ETV Bharat / science-and-technology

సామాన్యులకు గూగుల్ 'డిజిటల్ విజిటింగ్ కార్డులు'

ప్రముఖ వ్యక్తుల గురించి అంతర్జాలంలో వెతకటం చాలా సులభం. అయితే సామాన్యుల వ్యక్తిగత, వ్యాపార సంబంధ వివరాలను గుర్తించేందుకు వీలుగా కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది ఇంటర్నెట్​ దిగ్గజం గూగుల్. 'పీపుల్ కార్డ్స్'​ పేరుతో డిజిటల్ విజిటింగ్ కార్డ్ సేవలను భారత్​లోని వినియోగదారుల కోసం ప్రారంభించింది.

Google Search
పీపుల్ కార్డ్స్
author img

By

Published : Aug 11, 2020, 1:47 PM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా కొత్త సౌకర్యాలను అందుబాటులోకి తెస్తుంది గూగుల్‌. అదే విధంగా భారతీయ వినియోగదారుల కోసం పీపుల్​ కార్డ్స్​ సదుపాయాన్ని మంగళవారం ప్రారంభించింది.

అంతర్జాలం, సామాజిక మాధ్యమాల్లో వినియోగదారులు తమ ఉనికిని తెలియజెప్పేందుకు వీలుగా తొలిసారిగా 'వర్చువల్‌ విజిటింగ్‌ కార్డు' సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు వర్చువల్‌ విజిటింగ్‌ కార్డును రూపొందించుకుని.. ప్రస్తుతం ఉన్న తమ వెబ్‌సైట్లు, సామాజిక ప్రొఫైళ్లు, సమాచారానికి మరింత ప్రచారం కల్పించుకునే వీలు కల్పించింది గూగుల్.

ఒకే కార్డు..

వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, ఉద్యోగార్థులు, స్వయం ఉపాధి, ఫ్రీలాన్సర్లు ఇలా అనేక రంగాల వ్యక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని గూగుల్ సెర్చ్ ప్రొడక్ట్ మేనేజర్ లారెన్ క్లార్క్ తెలిపారు.

"మొబైల్‌ ఫోన్లలో ఆంగ్లంలో సెర్చ్‌ చేయడం ద్వారా ఈ వర్చువల్ విజిటింగ్‌ కార్డును పొందవచ్చు​. ఈ కార్డుపై క్లిక్ చేయగానే పేరు, వృత్తి, ప్రదేశం తెలుసుకోవచ్చు. అసభ్య, నేరపూరిత సమాచారాన్ని వెల్లడించకపోవడం సహా ఒక గూగుల్‌ ఖాతాకు ఒకే కార్డును పరిమితం చేసేలా అనేక రక్షణాత్మక చర్యలను ఇందులో పొందుపరిచాం."

- లారెన్ క్లార్క్, గూగుల్ సెర్చ్​ ప్రొడక్ట్ మేనేజర్​

కార్డ్ పొందటం ఎలా?

1. గూగుల్ అకౌంట్‌లో సైన్ ఇన్ కావాలి.

2. ఆ తర్వాత గూగుల్ సెర్చ్‌లో పేరు టైప్ చేయాలి. లేదా పేరు సెర్చ్ చేసి ‘యాడ్ మీ టు సెర్చ్’ అని మొబైల్​ ఫోన్లలో టైప్ చేయాలి.

3. ఆ తర్వాత కార్డు వివరాలు నమోదు చేసుకోవాలి.

4. ఇందులో వినియోగదారుడు తన గూగుల్ ఖాతాలోని ప్రొఫైల్​ ఫొటోతో సహా తమ వివరాలు, వెబ్‌సైట్ లింక్స్, సామాజిక మాధ్యమాల వివరాలు, ఫోన్ నెంబర్, ఈ- మెయిల్ ఐడీ తదితర విషయాలు నమోదు చేసుకోవచ్చు.

Google Search
పీపుల్ కార్డ్స్

అయితే పీపుల్ కార్డ్స్, సెర్చ్ ఫలితాలు అన్నీ మొబైల్​ ఫోన్లలోనే లభిస్తాయని గూగుల్ స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: టిక్​టాక్​ను మరిపించే రేసులో ఎవరు ముందు?

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.