సుదూర గ్రహశకలానికి సంబంధించిన నమూనాలతో కూడిన క్యాప్సూల్ జపాన్ చేతికి చేరింది. దీనిపై పరిశోధనలు జరిపి.. సౌర కుటుంబం, భూమి పుట్టుక గురించి మరిన్ని వివరాలను కనుగొనాలని భావిస్తోంది ఆ దేశం.
భూమికి 30 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న రియూగు అనే గ్రహశకలం నుంచి ఏడాది కిందట ఈ నమూనాలను హయబుసా-2 సేకరించింది. శనివారం భూమికి 2.2 లక్షల కిలోమీటర్ల ఎత్తులో ఉండగా.. క్యాప్సూల్‌ను హయబుసా-2 విడిచిపెట్టింది. అది ఆస్ట్రేలియా గడ్డ మీద పడింది. ఆ క్యాప్సూల్నే జపాన్‌కు అందించింది ఆస్ట్రేలియా.
![Capsule with asteroid samples arrives in Japan for research](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9802011_c.jpeg)
ఉల్క ఉపరితలం కింది భాగం నుంచి సేకరించిన సమూనాల్లో 4.6 బిలియన్ సంవత్సరాలకు సంబంధించిన డేటా ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. త్వరలోనే పరిశోధనలు ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నట్టు పేర్కొన్నారు. ఈ నమూనాలను సంగమిహారా కేంద్రంలో ఉంచినట్టు స్పష్టం చేశారు. తమ అధ్యయనం ముగిసిన అనంతరం అంతర్జాతీయ అంతరిక్ష సంస్థలతో ఈ నమూనాలను పంచుకోనున్నట్టు వివరించారు.
ఇదీ చూడండి:- ఆ గ్రహశకల నమూనాల్లో ఉన్న రహస్యాలేంటి?