ETV Bharat / science-and-technology

గురువారం నుంచి గెలాక్సీ ఎం 31ఎస్​ మొబైళ్ల విక్రయాలు - శాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్​ అమ్మకాలు

శాంసంగ్ నుంచి ఇటీవలే విడుదలైన ఎం31 ఎస్ స్మార్ట్​ఫోన్లు గురువారం నుంచి కొనుగోలుకు అందుబాటులోకి రానున్నాయి. అమెజాన్ ప్రైమ్​ డే సేల్​లో భాగంగా వీటిని విక్రయిస్తోంది శాంసంగ్. ఈ మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్​ ఫీచర్లు, ధర వివరాలు ఇలా ఉన్నాయి.

price of samsung Galaxy M31s
శాంసంగ్ ఎం 31ఎస్​ ఫీచర్లు
author img

By

Published : Aug 5, 2020, 5:38 PM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

మిడ్​ రేంజ్​ సెగ్మెంట్​లో శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్​లో భారత మార్కెట్లో విడుదలైన ఎం31 ఎస్​ స్మార్ట్​ఫోన్లు గురువారం నుంచి కొనుగోలుకు అందుబాటులోకి రానున్నాయి. అమెజాన్ ప్రైమ్ ​డే సేల్​లో భాగంగా ఈ స్మార్ట్​ఫోన్లను విక్రయానికి ఉంచనుంది శాంసంగ్.

మిడ్ రేంజ్​ ఫోన్లలో ఇప్పటి వరకు ఉన్న ఫోన్లతో పోలిస్తే.. అదిరే ఫీచర్లను ఎం31ఎస్​లో పొందుపరిచింది శాంసంగ్. మరి ఆ ఫీచర్లు ఏమిటి? ఫోన్ ధర ఎంత? అనే వివరాలు ఇలా ఉన్నాయి.

ఫీచర్లు..

  • 6.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ ఎస్‌అమోలెడ్ డిస్‌ప్లే
  • గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్
  • ఎగ్జినోస్‌‌ 9611 చిప్​ సెట్
  • సైడ్ మౌంట్ ఫింగర్‌ ప్రింట్ సెన్సర్, ఫేషియల్‌ రికగ్నిషన్
  • వెనక వైపు నాలుగు కెమెరాలు ( 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5 ఎంపీ డెప్త్‌ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 5 ఎంపీ మాక్రో సెన్సార్‌)
  • 32 మెగా పిక్సెళ్ల పంచ్​ హోల్ సెల్ఫీ కెమెరా
  • ఒకే సారి ఫోటోలు, వీడియో తీయడం ఈ ఫోన్​ కెమెరా ప్రత్యేకత
  • 6,000 ఎంఏహెచ్​ బ్యాటరీ
  • 25 వాట్స్ ఫాస్ట్​ ఛార్జింగ్ సపోర్ట్ (90 నిమిషాల్లో ఫుల్​ ఛార్జింగ్)

ధర..

6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ రెండు వేరియంట్లలో ఈ మోడల్​ను అందుబాటులోకి తెచ్చింది శాంసంగ్. వీటి ధరలు వరుసగా రూ.19,499, రూ.21,499గా నిర్ణయించింది. అమెజాన్​ ప్రైమ్​డే సేల్​లో కొనుగోలు చేసే వారికి ప్రత్యేక డిస్కౌంట్లు లభించనున్నాయి.

అమెజాన్​తో పాటు శాంసంగ్ అధికారిక వెబ్​సైట్​, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలోనూ ఈ ఫోన్​ అందుబాటులో ఉండనుంది.

ఇదీ చూడండి:బంగారం కొత్త రికార్డు.. 10 గ్రాములు@రూ.56 వేలు

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.