మొబైల్ తయారీ సంస్థ షియోమి జోరు పెంచింది. రెడ్ మీ తొలి 5జీ మొబైల్.. నోట్ 10టీ 5జీ(Redmi Note 10T 5G)ని భారత మార్కెట్లోకి అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధర, వివరాలు తెలుసుకుందాం..
ఫీచర్లు..
- 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, కార్లింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్.
- 48 ఎంపీ మెయిన్ కెమెరా, రెండు 2 ఎంపీ కెమెరాలు.
- 8ఎంపీ సెల్ఫీ కెమెరా.
- 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.
- 18 వాట్ టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్.
- 5జీ నెట్వర్క్ సపోర్ట్ చేసే డ్యుయెల్ సిమ్ సర్వీస్
- మీడియాటెక్ డైమెన్సిటీ 700 ఆక్టాకోర్ ప్రాసెసర్
- యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్, 1టీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ.
మొబైల్లో చదువుకునేందుకు వీలుగా రీడింగ్ మోడ్ 3.0 ఫీచర్‌ను యాడ్ చేసింది రెడ్మీ. వాయిస్ కమాండ్ ద్వారా ఫోన్ ఆపరేట్ చేసేందుకు మల్టిపుల్ హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌ను ఇచ్చింది. గేమింగ్ ప్రియుల కోసం మాలి- జీ57 గ్రాఫిక్ కార్డు ఉపయోగించింది. గేమ్ టర్బో మోడ్ ఆప్షన్ ఇచ్చింది. ఆండ్రాయిడ్ 11ఓఎస్‌తో ఈ మొబైల్ పనిచేయనుంది.
ధర:
4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 13, 999.
6 జీబీ ర్యామ్, 128 జీబీ వేరియంట్ ధర రూ. 15,999.
కలర్స్:
గ్రాఫైట్ బ్లాక్, క్రోమియమ్ వైట్, మింట్ గ్రీన్, మెటాలిక్ బ్లూ
అమెజాన్, ఎమ్ఐ డాట్ కామ్, మై హోమ్ స్టోర్స్‌లో ఈ మొబైల్‌ను బుకింగ్ చేసుకొవచ్చు. జులై 26 నుంచి ఆఫ్‌లైన్ సేల్స్ మొదలుకానున్నాయి.