ETV Bharat / science-and-technology

DarkMode: డార్క్‌మోడ్‌ మంచిదేనట.. ఎందుకో తెలుసా? - డార్క్‌మోడ్‌

ఎక్కువ సమయం ఫోన్లతో గడిపేవారు.. కళ్లకు ఇబ్బంది కలగకుండా డార్క్​ మోడ్​ను ఉపయోగిస్తుంటారు. అయితే డార్క్‌మోడ్‌ వల్ల మరో ముఖ్యమైన ఉపయోగం ఉందంటున్నారు పరిశోధకులు. ఫోన్‌ లేదా ఇతర డివైజ్‌లలో డార్క్‌మోడ్ ఎనేబుల్ చేయడం వల్ల వాటి బ్యాటరీ ఆదా అవుతున్నట్లు గుర్తించినట్లు తెలిపారు.

డార్క్‌మోడ్‌
DarkMode
author img

By

Published : Aug 5, 2021, 3:46 PM IST

ఫోన్ ఎక్కువగా ఉపయోగించేవారు కళ్లకు శ్రమ తగ్గించేందుకు ఏం చేయాలంటే.. ఠక్కున గుర్తొచ్చే సమాచాధానం డార్క్‌మోడ్‌. స్మార్ట్‌ గ్యాడ్జెట్స్ వినియోగం పెరిగాక మొబైల్, ల్యాప్‌టాప్, ట్యాబ్ నుంచి బ్రౌజర్‌, వెబ్‌సైట్‌, యాప్‌ వరకు డార్క్‌మోడ్‌ థీమ్‌లు యూజర్‌కి అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల కళ్లకు శ్రమ తగ్గటంతోపాటు ఫోన్ తెర మన్నికను కూడా పెంచుతుంది.

DarkMode
డార్క్‌మోడ్‌

మరో ఉపయోగం..

అయితే తాజాగా డార్క్‌మోడ్‌ వల్ల మరో ముఖ్యమైన ఉపయోగం ఉందంటున్నారు పర్డ్యూ యూనివర్శిటీ పరిశోధకులు. ఫోన్‌ లేదా ఇతర డివైజ్‌లలో డార్క్‌మోడ్ ఎనేబుల్ చేయడం వల్ల వాటి బ్యాటరీ ఆదా అవుతున్నట్లు గుర్తించినట్లు తెలిపారు.

ఇందుకోసం వారు ఆండ్రాయిడ్ బ్యాటరీ+ అనే టూల్ అభివృద్ధి చేశారు. దీని సాయంతో పిక్సెల్ 2, మోటో జెడ్3, పిక్సెల్‌ 4, పిక్సెల్ 5 ఫోన్లలో డార్క్‌మోడ్‌ పనితీరును పరీక్షించినట్లు తెలిపారు.

బ్యాటరీ ఆదా..

ఈ ఫోన్లలో క్యాలిక్యులేటర్‌, గూగుల్ క్యాలెండర్‌, గూగుల్ మ్యాప్స్, గూగుల్ న్యూస్‌, గూగుల్ న్యూస్‌, యూట్యూబ్ యాప్స్‌లో డార్క్‌మోడ్ ఎనేబుల్ చేసి పరీక్షించగా బ్యాటరీ ఆదా అవుతున్నట్లు గుర్తించామని వెల్లడించారు. ఫోన్‌లో 30 నుంచి 50 శాతం బ్రైట్‌నెస్ ఉంచి లైట్ మోడ్‌ నుంచి డార్క్‌మోడ్‌కి మారినప్పుడు 3 నుంచి 9 శాతం బ్యాటరీ ఆదా అవుతుందని తెలిపారు. ఇదేవిధంగా 100 శాతం బ్రైట్‌నెస్‌తో సుమారు 47 శాతం బ్యాటరీ ఆదా చెయ్యొచ్చని పరిశోధన బృందానికి నాయకత్వం వహించిన చార్లీ హు అనే ప్రొఫెసర్ తెలిపారు.

కచ్చితమైన అంచనా..

"యూజర్స్‌కి డార్క్‌మోడ్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ.. వాటిని కొలిచేందుకు ఎలాంటి టూల్స్‌ని ఇప్పటివరకు అభివృద్ధి చేయలేదు. ప్రస్తుతం మేం రూపొందించిన ఆండ్రాయిడ్ బ్యాటరీ+ టూల్‌ భవిష్యత్తులో బ్యాటరీ ఆదాచేసే యాప్స్‌ని అభివృద్ధి చేసేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. అలానే మేం తయారు చేసిన ఈ టూల్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే డార్క్‌మోడ్‌లో ఉన్నప్పుడు ఫోన్‌ ఎంత బ్యాటరీ ఉపయోగిస్తుందనేది కచ్చితంగా అంచనా వేస్తుంది"అని చార్లీ హు అన్నారు.

దీంతోపాటు లైట్‌మోడ్‌లో ఫోన్ బ్రైట్‌నెస్‌ 20 శాతంగా ఉంచి గూగుల్ న్యూస్ యాప్‌ ఉపయోంచినప్పుడు ఖర్చయిన పవర్, డార్క్‌మోడ్‌లో ఫోన్ బ్రైట్‌నెస్ 50 శాతంగా ఉంచినప్పుడు ఖర్చయిన బ్యాటరీ పవర్ ఒకే విధంగా ఉన్నాయని తెలిపారు.

ఇదీ చదవండి: వాట్సాప్​ కొత్త ఫీచర్​.. అవి ఒక్కసారి మాత్రమే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.