ETV Bharat / science-and-technology

Reliance JioBook 2023 : అదిరిపోయే ఫీచర్స్​తో రిలయన్స్​ జియోబుక్ లాంఛ్​​.. ధర ఎంతంటే? - reliance digital laptop specifications

Reliance Jiobook 2023 Launch In India : రిలయన్స్​ జియో మరో కొత్త ప్రొడక్ట్​తో మార్కెట్​లోకి వచ్చేసింది. అదే సెకండ్​ వెర్షన్​ ఆఫ్​ 'రిలయన్స్​ జియో బుక్'​. దీనిని సోమవారం (జులై 31) భారత్​ మార్కెట్లో లాంఛ్​ చేశారు. మరి దీని ధర ఎంత, ఫస్ట్​ వెర్షన్​తో పోలిస్తే ఇందులో అదనపు ఫీచర్లు ఏమున్నాయి మొదలైన వివరాలు మీ కోసం.

Reliance Jiobook 2023 Launch In India
రిలయన్స్​ జియోబుక్ ల్యాప్​టాప్​
author img

By

Published : Jul 31, 2023, 1:28 PM IST

Updated : Jul 31, 2023, 2:24 PM IST

Reliance Jiobook 2023 Launch Laptop : రిలయన్స్ జియో నుంచి మరో ల్యాప్​టాప్​ భారత మార్కెట్​లోకి ప్రవేశించింది. 'రిలయన్స్​ జియో బుక్'​ పేరుతో దీనిని సోమవారం (జులై 31)న లాంఛ్​ చేశారు. గతేడాది అక్టోబరులో విడుదల చేసిన 'జియో బుక్'​ ల్యాప్​టాప్​కు కొనసాగింపుగా దీనిని తీసుకొచ్చారు. ఫస్ట్​ వెర్షన్​తో పోలిస్తే దీని డిజైన్​, పనితీరు మెరుగ్గా ఉండనుంది. లేటెస్ట్​ అప్​డేట్​లకు అనుగుణంగా దీనిని రూపొందించారు. ఈ ప్రొడక్ట్​ విక్రయాలను ఈ-కామర్స్​ ఫ్లాట్​ఫాం అమెజన్​లోనూ అందుబాటులో ఉంచారు. ఇటీవలే అమెజాన్​ వెబ్​సైట్​లో కొత్త జియోబుక్​ టీజర్​ను​ విడుదల చేశారు. కాగా, ఫస్ట్​ వెర్షన్​ ల్యాప్​టాప్​తో పోలిస్తే దీనిని మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు. కొత్తగా తెచ్చిన రిలయన్స్​ జియో బుక్​లోని బ్యాటరీ లైఫ్​ కూడా మెరుగ్గా ఉండనుంది.

స్టన్నింగ్​ ఫీచర్లు..
Reliance Jiobook Laptop : ఈ ల్యాప్​టాప్​ను​ మంచి కాంపాక్ట్​ డిజైన్​తో పాటు 4జీ ఇంటర్నెట్ యాక్సెస్ ​​కనెక్టివిటీతో తీసుకొచ్చారు. ఇందులో పవర్​ఫుల్​ ఆక్టా-కోర్​ ప్రాసెసర్​ కూడా ఉంది. అందువల్ల దీనిలో హై-డెఫినిషన్​ వీడియో స్ట్రీమింగ్​ చేసుకోవచ్చు. అలాగే వివిధ సాఫ్ట్​వేర్​లను ఉపయోగించి, మల్టీటాస్కింగ్​ కూడా చేయవచ్చు. జియో బుక్​ ఫస్ట్​ వెర్షన్​ బరువు 1.20 కేజీలు కాగా.. సెకండ్​ వెర్షన్​ను 990 గ్రాముల బరువుతో తీసుకొచ్చారు. ఇక ఫుల్​ డే బ్యాటరీ లైఫ్​ ఈ ల్యాప్​టాప్​ సొంతం. ప్రస్తుతం దీనిని బ్లూ, గ్రే కలర్స్​లో అందుబాటులోకి తెచ్చారు. జియో ఆపరేటింగ్​ సిస్టమ్​తో ఇది పని చేయనుంది. దీనిలో జియోమీట్​, జియోక్లౌడ్​, జియో సెక్యురిటీ లాంటి ఇన్​బిల్ట్​ యాప్స్​ కూడా అందించారు.

Latest Jiobook Laptop : ఈ జియోబుక్​ అన్ని వయస్సుల వారికి అనుగుణంగా ఉంటుందని.. ఎంటర్​టైన్మెంట్​, ప్రొడక్టివిటీ, గేమింగ్​లను సపోర్ట్​ చేస్తుందని రిలయన్స్​ జియో తెలిపింది. ఇక ఈ రిలయన్స్​ జియో బుక్​ పనితీరుకు సంబంధించి పూర్తి రివ్యూ త్వరలోనే రానుంది. బడ్జెట్​ ఫ్రెండ్లీగా దీనిని కేవలం రూ.20 వేలకే అందిస్తుంది రిలయన్స్​. కాగా, మొదటి వెర్షన్​ ల్యాప్​టాప్​ ధర రూ.16,000కు తగ్గించింది.

జియో మొబైల్​..
Jio Mobile 999 : ఈ సంవత్సరం ఆరంభంలో.. రిలయన్స్ జియో దేశంలో జియోభారత్ పేరుతో 4G స్మార్ట్‌ఫోన్‌ను కూడా లాంఛ్​ చేసింది. కాగా, దీనిని రూ.999/-కే విక్రయిస్తున్నారు. HD ఫోన్ కాలింగ్​, జియో మనీ ద్వారా యూపీఐ చెల్లింపులు, జియో సినిమా ద్వారా ఓటీటీ ప్లాట్​ఫామ్​ యాక్సెస్​లు ఈ ఫోన్​లోని ప్రత్యేక ఆకర్షణలు.

Last Updated : Jul 31, 2023, 2:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.