ETV Bharat / science-and-technology

వాట్సాప్‌ యాప్‌లో 'క్లిక్‌ టు చాట్‌' ఫీచర్​.. ఇకపై సురక్షితమే - Click to Chat feature resolved

వాట్సాప్​ నంబర్​లు గూగుల్​ సెర్చ్​లో కనిపిస్తున్నాయని ఓ భారతీయ పరిశోధకుడు బయటపెట్టగా.. సంస్థ ప్రతినిధులు అప్రమత్తమయ్యారు. సమస్య వచ్చిన రోజుల వ్యవధిలోనే ఆ బగ్​ను ఫిక్స్​ చేశారు. యూజర్లు లింక్​ ద్వారా చాటింగ్​కు ఆహ్వానిస్తే ఈ సమస్య వచ్చిందని పేర్కొన్నారు.

Whats app Click to chat feature
వాట్సాప్​లో బగ్​
author img

By

Published : Jun 10, 2020, 11:35 AM IST

Updated : Feb 16, 2021, 7:51 PM IST

వాట్సాప్​.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగిస్తున్న మెసేజింగ్​ యాప్​. ఇటీవల కాలంలో విభిన్న ఫీచర్లతో మరింతగా ఆకర్షిస్తున్న ఈ యాప్​లో.. ఓ బగ్​ను బయటపెట్టాడు భారత్​కు చెందిన బగ్‌ బౌంటీ హంటర్‌ అథుల్‌ జయరామ్‌. ఈ ఫీచర్‌లోని లోటుపాట్లను ఓ ప్రైవేట్​ ఛానెల్​ ద్వారా వివరించాడు. వెంటనే స్పందించిన సంస్థ.. రోజుల వ్యవధిలో సమస్యను పరిష్కరించింది. అంతేకాకుండా అథుల్​ను ప్రశంసించింది.

ఇక్కడ వచ్చింది సమస్య...

వాట్సాప్‌ యాప్‌లో 'క్లిక్‌ టు చాట్‌' ఫీచర్‌ ద్వారా యూజర్లు అవతలి వ్యక్తి ఫోన్‌ నంబర్‌ను తమ ఫోన్లో సేవ్‌ చేసుకోకుండానే సందేశం పంపొచ్చు. లేదా ఫోన్‌ చేయొచ్చు. సరిగ్గా ఇదే ఆ వాట్సాప్‌ యూజర్‌ను రిస్క్‌లో పడేస్తుందని చెప్పాడు అథుల్‌. దీని ద్వారా వినియోగదారుల వాట్సాప్‌ నంబర్‌ గూగుల్‌ సెర్చ్‌లో కనిపిస్తుందని చెప్పాడు. ఇలా తాను సుమారు 3 లక్షల ఫోన్ నంబర్లను కనుగొన్నట్లు చెప్పాడు. ఈ ఫీచర్​ ఎక్కువగా బిజినెస్​ చేసే వ్యక్తులు తమ కస్టమర్లతో సంప్రదించేందుకు వాడతారని చెప్పాడు.

నష్టమేంటి?

గూగుల్‌ సెర్చ్‌లో కేవలం ఫోన్‌ నంబర్‌ మాత్రమే దొరుకుతుందని, ఇతర వివరాలేవీ లభించవని చెబుతున్నాడు ఈ హంటర్‌. అయితే, ఈ మాత్రం దొరికినా యూజర్లకు రిస్కేనని చెబుతున్నాడు. మీ ఫోన్‌ నంబర్‌ ఆధారంగా మీ ప్రొఫైల్‌ ఫొటోను కనుగొనవచ్చని (పబ్లిక్‌గా పెడితే) అంటున్నాడు. ఆ ఫొటోను రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌ చేయడం ద్వారా యూజర్‌కు సంబంధించిన ఇతర సోషల్‌మీడియా ఖాతాల ద్వారా అతడి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. లేదా సదరు సైబర్‌ నేరగాడు నేరుగా సందేశాలు పంపించి మోసాలకు పాల్పడొచ్చని చెబుతున్నాడు.

తొలిసారి ఫిబ్రవరిలో..

వాట్సాప్​లో ఈ సమస్యను తొలిసారి కనిపెట్టింది వాట్సాప్​ ఫీచర్​ ట్రాకర్​ 'వాబీటాఇన్​ఫో'. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ విషయాన్ని తెలిపింది. అయితే మే 23న ఈ బగ్‌ను మరోసారి కొన్ని ఫొటోలు, ఆధారాలతో బహిర్గతం చేశాడు అథుల్​. బగ్‌ బౌంటీ ప్రోగ్రామ్‌ ద్వారా వాట్సాప్‌ యజమాని సంస్థ ఫేస్‌బుక్‌ను అతడు సంప్రదించగా... వాట్సాప్‌ తమ 'డేటా అబ్యూజ్ ప్రోగ్రామ్‌' కిందకు రాదని పేర్కొంది.

అలాగే వాట్సాప్‌ సైతం అథుల్​ ఫిర్యాదుపై స్పందించింది. ఆ రీసర్చర్‌ ఎంతో సమయం వెచ్చించి దీన్ని కనుగొన్నందుకు అభినందిస్తున్నామని పేర్కొంది. అయితే, అది పూర్తిగా సెర్చింజన్‌ ఇండెక్స్‌కు సంబంధించినది కావడం వల్ల బగ్‌ బౌంటీ కార్యక్రమానికి అతడు అర్హత సాధించలేదని తెలిపింది. అలాగే గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలను బ్లాక్‌ చేసే సదుపాయం యూజర్లకు తాము కల్పిస్తున్నట్లు వాట్సాప్‌ గుర్తుచేసింది.

ఇవీ చూడండి:

భారత్​లోకి 'ఎంఐ ల్యాప్​టాప్​'.. వచ్చేది అప్పుడే!

Last Updated : Feb 16, 2021, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.