో రెండు కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. యూజర్ల ఇష్టాలను బట్టి ఎవరైనా గ్రూప్‌ను రూపొందించొచ్చని, లేదా ఉన్న గ్రూప్ జాయిన్ కావొచ్చని వివరించింది. 'సూపర్ ఫాలోస్' పేరుతో పేమెంట్ విధానాన్ని తీసుకురానున్నట్లు పేర్కొంది.
- ఏ గ్రూప్‌లోనైనా..
ఫేస్బుక్లో ఉన్న 'కమ్యూనిటీస్ విధానం' తరహాలోనే ఈ ఫీచర్ ద్వారా తమకిష్టమైన గ్రూప్‌ను ఖాతాదారుడు రూపొందించవచ్చు. లేదా తమకు ఇష్టమున్న గ్రూప్‌లో జాయిన్ కావొచ్చు. సంబంధిత గ్రూప్స్‌పై వచ్చిన ట్వీట్లను, సమాచారాన్ని చూడవచ్చు.
- సూపర్ ఫాలోస్..
'సూపర్ ఫాలోస్' పేరుతో సరికొత్త పేమెంట్ ఫీచర్‌ను తీసుకురానుంది ట్విట్టర్. సెలబ్రిటీలు, ప్రముఖ వ్యక్తులు.. తమ ట్వీట్లు, సమాచారం, ఫొటోలను అభిమానులు చూడాలంటే ఈ విధానాన్ని ఉపయోగించి నగదు తీసుకోవచ్చు.
అయితే కచ్చితంగా ఎప్పుడు ఈ ఫీచర్స్.. అందుబాటులోకి వస్తాయో ట్విట్టర్ తెలపలేదు.
ఇదీ చదవండి : కొవిడ్ టీకా తీసుకున్న ప్రధాని మోదీ