ETV Bharat / science-and-technology

డిటాచబుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్ - వివో కొత్త ఫోన్లు

చైనా స్మార్ట్​ఫోన్ దిగ్గజం వివో.. సరికొత్త కెమెరా ఫీచర్​ను అందుబాటులోకి తీసుకురానుంది. డిటాచబుల్ పాప్​ అప్​ సాంకేతికతతో వచ్చే ఈ ఫోన్​తో కెమెరాను తొలగించి ఎక్కడ నుంచైనా ఫొటోలు తీసుకునే సౌలభ్యం ఉంటుంది. మరి ఆ విశేషాలేంటో చూద్దామా..

vivo
వివో
author img

By

Published : Oct 12, 2020, 6:21 PM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

సరికొత్త కెమెరా ఫీచర్​తో స్మార్ట్​ఫోన్​ను త్వరలో ఆవిష్కరించనుంది చైనా దిగ్గజ సంస్థ వివో. ఐఎఫ్​ఈఏ పేరుతో రూపొందించిన ఈ కెమెరా కాన్సెప్ట్​కు ప్రతిష్టాత్మక 'రెడ్ డాట్ డిజైన్​ అవార్డు-2020' దక్కింది. ఇందులో పాప్​ అప్​ సెల్ఫీ కెమెరాను తొలగించే వీలు ఉండడం, రిమోట్​ కంట్రోల్​తో ఆపరేట్ చేయటం దీని ప్రత్యేకత.

ఈ తొలగించిన సెల్ఫీ కెమెరా స్థానంలో ఇతర కెమెరా సెన్సార్లను ఉపయోగించే వీలును కూడా కల్పించింది వివో. సందర్భాన్ని బట్టి ఫిష్ ఐ, అల్ట్రా వైడ్ యాంగిల్, టెలిఫొటో తదితర లెన్స్​ను అమర్చుకునే సదుపాయం ఉంటుంది. రిమోట్​ ద్వారా ఒకటి కన్నా ఎక్కువ కెమెరాల నుంచి ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు. ఈ డిటాచబుల్​ కెమెరా వాటర్​ ప్రూఫ్​ సాంకేతికతతో రానుంది.

ఎలా పనిచేస్తుంది?

పాప్​ అప్ కెమెరాను తొలగించి, ఎక్కడైనా ఉంచి ఫొటోలు వీడియోలు తీసుకోవచ్చు. దీని వల్ల వీడియో షేక్ అయ్యే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఒకవేళ ఫోన్​ నిర్దిష్ట దూరం దాటి వెళ్తే వినియోగదారులను అలర్ట్ చేస్తుంది. కెమెరా లొకేషన్​నూ చూపిస్తుంది. అంటే దీన్ని ఓ స్పై కెమెరాగా కూడా వాడుకోవచ్చు. ఈ డిటాచబుల్ కెమెరాకు ప్రత్యేకమైన బ్యాటరీ కూడా ఉంటుంది. ఫోన్​కు కనెక్ట్ చేసుకోవటం ద్వారా దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మరికొన్ని ఏళ్లలో డిటాచబుల్​ కెమెరా ఫోన్లకు మంచి డిమాండ్ ఉంటుందని వివో భావిస్తోంది. అయితే, ఈ ఫోన్​ మార్కెట్లోకి రావాలంటే మరికొంత కాలం ఆగాల్సిందేనని టెక్​ నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: కరోనా వేళ సత్తా చాటిన 'పీసీల' మార్కెట్‌

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.