ఇటీవల వీడియో కంటెంట్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. శాటిలైట్ టీవీల నుంచి ఓటీటీ ప్లాట్ ఫామ్‌లలో వచ్చే ఎంటర్టైన్మెంట్ కంటెంట్‌ను.. పెద్ద సంఖ్యలో చూస్తున్నారు ప్రేక్షకులు.
కొన్నాళ్ల వరకు శాటిలైట్ టీవీలో వచ్చే వీడియో కంటెంట్‌ను, ఓటీటీల్లో వచ్చే కంటెంట్‌ను వేర్వేరు డివైజ్‌ల ద్వారా చూడాల్సి వచ్చేంది. ఇప్పుడు ఆ సమస్యను తీర్చేందుకు స్మార్ట్ సెట్‌టాప్ బాక్స్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీటితో టీవీలోనే శాటిలైట్ ఛానెళ్లతో పాటు ఓటీటీ కంటెంట్‌ను చూచొచ్చు.
మరి ప్రస్తుత అవసరాలను బట్టి ఉత్తమ సెట్‌టాప్ బాక్స్‌ను ఎలా ఎంపిక చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మొదట మీకు ఎలాంటి సెటాప్ బాక్స్ కావాలో నిర్ణయించుకోవాలి. శాటిలైట్ టీవీ మాత్రం వస్తే చాలు అనుకునేవారు సాధారణ సెట్‌టాప్ బాక్స్‌ను తీసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేయాలన్నా, ఓటీటీ కంటెంట్ చూడాలన్నా... ఆండ్రాయిడ్ సెట్‌టాప్ బాక్స్‌లను తీసుకోవాలి.
స్మార్ట్ బాక్స్‌లు..
సాధారణ సెట్‌టాప్ బాక్స్‌లతో పోలిస్తే.. ఆండ్రాయిడ్ సెట్‌టాప్ బాక్స్‌ల ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. విడివిడిగా వేర్వేరు సేలకు అయ్యే ఖర్చుతో పోలిస్తే వీటి ధర తక్కువనే చెప్పాలి.
ప్రస్తుతం మార్కెట్లో ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ బాక్స్, టాటా స్కై బింజ్+ వంటివి రూ.4,000 లోపు అందుబాటులో ఉన్నాయి.
ఆపరేటర్లు..
మీరు ఎలాంటి సెట్‌టాప్ బాక్స్ కావాలో నిర్ణయించుకున్న తర్వాత.. ఆపరేటర్‌ను ఎంపిక చేసుకోవాలి.
టాటా స్కై, డిష్ టీవీ, డీ2హెచ్, ఎయిర్టెల్ డిజిటల్ టీవీ, సన్ డైరెక్ట్ వంటి ఆపరేటర్లు మీ అవసరాలను బట్టి మల్టిపుల్ సెట్‌టాప్ బాక్స్‌లను అందిస్తున్నాయి. ఇందులో మీ బడ్జెట్‌కు ఏది సరిపోతుందో చూసుకోవాలి.
మీకు ఓకే ఇంట్లో ఒకటి మించి కనెక్షన్లు అవసరమైతే ఏ ఆపరేటర్ తక్కువ ఛార్జ్ చేస్తున్నారనేది బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది.