ETV Bharat / science-and-technology

ఇక ఫేస్​బుక్​ మెసెంజర్​ నుంచే వాట్సాప్ చాటింగ్! - messenger

మెసెంజర్​ నుంచే వాట్సాప్​లోని కాంటాక్ట్​లకు సందేశం పంపేందుకు వీలు కల్పించే ప్రక్రియను ఫేస్​బుక్ ముమ్మరం చేసింది. ఇందుకోసం రెండు యాప్​ల మధ్య కమ్యునికేషన్​ను అభివృద్ధి చేస్తున్నట్లు ఓ టెక్​ వెబ్​సైట్ స్పష్టం చేసింది. లోకల్ డేటాబేస్​లోని ఓ కోడ్​ను ఉపయోగించి ఈ ప్రక్రియను పరీక్షిస్తున్నట్లు పేర్కొంది.

Facebook Messenger integration latest news
వాట్సాప్, మెసేంజర్​ అనుసంధాన ప్రక్రియ ముమ్మరం!
author img

By

Published : Jul 8, 2020, 5:42 PM IST

Updated : Feb 16, 2021, 7:51 PM IST

మెసెంజర్​ నుంచి వాట్సాప్ కాంటాక్టులకు సందేశాలు పంపగలిగేలా కొత్త ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది ఫేస్​బుక్​.

మెసెంజర్​ను వాట్సాప్​తో అనుసంధానం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఫేస్​బుక్ ఇదివరకే ప్రకటించింది. తాజాగా ఈ రెండు యాప్​ల మధ్య కమ్యునికేషన్​ను అభివృద్ధి చేసేందుకు కసరత్తులు చేస్తున్నట్లు ఓ టెక్ వెబ్​సైట్ పేర్కొంది.

ప్రక్రియ ఇదే..

ఇతర వాట్సాప్​ యూజర్లతో చాటింగ్ చేయడానికి లోకల్​ డేటాబేస్​లోని కొన్ని కోడ్​లు సహకరిస్తాయని అలెస్సాండ్రో పలుజ్జీ అనే డెవలపర్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ వెబ్​సైట్ కథనం ప్రచురించింది. ఈ కోడ్​ ద్వారా వాట్సాప్ కాంటాక్ట్​ బ్లాక్​ చేశారో లేదో అన్న విషయం కూడా ఫేస్​బుక్​కు తెలుస్తుందని పేర్కొంది. పుష్ నోటిఫికేషన్లు, చాటింగ్ వివరాలనూ తెలుసుకోవచ్చని స్పష్టం చేసింది.

చాట్​ను ఆర్కైవ్​ చేసినట్లైతే ఈ కోడ్​ సాయంతో కాంటాక్ట్ నెంబర్లను మెసేంజర్ సేకరించవచ్చని వెబ్​సైట్ వివరించింది. యూజర్ల ప్రొఫైల్ పిక్చర్లను చూడొచ్చని తెలిపింది. యూజర్ ఏదైనా వాట్సాప్ గ్రూప్​లో ఉన్నారా అనే విషయాన్ని తెలుసుకోవచ్చని స్పష్టం చేసింది.

ఈ కోడ్​ లైవ్​లోకి రాగానే సిగ్నల్ ప్రోటోకాల్​ను ఫేస్​బుక్ దిగుమతి చేసుకొని మెసేజ్​లను ఎన్​క్రిప్ట్, డీక్రిప్ట్​ చేస్తుందని నివేదిక తెలిపింది. సిగ్నల్ ప్రోటోకాల్(ఎండ్​ టు ఎండ్ ఎన్​క్రిప్షన్) ఇప్పటికే వాట్సాప్​లో అందుబాటులో ఉంది.

అయితే వినియోగదారుల సమాచార భద్రత, డేటా ఎన్​క్రిప్షన్​లపై రాజీ పడకుండా ఈ ప్రక్రియను ఎలా చేపడుతున్నామనే విషయాన్ని ఫేస్​బుక్ వెల్లడించలేదని వెబ్​సైట్ గుర్తు చేసింది. ఈ ఫీచర్​ను డిసేబుల్ చేసే ఆప్షన్​ను ఫేస్​బుక్ ఇస్తుందో లేదో స్పష్టత లేదని పేర్కొంది. ఇలాంటి సంక్లిష్టతల కారణంగా ఫేస్​బుక్ ఈ ఫీచర్​ను రద్దు చేయడానికే ప్రయత్నించవచ్చని అభిప్రాయపడింది. ఒకవేళ ఈ రెండు యాప్​ల​ మధ్య అనుసంధానాన్ని ఏర్పరచినా... వాట్సాప్ మెసేజ్​లు పూర్తిగా ఎన్​క్రిప్టెడ్​గానే ఉంటాయని స్పష్టం చేసింది.

ఇన్​స్టా మెసెంజర్

ఇన్​స్టాగ్రామ్ సైతం ఫేస్​బుక్ మెసెంజర్​తో అనుసంధానం చేసేందుకు ప్రయత్నిస్తోందని పలుజ్జీ వెల్లడించారు. ఇన్​స్టాగ్రామ్ డీఎం(డైరెక్ట్ మెసేజ్) ఫీచర్ ద్వారానే కాకుండా.. మెసెంజర్​ను ఉపయోగించి కూడా చాట్ వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు.

ఇదీ చదవండి- వన్​ప్లస్ నార్డ్​ ఫీచర్స్​ లీక్- ధర ఎంతో తెలుసా?

Last Updated : Feb 16, 2021, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.