ETV Bharat / science-and-technology

52 స్టార్​లింక్​ ఉపగ్రహాలతో కక్ష్యలోకి స్పేస్​ ఎక్స్​ రాకెట్​

Starlink satellites: అపర కుబేరుడు స్పేస్​ ఎక్స్​ అధినేత ఎలన్​ మస్క్​కు చెందిన ఫాల్కన్​ 9 రాకెట్​ 52 స్టార్​లింక్​ శాటిలైట్​లను కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు సంస్థ పేర్కొంది. శనివారం ఈ రాకెటు ను స్పేస్​ ఎక్స్​ ప్రతినిధులు ప్రయోగించారు.

author img

By

Published : Dec 19, 2021, 5:24 AM IST

star link
స్టార్​ లింక్​

Starlink satellites: శనివారం తెల్లవారు జామున కాలిఫోర్నియా నుంచి ప్రయోగించిన స్పేస్​ఎక్స్​ రాకెట్​ 52 స్టార్​లింక్​ ఇంటర్నెట్​ ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకువెళ్లింది. ఇక్కడి తీర ప్రాంత వాండెన్​బర్గ్​ స్పేస్​ ఫోర్స్​ పీఠం నుంచి దూసుకుపోయిన ఫాల్కన్​ 9 రాకెటు పసిఫిక్​ మీదుగా రెండు దశలతో లక్ష్యం వైపుగా సాగింది.

మొదటి దశలో సముద్రంలోని స్పేస్​ ఎక్స్​ డ్రోన్​ షిప్​ మీదకు చేరుకొని, రెండో దశలో ఉపగ్రహాలతో కక్ష్యలోని దూసుకెళ్లినట్లు లాంచ్​ కమాండర్​ తెలిపారు. స్టార్​ లింక్​ అనేది ఉపగ్రహ ఆధారిత గ్లోబల్​ ఇంటర్నెట్​ విధానం. ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్​ సర్వీసులకు దూరంగా ఉన్న ప్రాంతాలను సైతం అనుసంధానం చేసేందుకు స్పేస్​ ఎక్స్​ మిషన్​ గత కొన్నేళ్లుగా దీనిపై పని చేస్తోంది.

ఇదీ చూడండి; satellite internet: మనకీ వచ్చేస్తోంది.. శాటిలైట్‌ ఇంటర్నెట్‌..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.