ETV Bharat / science-and-technology

ఆఖరి క్షణంలో పేలిన స్పేస్​ఎక్స్ స్టార్​షిప్

author img

By

Published : Dec 10, 2020, 3:31 PM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

స్పేస్​ ఎక్స్​ నిర్వహించిన స్టార్​షిప్ ప్రయోగం చివరి నిమిషంలో సమస్య తలెత్తింది. దీంతో ల్యాండింగ్​కు ముందు స్టార్​షిప్ పేలిపోయింది. ఇంధన ట్యాంకుల్లో ఒత్తిడి తగ్గిపోవడం ఇందుకు కారణమని స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ తెలిపారు. ల్యాండింగ్​ సమయంలో ఇంజిన్లను మండించేసరికి స్టార్​షిప్ వేగంగా కిందకు పడిపోయిందని వెల్లడించారు. అయితే ఈ ప్రయోగం విజయవంతమైన ముందడుగు అని అన్నారు.

SpaceX launches Starship on highest test flight, crash-lands
ఆఖరు సెకనులో పేలిపోయిన స్పేస్​ఎక్స్ స్టార్​షిప్

ప్రైవేటు అంతరిక్ష దిగ్గజ సంస్థ స్పేస్​ఎక్స్ ప్రయోగించిన స్టార్​షిప్.. ల్యాండింగ్ చివరి క్షణంలో పేలిపోయింది. గాలిలో కొన్ని మైళ్ల పాటు ప్రయాణించిన ఈ అధునాతన నౌక.. ముందుగా నిర్ణయించిన ల్యాండింగ్ ప్రాంతానికే చేరుకుంది. అయితే ఆఖరి నిమిషంలో సమస్య తలెత్తి పేలింది. మొత్తం ప్రయోగం ఆరు నిమిషాల 42 సెకన్ల పాటు సాగింది.

ఈ అత్యాధునిక స్టార్​షిప్​ను 8 మైళ్లు (12.5 కిలోమీటర్లు) ఎత్తు వరకు పంపించి.. తిరిగి భూమిపై సురక్షితంగా నిలువుగా ల్యాండ్​ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంత ఎత్తు వరకు స్టార్​షిప్​ను పంపటం ఇదే తొలిసారి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'సమాచారం సేకరించాం'

అయితే ఈ ప్రయోగం 'విజయవంతమైన ముందడుగు' అని అభివర్ణించారు స్పేస్ఎక్స్ సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్. ఇంధన ట్యాంకుల్లో ఒత్తిడి తగ్గిందని, ల్యాండింగ్​ కోసం ఇంజిన్లను మండించేసరికి స్టార్​షిప్ వేగంగా కిందకు పడిపోయిందని చెప్పారు. అవసరమైన సమాచారం మొత్తం సేకరించినట్లు స్పష్టం చేశారు.

ఈ ప్రయోగం విజయవంతం కావడానికి మూడింట ఒకవంతు అవకాశాలు మాత్రమే ఉన్నాయని మస్క్ ఇదివరకే పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ప్రయోగం ఓసారి వాయిదా పడింది. బుధవారం జరపాలని నిర్ణయించగా.. ప్రయోగానికి 1.3 సెకన్లు మిగిలి ఉండగా నిలిపివేశారు.

స్పేస్​ఎక్స్​ ఇప్పటికే 5 స్టార్​షిప్​ టెస్ట్​ ఫ్లైట్​లను ప్రయోగించింది. అవి చాలా సాధారణ మోడల్స్​ కావటం వల్ల 490 అడుగులు (150 మీటర్ల) వరకే వెళ్లగలిగాయి. అయితే.. తాజాగా స్టార్​షిప్​ను స్టెయిన్​లెస్​ స్టీల్​ వర్షన్​లో మూడు రాప్టర్​ ఇంజిన్​లతో ప్రత్యేక ఆకృతిలో నిర్మించారు.

జెఫ్ బెజోస్ అభినందన

ప్రయోగం విషయంలో స్పేస్​ఎక్స్​కు ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీ బ్లూ ఆరిజిన్ అధినేత జెఫ్ బెజోస్ అభినందనలు తెలిపారు.

అంతరిక్ష ప్రయాణాల కోసం తయారుచేసిన ఉత్తమమైన వ్యోమనౌకగా దీన్ని పరిగణిస్తున్నారు. వీటి ద్వారా అంగారక​ గ్రహం మీదకు మనుషులను పంపించాలని మస్క్​ భావిస్తున్నారు. మరో ఆరేళ్లలో ఈ కళ సాకారమవుతుందని ఇదివరకే ఆశాభావం వ్యక్తం చేశారు.

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.