ETV Bharat / science-and-technology

'20 ఏళ్లు మన్నే బ్యాటరీ- ఆ జనరేటర్లకు ప్రత్యామ్నాయం' - ఐఐటీ దిల్లీ పరిశోధకుల సరికొత్త ఫ్లో బ్యాటరీ

పర్యావరణానికి హాని చేయని సరికొత్త ఫ్లో బ్యాటరీని తయారు చేశారు ఐఐటీ దిల్లీ పరిశోధకులు. డీజిల్​ జనరేటర్లకు ప్రత్యామ్నాయంగా.. వాటి కన్నా ఎక్కువ సామర్థ్యంంలో ఈ బ్యాటరీ పని చేస్తుందని వారంటున్నారు. ఈ బ్యాటరీ విశేషాలు, ప్రత్యేకతలను.. ఐఐటీ దిల్లీ ప్రొఫెసర్ అనిల్ వర్మ 'ఈటీవీ భారత్​'తో పంచుకున్నారు. ఆ విశేషాలు చూద్దాం.

IIT launches VRF battery
ఐఐటీ దిల్లీ సరికొత్త పర్యావరణ హితమైన బ్యాటరీ విడుదల
author img

By

Published : Oct 25, 2020, 5:59 PM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

ఐఐటీ దిల్లీకి చెందిన సస్టైనబుల్ ఎన్విరానర్జీ రీసెర్చ్ ల్యాబ్ (ఎస్​ఆర్ఈ​ఎల్​).. సరికొత్త ఆవిష్కరణ చేసింది. వాయు కాలుష్యాన్ని తగ్గించే వెనాడియం రెడాక్స్ ఫ్లో బ్యాటరీ (వీఆర్​ఎఫ్​బీ)ని తయారు చేసింది. ఈ బ్యాటరీ 20 ఏళ్ల వరకు మన్నికగా పని చేస్తుందని ఎస్​ఆర్ఈ​ఎల్ పరిశోధకులు అంటున్నారు.

VRF battery
వీఆర్​ఎఫ్​ బ్యాటరీ

ఈ బ్యాటరీ గ్రామీణ విద్యుదీకరణ, ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్​, దేశీయ వాణిజ్య పవర్​ బ్యాకప్.. అవసరాల కోసం సమర్థంగా పునరుత్పాదక విద్యుత్​ను నిల్వ చేసుకుని వినియోగించుకునేందుకు ఉపయోగపడుతుందని ఎస్ఈఆర్​ఎల్ తెలిపింది. ఇది కార్బన్ రహిత పర్యావరణానికి బాటలు వేస్తుందని ధీమా వ్యక్తం చేసింది.

VRBF specialization
వీఆర్ఎఫ్​బీ​ ప్రత్యేకత

డీజిల్ బ్యాటరీకి సరైన ప్రత్యామ్నాయం..

దేశ రాజధాని దిల్లీలో రోజురోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు.. ఈ నెల 15 నుంచి డీజిల్ జనరేటర్ల వినియోగాన్ని నిషేధించింది (అత్యవసరాలకు తప్పా).. పర్యావరణ కాలుష్య అథారిటీ (ఈపీసీఏ). గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్​ ప్లాన్​లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో డీజిల్ జనరేటర్లకు.. వీఆర్​ఎఫ్​బీ సమర్థమైన ప్రత్యామ్నాయం కాగలదని అంటున్నారు.. ఐఐటీ దిల్లీ ఎస్​ఈఆర్​ఎల్​, కెమికల్ ఇంజినీరింగ్ డిపార్ట్​మెంట్ ప్రొఫెసర్ అనిల్ వర్మ. ఈ బ్యాటరీకి సంబంధించి పలు కీలక విషయాలను 'ఈటీవీ భారత్​'తో పంచుకున్నారు.

"వీఆర్​ఎఫ్​బీ కాలుష్య రహితం (ఉద్గారాలు విడుదల చేయదు), ఇది సురక్షితం, పర్యావరణ హితం. ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది. ప్లో బ్యాటరీ, సంప్రదాయ బ్యాటరీల మధ్య ప్రధాన తేడా ఏమిటంటే ఇండిపెండెంట్ పవర్​ స్కేలింగ్ ఎనర్జీ సామర్థ్యం. ఫ్లో బ్యాటరీ కిలో వాట్​ నుంచి మెగా వాట్ వరకు విద్యుత్​ను నిల్వ చేసుకోగలదు. సంప్రదాయ బ్యాటరీతో పోలిస్తే తక్కువ ఖర్చులో ఎక్కువ సమయం బ్యాటరీ అవసరాలకు వీఆర్​ఎఫ్​బీ సరిగ్గా సరిపోతుంది."

-ప్రొఫెసర్ అనిల్ వర్మ, ఐఐటీ దిల్లీ ప్రొఫెసర్

మరో ఆరు నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో సిద్ధమవుతుందని.. ఏడాది లోపు మార్కెట్​లోకి వస్తుందని అనిల్​ వర్మ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రొఫెసర్ అనిల్​ వర్మ నేతృత్వంలోని ఎస్​ఈఆర్​ఎల్ బృందం ఐదు పేటెంట్లను కూడా ఫైల్ చేసింది.

VRF BATTERY FEATURES
వీఆర్ఎఫ్​బీ ఫీచర్లు

ఇదీ చూడండి:భారత్​ చేరిన మోదీ రెండో 'ప్రత్యేక' విమానం

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.