శాంసంగ్ సంస్థ సరికొత్త స్మార్ట్‌టీవీలతో ముందుకొచ్చింది. 2020 స్మార్ట్ టీవీ లైనప్‌లో క్రిస్టల్ 4కే యూహెచ్డీ, అన్‌బాక్స్ మ్యాజిక్ 3.0 టీవీ సిరీస్‌లను ఆవిష్కరించింది.
క్రిస్టల్ 4కే యూహెచ్డీ టీవీలో క్రిస్టల్ సాంకేతికతతో పాటు 4కే క్వాలిటీని పెంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యం ఉందని వెల్లడించింది.
43, 50, 55, 65, 75 అంగుళాల తెర పరిమాణాలతో వీటిని రూపొందించినట్లు పేర్కొంది. టీవీల ధర రూ. 44,400 నుంచి రూ. 2.37 లక్షల మధ్య ఉంటుందని తెలిపింది.
అన్‌బాక్స్ మ్యాజిక్ 3.0
మధ్యశ్రేణి మార్కెట్ లక్ష్యంగా అన్‌బాక్స్ మ్యాజిక్ 3.0 సిరీస్‌ను రూపొందించింది శాంసంగ్. 32 అంగుళాల టీవీ ధరను రూ. 20,900, 43 అంగుళాల టీవీ ధరను రూ. 41,900గా నిర్ణయించింది.
"కొత్త స్మార్ట్ టీవీ లైనప్ కంటెంట్ వినియోగధోరణిపై ఆధారపడి ఉంటుంది. వినియోగదారులు నిరంతర అనుభవం పొందే విధంగా విస్తృత రకాల ఓటీటీ ప్లాట్‌ఫాంలు ఎంచుకునే అవకాశం లభిస్తుంది. క్రిస్టల్ 4కే యూహెచ్డీ టీవీ ఈ సెగ్మెంట్లో సంస్థ మార్కెట్ లీడర్షిప్ను మరింత దృఢపరుస్తుందని మాకు నమ్మకం ఉంది."
-రాజు పుల్లన్, శాంసంగ్ ఇండియా సీనియర్ వీపీ
2020 స్మార్ట్ టీవీ సిరీస్‌లోని రిమోట్లలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5 వంటి ఓటీటీలకు ప్రత్యేక బటన్లను ఏర్పాటు చేసింది శాంసంగ్. వీటితో పాటు మరిన్ని ఓటీటీ ప్లాట్‌ఫాంలను వినియోగించుకునే వీలు కల్పించింది.
జూన్ 30న 2020 లైనప్‌లోనే అల్ట్రా-ప్రీమియం క్యూఎల్ఈడీ 8కే టీవీని విడుదల చేసింది. వీటి ధరలు
- 65 అంగుళాల టీవీ రూ. 4.99 లక్షలు
- 75 అంగుళాల టీవీ రూ. 9.99 లక్షలు
- 82 అంగుళాల టీవీ రూ. 14.29 లక్షలు
- 85 అంగుళాల టీవీ రూ. 15.79 లక్షలు
ఇదీ చదవండి- టిక్‌టాక్ ఫీచర్లతో ఇన్స్టాగ్రామ్ 'రీల్స్'