చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ భారత్‌లో రెండు కొత్త మోడళ్లను విడుదల చేసింది. రియల్మీ సీ12, సీ 15 పేర్లతో వీటిని అందుబాటులో తెచ్చింది. రెండు మోడళ్లను దాదాపు బడ్జెట్ రేంజ్‌లోనే తెచ్చింది రియల్మీ.
పెద్ద బ్యాటరీ సహా కెమెరాల సంఖ్య ఎక్కువగా ఉండటం ఈ మోడళ్ల ప్రత్యేకత.
3జీబీ ర్యామ్/32 జీబీ స్టోరేజ్‌తో సీ12 లభ్యం కానుంది. దీని ధరను రూ.8,999గా నిర్ణయించింది రియల్మీ. రియల్మీ సీ12 ఆగస్టు 24 నుంచి ఫ్లిప్‌కార్ట్ సహా రియల్మీ అధికారిక వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేసేందుకు వీలుంది.
సీ15మోడల్.. 3 జీబీ ర్యామ్/32 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్ రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. వీటి ధరలు వరుసగా రూ.9,999, రూ.10,999గా నిర్ణయించింది రియల్మీ. సీ 15 విక్రయాలు ఆగస్టు 27 నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్మీ అధికారిక వెబ్సైట్లలో ప్రారంభం కానున్నాయి.
రియల్మీ సీ12 ఫీచర్లు..
- 6.5 అంగుళాల డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్
- మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్
- వెనుకవైపు మూడు కెమెరాలు (13 ఎంపీ+2ఎంపీ+2ఎంపీ)
- 5 మెగా పిక్సెళ్ల ఏఐ సెల్ఫీ కెమెరా
- ఫింగర్‌ప్రింట్ సెన్సార్
- 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, రివర్స్ ఛార్జింగ్ సదుపాయం
రియల్మీ సీ 15 ఫీచర్లు
- 6.5 అంగుళాల డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్
- మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్
- వెనుకవైపు నాలుగు కెమెరాలు (13 ఎంపీ+8ఎంపీ+2ఎంపీ+2ఎంపీ)
- 8 మెగా పిక్సెళ్ల ఏఐ సెల్ఫీ కెమెరా
- ఫింగర్‌ప్రింట్ సెన్సర్
- 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ సదుపాయాలు.
ఈ ఫోన్లతో పాటే.. రియల్మీ బడ్స్ క్లాసిక్ పేరుతో హెడ్‌సెట్‌ను, ఓ టీషర్ట్‌ను విడుదల చేసింది కంపెనీ. వీటి ధరలు వరుసగా రూ.399, రూ.999గా నిర్ణయించింది. హెడ్సెట్ ఆగస్టు 24 నుంచి అమెజాన్, సంస్థ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉండనుంది. టీషర్ట్ మాత్రం సెప్టెంబర్ 4 నుంచి రియల్మీ అధికారిక వెబ్సైట్లో కొనుగోలు చేసేందుకు వీలుంది.
ఇదీ చూడండి:ఫేస్‌బుక్‌లోనూ 'షార్ట్ వీడియోస్' ఫీచర్