Samsung Galaxy Tab A8: శాంసంగ్ గెలాక్సీ సిరీస్‌లో కొత్త ట్యాబ్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఏ8 పేరుతో దీన్ని పరిచయం చేసింది. బడ్జెట్ శ్రేణిలో తీసుకొచ్చిన ఈ ట్యాబ్‌లో ఎలాంటి ఫీచర్లున్నాయి.. ధరెంత.. ఎప్పటి నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయనేది చూద్దాం.
Samsung Galaxy Tab A8 Specifications
- ఈ ట్యాబ్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఓఎస్‌తో పనిచేస్తుంది.
- ఇందులో 10.5 అంగుళాల డబ్ల్యూఎక్స్‌జీఏ టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఇస్తున్నారు.
- ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉపయోగించారు.
- వెనుకవైపు 8 ఎంపీ ప్రధాన కెమెరా ఇస్తున్నారు.
- ముందుభాగంలో 5 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు.
- డాల్బీ అట్‌మోస్ సపోర్ట్‌తో క్వాడ్ స్పీకర్ ఇస్తున్నారు.
- 7,040 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.
- 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
- ఈ ట్యాబ్‌ను వైఫై, ఎల్‌టీఈ వేరియంట్లలో తీసుకొచ్చారు.
- 3 జీబీ ర్యామ్/32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వైఫై వేరియంట్ ధర రూ.17,999 కాగా, వైఫై+ఎల్‌టీఈ వేరియంట్ ధర రూ.21,999.
- 4 జీబీ ర్యామ్/64 జీబీ వైఫై వేరియంట్ ధర రూ.19,999, వైఫై+ఎల్‌టీఈ మోడల్ ధర రూ.23,999గా కంపెనీ నిర్ణయించింది.
జనవరి 17 నుంచి శాంసంగ్, అమెజాన్ వెబ్‌సైట్ల ద్వారా కొనుగోలు చేయొచ్చు.
ఇదీ చూడండి: VIVO Y33T Phone: 'వై' సిరీస్‌లో వివో కొత్త ఫోన్.. ధర, ఫీచర్లివే!