ETV Bharat / science-and-technology

Redmi New Laptop Launch: రెడ్‌మీ నాజూకు ల్యాప్‌టాప్‌లు

షావోమి సబ్‌బ్రాండ్ రెడ్‌మీ సరికొత్త ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. స్లిమ్ డిజైన్​తో చూసేందుకు అత్యంత ఆకర్షణీయంగా ఉన్న ఈ ల్యాప్​టాప్​లు.. ప్రొఫెషనల్స్‌కు అత్యంత అనువుగా ఉంటాయని కంపెనీ తెలిపింది.

రెడ్‌మీ ల్యాప్‌టాప్‌
రెడ్‌మీ ల్యాప్‌టాప్‌
author img

By

Published : Aug 18, 2021, 9:49 AM IST

పలుచని, తేలికైన ల్యాప్‌టాప్‌ కోసం చూస్తున్నారా? షామీ కొత్తగా విడుదల చేసిన రెడ్‌మీబుక్‌ ల్యాప్‌టాప్‌లను ప్రయత్నించి చూడండి. ఇంటెల్‌ 11వ జెనరేషన్‌ కోర్‌ ఐ5 ప్రాసెసర్లతో కూడిన ఇవి రెండు రకాల్లో అందుబాటులోకి వచ్చాయి. రెడ్‌మీబుక్‌ ప్రొ 19.9 మి.మీ. మందం, 1.8 కిలోల బరువుంటుంది. 15.6 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920శ్రీ1080 పిక్సెల్స్‌ రెజల్యూషన్‌ దీని సొంతం. మెటాలిక్‌ బాడీతో ఆకర్షణీయంగా కనిపించే దీని స్క్రీన్‌-బాడీ రేషియో 81.8 శాతం. ర్యామ్‌ 8జీబీ, 720పి హెచ్‌డీ కెమెరా, రెండు మైక్రోఫోన్లు ఇతర ఫీచర్లు.

రెడ్‌మీ ల్యాప్‌టాప్‌
రెడ్‌మీ ల్యాప్‌టాప్‌

ఒకసారి ఛార్జ్‌ చేస్తే 10 గంటల వరకు పనిచేస్తుంది. ల్యాప్‌టాప్‌తో పాటు 65 వాట్ల ఛార్జర్‌ వస్తుంది. దీంతో 35 నిమిషాల్లోనే 50% వరకు ఛార్జ్‌ చేసుకోవచ్చు. ఇక రెడ్‌మీబుక్‌ ఇ-లెర్నింగ్‌ డిజైన్‌ సైతం రెడ్‌మీబుక్‌ ప్రొ మాదిరిగానే.. ఐ3 ప్రాసెసర్‌ కలిగి ఉంది. ఇవి రెండూ విండోస్‌ 10తోనే నడుస్తాయి. అందుబాటును బట్టి వీటిని ఉచితంగా విండోస్‌ 11కు అప్‌గ్రేడ్‌ చేసుకునే వీలుంది. ముందుగానే ఎంఎస్‌ ఆఫీస్‌ హోం, స్టుడెంట్‌ ఎడిషన్‌ 2019 లోడ్‌ అయ్యి ఉన్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.