ETV Bharat / science-and-technology

'డిజిటల్​'​ వ్యసనానికి చైనా కొత్త చట్టంతో బ్రేకులు! - addiction induced apps ban in china

పబ్​జీ తరహాలో పిల్లలు, యువతలో వ్యసనంగా మారే డిజిటల్​ కంటెంట్​కు ఇకపై చెక్​ పెట్టనుంది చైనా. ఇందుకోసం ఓ నూతన చట్టాన్ని తీసుకొస్తోంది.

addict news
'డిజిటల్​ కంటెంట్'​పై చైనా నయా ఆంక్షలు
author img

By

Published : Oct 25, 2020, 4:48 PM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

ఆన్​లైన్​లోని డిజిటల్​ కంటెంట్​కు చిన్నారులు, యువత బానిసలవ్వకుండా ఉండటానికి చైనా సరికొత్త నిర్ణయం తీసుకుంది. వ్యసనంగా మార్చేసే ఏ కంటెంట్​పై అయినా ప్రభుత్వం లేదా తల్లిదండ్రులు చర్యలు తీసుకునేలా కొత్త నిబంధనలు అమలు చేయనుంది. వాటిని తన రాజ్యాంగంలోనూ చట్టాలుగా పొందుపర్చనుంది.

నిషేధమే..

మొబైల్​, అంతర్జాలం, డేటా వినియోగం పెరిగాక చిన్నారులు ఎక్కువగా పబ్​జీ వంటి ఆన్​లైన్​ గేమ్​లు, కంటెంట్​కు బానిసలు అవుతున్నారు. వాటిని నిషేధించినా, ఆడొద్దని హెచ్చరించినా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో చైనా తాజా నిర్ణయం తీసుకుంది. పిల్లలకు వ్యసనంగా మారే ఆన్​లైన్​ సేవలు, వస్తువులపై చైనా ప్రభుత్వం నిషేధం విధించనుంది. వీటితో పాటు చిన్నారులు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేకమైన హక్కులు రానున్నాయి. వాటి సాయంతో ఆన్​లైన్​ వేధింపులపైనా చర్యలు తీసుకోవచ్చు. ఆన్​లైన్​లో ఏదైనా కంటెంట్​పై అభ్యంతరం వ్యక్తం చేస్తే.. సర్వీస్​ ప్రొవైడర్లు వాటిని బ్లాక్​ చేయడం, తక్షణమే తొలగించడం చేయాల్సి ఉంటుంది.

జూన్​ నుంచి అమలు..

సామాజిక మాధ్యమాలు, యాప్​లు, లైవ్​స్ట్రీమ్​ సర్వీసులు, గేమ్​ డెవలపర్లు ఇకపై తమ ఉత్పత్తులు, సర్వీసుల్లో సరికొత్త ఆప్షన్లు తీసుకురానున్నారు. యూజర్​.. యాప్​ లేదా సర్వీసు వాడేందుకు సమయాన్ని నిర్దేశించనున్నారు. అయితే ఇది పిల్లలకు మాత్రమే అమలు చేయనున్నారు. మీడియా కథనాల ప్రకారం.. వచ్చే ఏడాది జూన్​ 1 నుంచి ఈ కొత్త చట్టం అమలులోకి రానుంది. దీని వల్ల గేమ్​ డెవలపర్లు, లైవ్​ స్ట్రీమ్​ సర్వీసులు అందించేవారు.. తమ యూజర్లను కంటెంట్​కు బానిసలు​ కాకుండా జాగ్రత్తలు పాటించనున్నారు.

పబ్​జీలో అమలు..

ప్రస్తుతం పబ్​జీ ఆన్​లైన్​ గేమ్​ తయారీదారులు కొత్త నిబంధనలను అమలు చేస్తున్నారు. యూజర్​ నిరంతరాయంగా రెండు గంటలు ఆడితే.. కాసేపు విరామం తీసుకోవాలని తక్షణమే హెచ్చరిక జారీ చేస్తుంది. అదే ఐదు గంటలకు మించి ఆడితే.. 24 గంటల పాటు యాప్​ను వాడేందుకు వీలు లేకుండా యూజర్​ను బ్లాక్​ చేస్తుంది. ఈ నిర్ణయంతో గంటల కొద్దీ యాప్​ వాడేందుకు వీలుండదు.

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.