Spacex Starship Rocket Launch : అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన 'స్పేస్‌ఎక్స్' నిర్మించి ప్రయోగించిన బాహుబలి రాకెట్ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. అయితే, ప్రయోగించిన ఎనిమిది నిమిషాల్లోనే రాకెట్ సిగ్నల్స్ కోల్పోవడం వల్ల లోపల జంట పేలుళ్లు సంభవించాయని స్పేస్‌ఎక్స్ ప్రకటించింది. దీంతో రెండోసారి కూడా స్టార్‌షిప్ ప్రయోగం విఫలమైనట్లయింది. ఇక స్థానిక కాలమానం ప్రకారం.. శనివారం (నవంబరు 18) ఉదయం దక్షిణ టెక్సాస్ తీరం నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. 400 అడుగుల(121 మీటర్లు) ఎత్తులో నిర్మించిన ఈ 'స్టార్‌షిప్-2' రాకెట్ ప్రపంచంలోనే అతిపెద్ద శక్తివంతమైన లాంఛ్ వెహికిల్.
-
Watch Starship’s second integrated flight test → https://t.co/bJFjLCiTbK https://t.co/cahoRQ72lm
— SpaceX (@SpaceX) November 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Watch Starship’s second integrated flight test → https://t.co/bJFjLCiTbK https://t.co/cahoRQ72lm
— SpaceX (@SpaceX) November 18, 2023Watch Starship’s second integrated flight test → https://t.co/bJFjLCiTbK https://t.co/cahoRQ72lm
— SpaceX (@SpaceX) November 18, 2023
"బూస్టర్ స్టార్‌షిప్‌ను విజయవంతంగా నింగిలోకి పంపించాం. అయితే కొద్ది నిమిషాల్లోనే రాకెట్ ఇంజిన్లలో మంటలు చెలరేగాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింది. దీంతో అప్పటివరకు సాఫీగా దూసుకుపోతున్న రాకెట్ ఒక్కసారిగా కూలిపోయింది."
-స్పెస్ఎక్స్ సైంటిస్టులు
విజయవంతమైతే ఇలా సాగేది..
దాదాపు గంటన్నర పాటు సాగే ఈ టెస్ట్ ఫ్లైట్‌లో భాగంగా.. ప్రయోగం ప్రారంభంలో విడిపోయే బూస్టర్‌ను గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో పడేలా చర్యలు తీసుకున్నారు. స్పేస్‌క్రాఫ్ట్ మాత్రం భూమి చుట్టు ఒక పరిభ్రమణం సాగించి, పసిఫిక్ మహాసముద్రంలో పడిపోయేలా రూపొందించారు. రెండు సెక్షన్ల (బూస్టర్, స్పేస్‌క్రాఫ్ట్) కలిగిన ఈ స్టార్‌షిప్ రాకెట్‌ను చందమామ, అంగారకుడిపై యాత్రలకు వీలుగా 'స్పేస్‌ఎక్స్' రూపొందించింది.
-
💫 Ad Astra 💫 pic.twitter.com/aCs85ULQWs
— Elon Musk (@elonmusk) November 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">💫 Ad Astra 💫 pic.twitter.com/aCs85ULQWs
— Elon Musk (@elonmusk) November 18, 2023💫 Ad Astra 💫 pic.twitter.com/aCs85ULQWs
— Elon Musk (@elonmusk) November 18, 2023
మొదటి ప్రయోగం కూడా ఫ్లాప్!
Spacex Starship First Test Flight : ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో స్టార్‌షిప్ మొదటి టెస్ట్‌ఫ్లైట్ విఫలమైంది. గాల్లోకి ఎగిరిన కేవలం 4 నిమిషాల్లోనే గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో ఈ రాకెట్ కుప్పకూలింది. దీంతో తొలి ప్రయోగం వైఫల్యంలో ఎదురైన అంశాలను సమగ్రంగా విశ్లేషించిన తర్వాత తాజాగా ప్రయోగించిన రెండో రాకెట్, దాని ల్యాంచ్ ప్యాడ్‌లను మరింత అభివృద్ధి చేసింది స్పేస్‌ఎక్స్. అమెరికా గగనతల నిర్వహణ సంస్థ (FAA) సూచనల ఆధారంగా స్టార్‌షిప్-2లో 57 కీలక మార్పులను చేశారు సైంటిస్టులు. దాదాపు ఏడు నెలల తర్వాత ఎఫ్‌ఏఏ అనుమతి అనంతరం రెండోసారి ఈ ప్రయోగాన్ని శనివారం చేపట్టింది స్పేస్ ఎక్స్. కాగా, దీని ఎత్తు 397 అడుగులుగా ఉంది.
విద్యార్థులకు ఉపయోగపడే టాప్-12 ల్యాప్టాప్స్ ఇవే!
'దక్షిణ గాజా నుంచి పారిపోండి'- పాలస్తీనీయులకు ఇజ్రాయెల్ తాజా హెచ్చరికలు