Reliance Jio Launched New 4G Feature Phone : ప్రముఖ టెలికాం దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో ఇప్పటికే చాలా ఫీచర్ ఫోన్‌లను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. వాటి ప్రైమ్ సెగ్మెంట్, ప్రత్యేక రీఛార్జ్ కారణంగా అవి చాలా పాపులర్ అయ్యాయి. తాజాగా రిలయన్స్ జియో (Reliance Jio) అదిరిపోయే ఫీచర్లతో మరో బడ్జెట్ ఫోన్‌ను విడుదల చేసింది. 'JioPhone Prima 4G' పేరుతో ఈ నయా ఫోన్‌ను లాంఛ్ చేసింది. దీనిని జియో కంపెనీ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2023లో ప్రదర్శనకు ఉంచింది. ఇది ఫీచర్ ఫోన్ అయినప్పటికీ ఇందులో ప్రీమియం డిజైన్‌ను ఉపయోగించారు. ఈ ఫీచర్ ఫోన్‌లో అనేక సోషల్ మీడియా యాప్‌లు అందుబాటులో ఉంటాయి. ఇంతకీ ఈ ఫోన్ మార్కెట్లోకి ఎప్పుడు విడుదలవుతుంది? దీని ధర ఎంత? స్పెసిఫికేషన్లు ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
JioPhone Prima 4G Mobile Launch : దీపావళి వరకు JioPhone Prima 4G ఫీచర్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు రిలయన్స్ జియో వెల్లడించింది. దిల్లీ, ముంబాయి సహా పలు ప్రధాన పట్టణాల్లో ఈ 4G ఫీచర్ ఫోన్ డెలివరీ చేయనున్నట్లు జియో మార్ట్ పేర్కొంది. ఇది పసుపు, నీలం అనే రెండు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఇప్పటికే Jiomart ఈకామర్స్ వెబ్‌సైట్‌లో JioPhone Prima 4G అందుబాటులోకి వచ్చింది.
JioPhone Prima 4G Price : ఈ ఫోన్ ధరను రూ.2599గా రిలయన్స్ జియో ఫిక్స్ చేసింది. లాంచింగ్ సందర్భంగా క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, బ్యాంక్ ఆఫర్లు, కూపన్లు అందుబాటులోకి తెస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.
JioPhone ప్రైమా 4G స్పెసిఫికేషన్లు :
JioPhone Prima 4G Features and Specifications :
- JioPhone Prima 4G ఫోన్ 2.4 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. 320×240 రిజల్యూషన్ పిక్సెల్స్ అందుబాటులో ఉంటాయి.
- ఈ సరికొత్త ఫోన్‌కు TFT డిస్‌ప్లే ఉంది. వెనుక ప్యానెల్‌పై రెండు సర్కిల్‌లు డ్రా చేయబడ్డాయి. అందులో జియో లోగో ఉంది. ఇందులో 128GB మైక్రో SD కార్డ్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
- ఈ ఫోన్‌లో 4G కనెక్షన్ సపోర్ట్, 1800mAh బ్యాటరీ ఉంది. అలాగే 23 భాషలకు మద్దతు ఇవ్వనుంది.
- కెమెరా విషయానికొస్తే 0.3MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది.
- JioPhone ప్రైమా 4G ఫోన్ YouTube, JioTV, Jio Cinema, JioSaavn, JioNews లాంటి ఎంటర్టైన్మెంట్ యాప్‌లకు మద్దతు ఇస్తుంది. అయితే JioSaavn, JioCinema, JioPay దీనిలో ముందే లోడ్ చేసి ఉంటాయి.
- ఇందులో WhatsApp, Jiochat, Facebook లాంటి సోషల్ మీడియా యాప్‌లను కూడా పొందవచ్చు.
- Jio నుంచి వచ్చిన ఈ ఫోన్ KaiOS ఆధారంగా పని చేస్తుంది. అలాగే ఇది సింగిల్ సిమ్ హ్యాండ్‌సెట్. ఇందులో ARM Cortex A53 ప్రాసెసర్ ఉంది. ఈ ఫోన్‌లో బ్లూటూత్ వెర్షన్ 5.0 అందుబాటులో ఉంటుంది.
- అదేవిధంగా ఇది FM రేడియోతో పాటు 3.5mm ఆడియో జాక్‌కు సపోర్టు చేస్తుంది.
- జియో కంపెనీ ఈ ఫోన్‌కు ఒక సంవత్సరం వారంటీని అందిస్తోంది.
BSNL Plans To Launch 4G Service : త్వరలో BSNL 4జీ సేవలు ప్రారంభం.. 5జీ 'స్పెక్ట్రమ్' ఉంది కానీ..