ETV Bharat / science-and-technology

వాట్సాప్ కొత్త ఫీచర్- మీ ఛాట్​లు సురక్షితం!

author img

By

Published : Jan 28, 2021, 7:47 PM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

డెస్క్​టాప్ యూజర్ల కోసం వాట్సాప్ సరికొత్త సేఫ్టీ ఫీచర్​ను తీసుకురానున్నట్లు ప్రకటించింది. సంబంధిత యూజర్​ తప్ప మరెవ్వరూ తన వాట్సాప్​ను డెస్క్​టాప్​కు లింక్ చేసేందుకు వీలు లేకుండా ఈ ఫీచర్​ పని చేయనున్నట్లు తెలిపింది. ఆ ఫీచర్ ఎలా పని చేస్తుందనే వివరాలు ఇప్పుడు చూద్దం.

Whatsapp new Security feature
వాట్సాప్ కొత్త సెక్యూరిటీ ఫీచర్

మెసేజింగ్ సేవల దిగ్గజం వాట్సాప్.. డెస్క్​టాప్ యూజర్లకు సరికొత్త, అదనపు భద్రతా ఫీచర్​ను అందుబాటులోకి తీసుకురానుంది. సంబంధిత యూజర్ మినహా.. ఇతరులెవ్వరూ డెస్క్​టాప్​​ వెర్షన్​ను, మీ ఛాట్​లను యాక్సెస్ చేసేందుకు వీలు లేకుండా త్వరలోనే దీనిని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

ఎలా పని చేస్తుంది?

ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. డెస్క్​టాప్​కు మీ వాట్సాప్ లింక్ చేసే ముందు ఫింగర్​ప్రింట్​ లేదా ఫేషియల్ అన్​లాక్ అడుగుతుంది. అలా అన్​లాక్ చేసిన తర్వాతే.. డెస్క్​టాప్​ క్యూఆర్​ కోడ్​ను యాక్సెస్ చేసే స్కానర్ ఓపెన్ అవుతుంది. దీని వల్ల మీరు మాత్రమే డెస్క్​టాప్​కు మీ వాట్సాప్​ను లింక్ చేసుకోలగలుగుతారు.

ఈ ఫీచర్​తో పాటు.. వెబ్​ వెర్షన్​ లేదా డెస్క్​టాప్​కు లాగిన్​ అయిప్పుడు పాపప్​ నోటిఫికేషన్ వస్తుందని వాట్సాప్ తెలిపింది.

యూజర్ల ఫింగర్​ప్రింట్​ సహా ఫేషియల్ డేటాను కూడా తాము యాక్సెస్ చేయలేమని వాట్సాప్ స్పష్టం చేసింది. ఆ డేటా మొత్తం యూజర్ల ఫోన్లలోనే ఉంటుందని తెలిపింది. గోప్యతా నిబంధనల మార్పుతో ఇటీవల వాట్సాప్ పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ వివరణ ఇచ్చింది.

ఇదీ చూడండి:ప్రపంచంలో ఐదో స్ట్రాంగెస్ట్ బ్రాండ్​గా 'జియో'​

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.