ETV Bharat / science-and-technology

ఐడెంటిటీ క్లోనింగ్​ ఉచ్చులో పడకూడదంటే? - ETV Bharat cyber crime news

సాంకేతికత వినియోగంతోపాటే ప్రపంచవ్యాప్తంగా సైబర్​ నేరాలు గణనీయంగా పెరిగాయి. ఇక కరోనా లాక్​డౌన్​ తర్వాత సైబర్​ నేరగాళ్లు విభిన్న టెక్నిక్​లను ఉపయోగించి యూజర్ల సమాచారం, డబ్బులు కాజేస్తున్న కేసులు ఎక్కువ అవుతున్నాయి. వారు ఉపయోగించే పద్ధతుల్లో ఐడెంటిటీ క్లోనింగ్​ ఒకటి. ఈ విధానంతో ఎలా దాడులు చేస్తారు? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఓసారి తెలుసుకుందాం.

CYBERCRIME-IDENTITY CLONING
ఐడెంటిటీ క్లోనింగ్​ ఉచ్చులో పడకూడదంటే?
author img

By

Published : Jun 24, 2020, 1:04 PM IST

Updated : Feb 16, 2021, 7:51 PM IST

ఐడెంటిటీ క్లోనింగ్​.. నయా సైబర్​ మోసం. ఇందుకోసం అచ్చుగుద్దినట్లు మీ తరహాలోనే ఫేక్ సోషల్​మీడియా​ ప్రొఫైల్​ తయారు చేస్తారు. దానితో మీ స్నేహితులు, బంధువులకు అత్యవసరంగా డబ్బులు కావాలని సందేశాలు పెడతారు. అదీ చాలా తక్కువ మొత్తంలో ఎక్కువ మందిని డిమాండ్​ చేస్తారు. ఇటీవలె ఈ ఘటనకు బాధితుడయ్యారు లఖ్​నవూ సెంట్రల్​కు చెందిన ఏసీపీ అభయ్​ కుమార్​ మిశ్రా.

ఏం జరిగిందంటే..?

అభయ్​ కుమార్​ అకౌంట్​ను పోలినట్లే నకిలీ ఫేస్​బుక్​ పేజీని తయారుచేశారు. ఇందుకోసం అతడి ఒరిజినల్​ అకౌంట్​ నుంచి ఫొటోలు, వ్యక్తిగత సమాచారం, ఫోన్​ నంబర్​ అన్నీ సేకరించి.. డూప్లికేట్​ ఖాతా తయారుచేశారు. దాన్నుంచి తన స్నేహితులు, కాంటాక్ట్​లకు డబ్బులు అత్యవసరమని సందేశాలు పంపించారు. అయితే రూ.5వేలు అత్యవసరమని అడిగినట్లు... మెసేజ్​ రాగానే మిశ్రాను ఫోన్​ చేసి అడిగాడు ఓ స్నేహితుడు. తను ఎలాంటి రిక్వెస్ట్​ పెట్టలేదని నిర్ధరించుకున్నాక... నకిలీ ఖాతా ఉన్నట్లు ఆయన గుర్తించారు. వెంటనే లఖ్​నవూ సైబర్​క్రైమ్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.

రోజుల వ్యవధిలోనే ఈ తరహా 12 కేసులు వచ్చినట్లు ఆ రాష్ట్ర సైబర్​ సెల్ విభాగం తెలిపింది. అవగాహనతోనే ఇలాంటి వాటికి చెక్​ పెట్టొచ్చని సలహా ఇచ్చారు పోలీసులు. ప్రొఫైల్​ ఫొటోను లాక్​ చేసుకోవడం, ఫ్రెండ్స్​ జాబితాను పబ్లిక్​కు కనపడకండా చేయడం వంటి జాగ్రత్తలు పాటించాలని యూజర్లకు సూచించారు.

CYBERCRIME-IDENTITY CLONING
ఐడెంటిటీ క్లోనింగ్​

ఇవీ చూడండి:

  1. జాగ్తే రహో: ఆశ చూపించి డబ్బులు కొట్టేస్తారు!
  2. జాగ్తే రహో: ఛార్జింగ్​ పెడితే బ్యాంక్​ ఖాతా ఖాళీ!

Last Updated : Feb 16, 2021, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.