ETV Bharat / sports

PCBకి భజ్జీ స్ట్రాంగ్ కౌంటర్ - 'మీరు రావట్లేదని ఎవరూ బాధపడటం లేదు'

హైబ్రిడ్ మోడల్ విషయంలో పాక్ ట్విస్ట్ - స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హర్భజన్ సింగ్

Harbhajan Singh
Harbhajan Singh (ANI)
author img

By ETV Bharat Sports Team

Published : 19 hours ago

Harbhajan Singhs Strong Counter To Pakistan : టీమ్ఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తాజాగా మరోసారి పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై మండిపడ్డారు.ఇష్టం లేకపోతే భారత్‌కు రావొద్దని, ఇందులో తమకు ఎటువంటి బాధ లేదని ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. వచ్చే ఏడాది పాకిస్థాన్‌ వేదికగా నిర్వహించే ఛాంపియన్స్‌ ట్రోఫీపై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశాడు.

ఇప్పటికే ఆ దేశంలో భారత్ పర్యటించేది లేదని, హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించాలని ఐసీసీని బీసీసీఐ కోరింది. అయితే మొన్నటివరకు ఛాంపియన్స్‌ ట్రోఫీని హైబ్రిడ్‌ పద్ధతిలో నిర్వహించడానికి అస్సలు ఒప్పుుకోని పాక్​ ఇప్పుడు హైబ్రిడ్‌ పద్ధతికి అంగీకరిస్తామని పేర్కొంది. కానీ ఓ ట్విస్ట్ కూడా ఇచ్చింది. ఫ్యూచర్​లో పాకిస్థాన్ టీమ్ కూడా ఐసీసీ టోర్నీల కోసం భారత్‌కు వెళ్లబోమని, ఆ మ్యాచ్‌లను కూడా తటస్థ వేదికల్లో నిర్వహించేలా తమకు హామీ ఇవ్వాలంటూ పీసీబీ పేర్కొంది.

"మీకు ఇష్టం లేకుంటే భారత్‌కు రావొద్దు. ఈ విషయంలో మాకు ఎటువంటి బాధ లేదు. పాకిస్థాన్ టీమ్​ భారత్‌కు రాకపోతే ఎవరూ అంతగా పట్టించుకోవడం లేదు. మీరు ప్రస్తుత క్రికెటర్లను అడిగినా సరే వారు కూడా ఇదే విషయం చెబుతారు. పాక్‌లో పరిస్థితి భిన్నంగా ఉంటే, ఈ విషయంలో భారత్ తీరు వేరేవిధంగా ఉండేది. మొండి వైఖరిని వదిలేసి ఈ టోర్నమెంట్‌ను జరగనివ్వండి. మీరు దాన్ని ఎలాగో ఆపలేరు. శ్రీలంక, మలేసియాతో పాటు ఇతర దేశాలు ఆతిథ్యం ఇవ్వడానికి ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నాయి. పాకిస్థాన్‌లో పరిస్థితులు నార్మల్​గా అయ్యేంతవరకూ టీమ్ఇండియా అక్కడకి రాదు." అని హర్భజన్ పాక్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

ఇక ఇదే ఇంటర్వ్యూలో తాను గతంలో క్రికెట్‌ మ్యాచ్‌ల కోసం పాకిస్థాన్‌లో పర్యటించిన సమయాన్ని గుర్తు చేసుకున్నాడు భజ్జీ. "నేను అక్కడికి వెళ్లిన సమయంలో వారు మాకు అద్భుతమైన ఆతిథ్యాన్ని ఇచ్చారు. మేము బయటికి వెళ్లి భోజనం చేసిన ప్రతిసారి వారు మా దగ్గర నుంచి డబ్బులు తీసుకోలేదు. కొందరైతే ఏకంగా మాకు శాలువాలను కూడా బహుమతిగా ఇచ్చారు" అని హర్భజన్ తెలిపాడు.

'టీమ్ఇండియాలో ఆ కసి పెంచాడు'- విరాట్ కెప్టెన్సీపై భజ్జీ ప్రశంసల వర్షం! - Harbajan Singh About Virat Kohli

'రంజీల్లో ఆడడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదా?'- సెలక్టర్లపై భజ్జీ ఫైర్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.