ETV Bharat / science-and-technology

ఫైల్ షేరింగా..? వీటిని ప్రయత్నించండి - trai

వియ్‌ ట్రాన్స్‌ఫర్‌ వెబ్‌సైట్‌ను తాత్కాలికంగా నిలిపి వేయాలని టెలికం మంత్రిత్వ శాఖ (డీవోటీ) ఇటివలే ఆదేశించింది. ఫలితంగా ఈ సైట్​ను వినియోగించే వారు సందిగ్ధంలో పడ్డారు. ఈ తరుణంలో దానికి బదులుగా ఉన్న ఇతర సైట్లపై ఓ లుక్కెద్దాం.

Top 10 file-sharing options: Dropbox, Box, Google Drive
ఫైల్ షేరింగా..? వీటిని ప్రయత్నించండి
author img

By

Published : Jun 3, 2020, 5:31 PM IST

Updated : Feb 16, 2021, 7:51 PM IST

పెద్దమొత్తంలో సమాచారంతో కూడిన ఫైల్‌ను ఇతరులకు షేర్‌ చేయాలంటే ఎక్కువ మంది వినియోగించేది వియ్‌ ట్రాన్స్‌ఫర్‌ వెబ్‌సైట్‌నే. కొద్ది రోజుల క్రితం టెలికం మంత్రిత్వ శాఖ (డీవోటీ) ఆ సైట్‌ సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. అయితే, ఏ కారణంతో ఈ వెబ్‌సైట్‌ను నిలిపివేశారనే దానిపై మాత్రం ఇంత వరకు స్పష్టతలేదు. అలానే వియ్‌ ట్రాన్స్‌ఫర్‌ సంస్థ కూడా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. దీంతో రోజువారీ ఆఫీస్‌ పనుల్లో భాగంగా వియ్‌ ట్రాన్స్‌ఫర్‌ను వినియోగించేవారు అయోమయంలో పడిపోయారు. దానికి బదులుగా ఉన్న ఇతర మార్గాలను అన్వేషించడం ప్రారంభించారు. అలాంటి వాటిలో ముఖ్యమైనవి ఇవీ..

Dropbox
డ్రాప్‌బాక్స్

డ్రాప్‌బాక్స్

ఇందులో 2 జీబీ వరకు సామర్థ్యం కలిగిన ఫైల్స్‌ని ఉచితంగా షేర్‌ చేసుకోవచ్చు. అంతకు మించి ఎక్కువ సామర్థ్యం ఉన్న ఫైల్స్ ఇతరులతో పంచుకోవాలంటే మాత్రం సబ్‌స్క్రిప్షన్ తప్పనిసరి. ఇందుకోసం వివిధ రకాల ప్యాకేజీలను డ్రాప్‌బాక్స్‌ అందిస్తోంది. అలానే ఇందులో స్టోరేజీ సామర్థ్యం 2 టీబీ నుంచి 3 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఇది వెబ్‌, డెస్క్‌టాప్‌ యాప్‌ కూడా అందుబాటులో ఉంది.

Google Drive
గూగుల్ డ్రైవ్‌

గూగుల్ డ్రైవ్‌

ప్రముఖ సెర్చ్ ఇంజిన్‌ గూగుల్ కూడా ఫైల్‌ షేరింగ్ కోసం గూగుల్ డ్రైవ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జీమెయిల్‌ ఖాతా ఉన్నవారు ఎవరైనా ఇందులో 15 జీబీ వరకు సమాచారాన్ని ఉచితంగా షేర్ చేసుకోవచ్చు. ఇది వెబ్‌, మొబైల్‌ వెర్షన్‌లలో అందుబాటులో ఉంది. ఇంకా ఎక్కువ స్టోరేజీ కావాలనుకున్నవారు గూగుల్ వన్‌కి అప్‌గ్రేడ్‌ కావచ్చు.

smash
స్మాష్‌

స్మాష్‌

సులువుగా ఫైల్‌ షేర్‌ చేసుకోవాలనుకునే వారి కోసం ఉన్న మరో ఎంపిక స్మాష్‌. ఇందులో వివరాల నమోదు, ఖాతా తెరవడం వంటివి ఉండవు. ఎంత ఎక్కువ సామర్థ్యం కలిగిన ఫైల్‌ను అయినా ఇందులో షేర్‌ చేసుకోవచ్చు. కాకపోతే ఇందులో 14 రోజులకు మించి ఫైల్‌ ఉండదు. తర్వాత దానంతటదే ఎక్స్‌పైర్‌ అయిపోతుంది. అలానే పాస్‌వర్డ్‌ భద్రతతో ఫైల్‌ షేరింగ్ ఇందులో ఉన్న మరో అత్యుత్తమ ఫీచర్.

hightell
హైటైల్‌

హైటైల్‌

ఇందులో 2 జీబీ వరకు ఫైల్‌ స్టోరేజీని హైటెల్‌ ఉచితంగా అందిస్తోంది. అయితే, ఒక్కసారి 100ఎంబీ సామర్థ్యం కలిగిన ఫైల్స్‌ను మాత్రమే ఇందులో షేర్‌ చేసుకోగలం. ఎక్కువ స్టోరేజీ కావాలంటే సబ్‌స్క్రిప్షన్‌ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. డ్రాప్‌బాక్స్, గూగుల్ డ్రైవ్‌, వన్‌డ్రైవ్, కోర్‌ వంటి వాటి నుంచి కూడా ఫైల్‌ షేర్‌ చేసుకునేందుకు హైటైల్‌ అనుమతిస్తుంది.

ఇదీ చూడండి:చికెన్ గున్యా వ్యాక్సిన్ అభివృద్ధికి భారత్ బయోటెక్​తో ఒప్పందం

Last Updated : Feb 16, 2021, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.