Redmi 12 Launch Date In India : రెడ్మీ ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్!. త్వరలోనే రెడ్మీ 12 స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంఛ్ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను రెడ్మీ తన అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. భారత్‌లో రెడ్మీ 10 తర్వాత వస్తున్న అప్‌గ్రేడెడ్ మోడల్ ఈ రెడ్మీ 12. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రెడ్మీ 10లో 'ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680' ప్రాసెసర్ ఉంది. దీనితో పోలిస్తే రెడ్మీ 12లో ఎంతో శక్తిమంతమైన 'ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జీ88' ప్రాసెసర్ పొందుపరిచినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ఫోన్ 6000ఎమ్ఏహెచ్ బ్యాటరీతో పాటు 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తోంది.
Redmi 12 ధర ఎంత ఉండొచ్చు?
Redmi 12 Price : రెడ్మీ అఫీషియల్ వెబ్సైట్లో రెడ్మీ 12 ఫొటోలు ఉంచారు. అందులో ఈ సరికొత్త ఫోన్ రెండు వేరియంట్లలో వస్తున్నట్లు స్పష్టం తెలుస్తోంది. 4జీబీ+128జీబీ, అలాగే 8జీబీ+256జీబీ స్టోరేజ్ ఆప్షన్స్‌తో వస్తోంది. దీని ధర సుమారు రూ.18,600 వరకు ఉండొచ్చని అంచనా.
-
#Redmi12 already available in Portugal.
— Kacper Skrzypek 🇵🇱 (@kacskrz) June 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
MediaTek Helio G88, 6,79" 90 Hz display, 5000mAh battery with 18 W charging, 4/8 GB RAM, 128/256 GB storage, 50/8/2 Mpx back camera, 8 Mpx front camera, NFC, Bluetooth 5.3, 168,60 x 76,28 x 8,17 mm, 198,5 g.
209,99 euro pic.twitter.com/CG9c0XJSSJ
">#Redmi12 already available in Portugal.
— Kacper Skrzypek 🇵🇱 (@kacskrz) June 2, 2023
MediaTek Helio G88, 6,79" 90 Hz display, 5000mAh battery with 18 W charging, 4/8 GB RAM, 128/256 GB storage, 50/8/2 Mpx back camera, 8 Mpx front camera, NFC, Bluetooth 5.3, 168,60 x 76,28 x 8,17 mm, 198,5 g.
209,99 euro pic.twitter.com/CG9c0XJSSJ#Redmi12 already available in Portugal.
— Kacper Skrzypek 🇵🇱 (@kacskrz) June 2, 2023
MediaTek Helio G88, 6,79" 90 Hz display, 5000mAh battery with 18 W charging, 4/8 GB RAM, 128/256 GB storage, 50/8/2 Mpx back camera, 8 Mpx front camera, NFC, Bluetooth 5.3, 168,60 x 76,28 x 8,17 mm, 198,5 g.
209,99 euro pic.twitter.com/CG9c0XJSSJ
Redmi 12 ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఇలా..
రెడ్మీ 12 ఫోన్‌ను నలుపు, తెలుపు, నీలం అనే మూడు రంగుల్లో తీసుకువస్తున్నట్లు ఫొటోల ద్వారా తెలుస్తోంది. ఈ సరికొత్త రెడ్మీ ఫోన్లో
- 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో, 6.79 అంగుళాల ఫుల్ హెచ్డీ+డిస్ప్లే
- కెమెరా : 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా+ 8ఎమ్జీ+2ఎమ్జీ, ఎల్ఈడీ ఫ్లాష్ లైట్
- ఫ్రెంట్ కెమెరా: 8ఎమ్పీ సెన్సార్
- బ్యాటరీ: 5000 ఎమ్ఏహెచ్
- ఛార్జింగ్: 18 వాట్ ఛార్జింగ్ సపోర్ట్
ఈ రెడ్మీ ఫోన్ NFC, బ్లూటూత్ సపోర్ట్‌తో వస్తుంది. సైట్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.
మార్కెట్లోకి రానున్న మరిన్ని లేటెస్ట్ ఫోన్స్
భారత మార్కెట్లోకి మరిన్ని లేటెస్ట్ స్మార్ట్ ఫోన్స్ లాంఛ్ కానున్నాయి. త్వరలోనే మోటోరోలా రేజర్ 40 సిరీస్ ఫోల్డబుల్ ఫోన్లు లాంఛ్ కానున్నాయి. ఐకూ నియో 7 ప్రో 5జీ కూడా లాంఛింగ్‌కు సిద్ధంగా ఉంది. ఇప్పటికే యూఎస్‌లో లాంఛ్ అయిన ఎంట్రీ లెవల్ స్మార్ట్ఫోన్లు నోకియా సీ300, నోకియా సీ110 కూడా ఫోన్ ప్రియులను ఆకర్షిస్తున్నాయి. ఇన్ఫినిక్స్ నోట్ 30 5జీ కూడా ఈ జూన్ నెలలోనే భారత్ మార్కెట్లోకి రానుంది. ఇవే కాకుండా అనేక బ్రాండ్ల స్మార్ట్ఫోన్లు ఈ సంవత్సరం భారత్‌లో లాంఛ్ కానున్నాయి.
ఇవీ చదవండి: