ETV Bharat / science-and-technology

'5జీ​'తో ఐఫోన్​ 12 సిరీస్​- ధరలు ఇలా... - iPhone 12pro max

ప్రముఖ స్మార్ట్​ఫోన్ సంస్థ యాపిల్ 5జీ నెట్​వర్క్​ సపోర్ట్​ ఐఫోన్​ను ఆవిష్కరించింది.​ ఐఫోన్​12 సిరీస్​లో నాలుగు సరికొత్త ఫోన్​లను మార్కెట్​లోకి విడుదల చేసింది. ​వాటి ధర ఎంత? ఫీచర్లు ఏంటో చూద్దాం.

Apple unveils new iPhones for faster 5G wireless networks
5జీ నెట్​వర్స్​తో యాపిల్​ ఐఫోన్​12 సిరీస్​
author img

By

Published : Oct 14, 2020, 3:23 AM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

స్మార్ట్​ ఫోన్ దిగ్గజం​ యాపిల్ 5జీ ఫోన్​లను మార్కెట్​లోకి విడుదల చేసింది. ఐఫోన్​12 సిరీస్​లో నాలుగు ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. ఐఫోన్​12, ఐఫోన్​12ప్రో అక్టోబరు 30 నుంచి భారతీయ మార్కెట్లోకి రానుండగా... ఐఫోన్​12 మినీ, ఐఫోన్​12 ప్రో మ్యాక్స్​ నవంబరు 13 నుంచి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

మూడు వేరియంట్లలో..

ఈ ఫోన్లను 64జీబీ, 128జీబీ, 256జీబీ స్టోరేజీ వేరియంట్ల రూపంలో అందిస్తోంది యాపిల్​. వైర్​లెస్​ ఛార్జింగ్​ సాంకేతికతో వీటిని యాపిల్​ రూపొందించింది. ఐఫోన్​12 సిరీస్ ఫోన్లలో​ అధునాతన ఏ14 బయోనిక్ చిప్​ను అమర్చింది యాపిల్. ఇది ఐఫోన్​ 11 సిరీస్​లో వాడిన ఏ13 కంటే 60 శాతం వేగంగా గ్రాఫిక్స్​ను అందిస్తుంది.

ఐఫోన్​12 ఫీచర్లు

ఐఫోన్​ 12 తెలుపు, నలుపు, ఎరుపు, నీలం, పచ్చ రంగుల్లో లభిస్తుంది.

  • 5జీ నెట్​వర్క్​ సపోర్ట్​
  • 6.1 సూపర్​ రెటీనా ఎక్స్​డీఆర్​ డిసిప్లే
  • అధునాతన ఏ14 బయోనిక్​ చిఫ్
  • 12ఎంపీ కెమెరా
  • ధర రూ.79,900

ఐఫోన్​ 12మినీ

ఐఫోన్​12 మినీలో కూడా ఐఫోన్​12లో ఉన్న ఫీచర్లే ఉంటాయి. అయితే సైజ్​ లోనే తేడా ఉంటుంది.

  • 5.4 అంగుళాల డిస్​ప్లే
  • ధర రూ.69,900

ఐఫోన్​ 12ప్రో

ఐఫోన్​ 12ప్రోను గ్రాఫైట్, సిల్వర్​, గోల్డ్​, పసిఫిక్​ బ్లూ రంగుల్లో ప్రవేశపెట్టింది యాపిల్​. ఐఫోన్​12, ఐఫోన్​12 మినీలతో పోల్చుకుంటే కెమెరా ఫీచర్లు మెరుగ్గా ఉంటాయి.

  • ఈ ఫోన్​ 128జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరేజీ వేరియంట్లో లభిస్తుంది.
  • డాల్బీ విజన్​ హెచ్​డీఆర్​
  • హెచ్​డీఆర్​ ప్రో రికార్డింగ్​ సపోర్ట్.
  • ధర రూ. 1,19,900

ఐఫోన్​12 ప్రో మ్యాక్స్​

  • 6.7 అంగుళాల సూపర్​ రెటీనా ఎక్స్​డీఆర్​ డిస్​ప్లే
  • అధునాతన ఏ14 బయోనిక్​ చిఫ్
  • ఐఫోన్ 12 ప్రో మాక్స్‌లో యాపిల్​ ప్రవేశపెట్టిన అతి ముఖ్యమైన ఫీచర్ 10-బిట్ హెచ్‌డీఆర్ రికార్డింగ్​ను సపోర్ట్​ చేస్తుంది.
  • డాల్బీ విజన్​ హెచ్​డీఆర్​
  • హెచ్​డీఆర్​ ప్రో రికార్డింగ్ సపోర్ట్.
  • ధర రూ. 1,29,900

ఇదీ చూడండి: యాపిల్ నుంచి బడ్జెట్ ఐఫోన్ విడుదల​.. ధరెంతో తెలుసా?

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.