అధిక వోల్టేజీ సూపర్ కెపాసిటర్ల కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ- హైదరాబాద్) పరిశోధకులు తక్కువ ఖర్చుతో మొక్కజొన్న ఊక నుంచి యాక్టివేటెడ్ కార్బన్ ఎలక్ట్రోడ్ను ఉత్పత్తి చేసే విధానాన్ని అభివృద్ధి చేశారు.
సాధారణంగా మొక్కజొన్న నుంచి వేరు చేసిన ఊకను కాల్చేస్తారు. అలా కాకుండా వాటిని ఎలక్ట్రోడ్లుగా మారిస్తే రైతులకు అదనపు ఆదాయం వస్తుందని పరిశోధకులు వెల్లడించారు. సంప్రదాయక సూపర్- కెపాసిటర్లతో పోలిస్తే మొక్కజొన్న ఊకతో చేసిన ఎలక్ట్రోడ్లు మెరుగైన పనితీరును చూపిస్తాయన్నారు.
''శక్తి నిల్వ పరికరాల అభివృద్ధిలో కార్బన్ ఆధారిత ఎలక్ట్రోడ్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి సాధారణంగా పాలిమర్లు, సేంద్రీయ పూర్వగాములు, అధిక స్వచ్ఛత వాయువుల వంటి ఖరీదైన వాటి నుంచి ఉత్పత్తి చేయబడతాయి. బయోమాస్ నుంచి కార్బన్ ఎలక్ట్రోడ్ల ఉత్పత్తి చాలా సులువైన ప్రక్రియ''
-పరిశోధకులు
ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో పెద్దమొత్తంలో మొక్కజొన్న ఊక వ్యర్థాలను ఉత్పత్తి అవుతుంది. ఇందువల్ల వీటిని ఎలక్ట్రోడ్ పదార్థంగా మార్చడం ద్వారా అనేక లాభాలు పొందవచ్చు. ఐఐటీ-హెచ్లోని మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజినీరింగ్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న అతుల్ సురేష్ దేశ్పాండే, హైదరాబాద్ లోని ఏఆర్సీఐలో అసోసియేట్ డైరెక్టర్ అయిన టి.ఎన్.రావు కలిసి పరిశోధకుల బృందానికి నాయకత్వం వహించారు.
ఇవీ చూడండి: కరోనాతో ఆర్టీసీకి తగ్గిన ఆదాయం.. పార్శిల్పైనే ఆశలు