ETV Bharat / science-and-technology

అమెజాన్​ 'అలెక్సా'లో ఇక బిగ్​బీ వాయిస్​ - అలెక్సా పరికరాల్లో అమితాబ్​ వాయిస్​

అమెజాన్​ అలెక్సా.. త్వరలోనే బాలీవుడ్​ నటుడు అమితాబ్​ బచ్చన్​ వాయిస్​ను వినిపించనుంది. వినియోగదారులకు వినూత్న అనుభూతినిచ్చే ఈ ఫీచర్​ 2021లో అందుబాటులోకి రానుంది.

Amitabh Bachchan to lend voice on Alexa devices
అమెజాన్​ అలెక్సాలో త్వరలోనే బిగ్​బీ వాయిస్​
author img

By

Published : Sep 14, 2020, 5:26 PM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. తన వాయిస్ అసిస్టెంట్​ 'అలెక్సా'లో త్వరలోనే బాలీవుడ్​ మెగాస్టార్​ అమితాబ్​ బచ్చన్​ వాయిస్​ను తీసుకురానుంది. బిగ్​బీ భాగస్వామ్యంతో తమ వినియోగదారులు సరికొత్త అనుభూతి పొందుతారని అమెజాన్ తెలిపింది.

వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి రానున్న ఈ ఫీచర్​ కోసం.. అమితాబ్​, అలెక్సా వాయిస్​ను రూపొందిస్తున్నాయి. వినియోగదారులు బిగ్​బీ వాయిస్​ను ఆస్వాదించాలంటే అలెక్సా వాయిస్ ఎనేబుల్డ్​ పరికరాలను కొనుగోలు చేసుకోవాలి. వీటి ద్వారా జోకులు, కవితలు, ప్రేరణాత్మక సూక్తులు, వాతవరణ తదితర అంశాలను అమితాబ్​ వాయిస్​లో వినియోగదారులు వినే వెసులుబాటు ఉంటుంది.

అమెజాన్​తో కలిసి భాగస్వామ్యం నెలకొల్పినందుకు ఆనందం వ్యక్తం చేశారు అమితాబ్​.

"టెక్నాలజీ.. ఎల్లప్పుడూ మార్పులకు అనుగుణంగా సినిమాలు, టీవీ షోలు, పోడ్​క్యాస్ట్​లలో నాకు చాలా అవకాశాలిచ్చింది. ఇప్పుడు అలెక్సాతో నా గాత్రం పంచుకోవడం సంతోషంగా ఉంది. ఈ వాయిస్​ టెక్నాలజీతో ప్రేక్షకులను అలరించేందుకు నా వంతు కృషి చేస్తా."

- అమితాబ్​ బచ్చన్​, బాలీవుడ్​ నటుడు

అమెజాన్​ డిజిటల్​ అసిస్టెంట్​ అలెక్సా ఎకో పరికరాలు, వాయిస్​ రిమోట్​తో పనిచేసే ఫైర్​ టీవీ స్టిక్​, ఉచితంగా లభించే అలెక్సా యాప్​, అమెజాన్​ యాప్​లలో ఈ ఫీచర్​ లభించనుంది.

ఇదీ చదవండి: అమెజాన్​లో లక్ష ఉద్యోగాల నియామకం

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.