ETV Bharat / science-and-technology

ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు జాగ్రత్త..!

ఆండ్రాయిడ్ మొబైల్‌ ఫోన్లే లక్ష్యంగా చేసుకొని దాడి చేస్తున్న రాన్సమ్‌వేర్ వైరస్‌ను గుర్తించినట్లు మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది. 'మాల్‌లాకర్‌.బి' గా పిలిచే రాన్సమ్‌వేర్‌ ఆన్‌లైన్ వేదికలు, వెబ్‌సైట్ల ద్వారా దాడి చేస్తుందని పేర్కొంది. అత్యంత ప్రమాదకరమైన వైరస్‌ ఆండ్రాయిడ్‌ యాప్స్‌లో దాగి ఉంటుందని తెలిపింది.

android
ఆండ్రాయిడ్‌
author img

By

Published : Oct 10, 2020, 5:05 PM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్ల యూజర్లు అప్రమత్తంగా ఉండాలని మైక్రోసాఫ్ట్‌ హెచ్చరిస్తోంది. ఆ మొబైల్‌ ఫోన్లే లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్న రాన్సమ్‌వేర్ వైరస్‌ను గుర్తించినట్లు మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది. 'మాల్‌లాకర్‌.బి'గా పిలిచే రాన్సమ్‌వేర్‌ ఆన్‌లైన్ వేదికలు, వెబ్‌సైట్ల ద్వారా దాడి చేస్తుందని పేర్కొంది. అత్యంత ప్రమాదకరమైన వైరస్‌ ఆండ్రాయిడ్‌ యాప్స్‌లో దాగి ఉంటుందని తెలిపింది.

వెబ్‌సైట్ల నుంచి యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలని మైక్రోసాఫ్ట్‌ సూచించింది. మాల్‌వేర్ కోడ్‌ సులువుగా మల్టిపుల్‌ ఫోన్స్‌కు విస్తరిస్తుందని చెప్పింది. యూజర్లు ఎవరైనా సరే తెలియని సోర్స్‌ నుంచి యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేయకుండా ఉండాల్సిందే. అయితే వ్యక్తిగత సమాచారం తస్కరిస్తుందనే దానికి ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది.

జరిమానా కట్టాలని..

రాన్సమ్‌వేర్‌ దాడి చేయడం వల్ల స్మార్ట్‌ఫోన్‌ స్క్రీన్‌ యాక్సెస్ కాకుండా అవుతుంది. అయితే ఇతర రాన్సమ్‌వేర్స్‌గా కాకుండా ఈ మాల్‌వేర్‌ ఫోన్‌ను ఎన్‌క్రిప్ట్‌ చేయదు. ఒక సంక్షిప్త సందేశంతో ఫోన్‌ డిస్‌ప్లేను నిలిచిపోయేలా చేస్తుంది. స్క్రీన్‌ను అన్‌లాక్‌ చేయాలంటే జరిమానా కట్టాల్సిందిగా అడుగుతుంది.

కాల్‌ నోటిఫికేషన్‌ను అవకాశంగా తీసుకుని రాన్సమ్‌వేర్‌ దాడి చేస్తుంది. ఆ సమయంలో యూజర్‌ తన ఫోన్‌ హోం బటన్‌నుగాని, యాప్‌ బటన్‌ను గానీ నొక్కడం వల్ల సంక్షిప్త సందేశంతో లాక్‌ పడిపోతుంది. కొత్త రాన్సమ్‌వేర్‌ వైరస్ వల్ల ఫైల్స్‌కు ఏమీ ఇబ్బంది లేకపోయినా.. డిస్‌ప్లే ఓపెన్‌ కాకపోవడంతోపాటు జరిమానా చెల్లించాల్సి వస్తుందని మైక్రోసాఫ్ట్‌ వివరించింది.

ఇదీ చూడండి: 'వర్క్‌ ఫ్రమ్‌ హోం'పై మైక్రోసాఫ్ట్‌ కీలక నిర్ణయం

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.