Pregnancy Tracker Apps : అమ్మ కావడం అనేది ప్రతి ఆడబిడ్డకు ఓ వరం. అలాంటి వరాన్ని బిడ్డ రూపంలో పొందే ప్రతి స్త్రీ.. తన గర్భంలోని బిడ్డ పట్ల అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే కొన్నేళ్ల వరకు గర్భిణి కడుపులోని పిండం ఎదుగుదల, కదలికలను గమనించడం కాస్త క్లిష్టమైన వ్యవహారం. కానీ, ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న సాంకేతికత కారణంగా వీటిపై ఓ అంచనాకు రావడం కాసింత సులభతరం అయిందనే చెప్పవచ్చు. గర్భిణిల కోసం సరికొత్త ప్రెగ్నెన్సీ ట్రాకర్ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు ఇవి మరింత సులభంగా లభిస్తున్నాయి. అందుకే గర్భిణులకు ఈ యాప్స్ ( Top 5 Pregnancy Tracker Apps ) అందిస్తున్న సేవల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రెగ్నెన్సీ + యాప్
Pregnancy + : గర్భధారణ జరిగినప్పటి నుంచి డెలవరీ అయ్యే సమయం వరకు మీకు ఒక గైడ్‌లా పనిచేస్తుంది ఈ 'ప్రెగ్నెన్సీ +' యాప్ ( Top Pregnancy Trackers ). ఇది ప్రతి మూడు నెలలకోసారి మీ పిండానికి సంబంధించిన పురోగతిని ట్రాక్ చేసి ఆ సమాచారాన్ని మీకు అందిస్తుంటుంది. అయితే ఇందుకోసం మీ డెలివరీకి సంబంధించిన కచ్చితమైన డేట్‌ను లేదా ఇంచుమించు తేదీ వివరాలను.. మీరు యాప్‌లో సైన్ అప్ అయ్యేటప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. అలా తేదీలను తెలియజేయడం ద్వారా మీ బిడ్డ కదలికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ప్రతి తల్లి తెలుసుకోవచ్చు. పిండం అభివృద్ధికి సంబంధించి రోజువారీ సలహాలు, సూచనలను కూడా ఎప్పటికప్పుడు తల్లికి అందిస్తుంది ఈ Pregnancy + యాప్. అంతేకాకుండా ప్రతి మూడు నెలలకు ఓ సారి మీ శరీరంలో జరిగే మార్పులను.. ముఖ్యంగా బరువు పెరగడం, తగ్గడం లాంటి అంశాలను కూడా సులువుగా తెలుసుకోవచ్చు.
బిడ్డ ఫొటోలను ముందే చూడొచ్చు..
Best Free Pregnancy Apps : అల్ట్రాసౌండ్, 3D స్కాన్ల ద్వారా కడుపులోని మీ బిడ్డకు సంబంధించిన నమూనా చిత్రాలను చూసేందుకు అనుమతిస్తుంది 'ప్రెగ్నెన్సీ +'. దీనితో మీకు పుట్టబోయే బిడ్డ ప్రస్తుతం ఎలా ఉందో మీరు తెలుసుకోగలుగుతారు. ఇవే కాకుండా గర్భంతో ఉన్న స్త్రీ.. ఆయా సమయాల్లో చేయాల్సిన వ్యాయామాలు, యోగాసనాలు లాంటి ఆరోగ్య విషయాలను కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అయితే వీటన్నింటిని ఆస్వాదించాలంటే యాప్ ప్రీమియం వెర్షన్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం నెలకు రూ.335 లేదా సంత్సరానికి రూ.2,505 ప్రీమియంను చెల్లించాలి.
ప్రెగ్నెన్సీ ట్రాకర్..
Pregnancy Tracker App : ప్రెగ్నెన్సీ ట్రాకర్ యాప్.. మీరు గర్భం దాల్చినప్పటి నుంచి వారాలు, నెలలు గడిచే కొద్దీ మీ శరీరంతో పాటు, కడుపులోని బిడ్డ శరీర మార్పుల గురించి కూడా పూర్తి సమాచారాన్ని మీకు అందిస్తుంది. సులువుగా అర్థమయ్యే రీతిలో.. ఉదాహరణలతో సహా మీ పిండం వృద్ధికి సంబంధించిన వివరాలను తెలియజేస్తుంది. మొత్తంగా మీ బిడ్డకు సంబంధించిన రోజువారీ పురోగతిని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోగలుగుతారు. ఇది ( Top 5 Pregnancy Apps ) పిండం పరిమాణం, పొడవు లాంచి వివరాలను అంచనా వేసి చెబుతుంది. దీనితో మీ బిడ్డ ఎదుగదల విషయంలో మీరు పలు జాగ్రత్తలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ యాప్ సాయంతో ప్రతి త్రైమాసికానికి మీ కడుపులోని బిడ్డ ఎదుగుదల, కదలికలకు సంబంధించిన వివరాలను అందిస్తుంది. అలాగే మీ శరీర బరువును కూడా తెలియజేస్తుంది.
అమ్మ ప్రెగ్నెన్సీ అండ్ బేబీ ట్రాకర్..
Amma Pregnancy & Baby Tracker : మీరు మీ శిశువు డెలివరీకి సంబంధించిన కచ్చితమైన గడువు తేదీ లేదా అంచనా తేదీ లేదా పిండం వయస్సు వివరాలను ఈ యాప్‌లో సైన్ అప్ అయ్యే సమయంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మీ పిండం పరిమాణం, అభివృద్ధి దశలకు సంబంధించిన వివరాలతో పాటు మరిన్ని కీలక విషయాలను తల్లికి అందిస్తుంది. అంతే కాకుండా గర్భంతో ఉన్న మహిళ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన ఆహార నియమాలు గురించి కూడా అమ్మ ప్రెగ్నెన్సీ అండ్ బేబీ ట్రాకర్ యాప్ తెలియజేస్తుంది. ముఖ్యంగా కవలల కోసం ఎదురుచూసే దంపతులకు సలహాలు, సూచనలును కూడా ఇస్తుంది. ఈ యాప్‌లో వెయిట్ గెయిన్ ఛార్ట్‌ను కూడా అందుబాటులో ఉంచారు. ఒకవేళ మీరు డెలవరీ తర్వాత బరువు తగ్గాలనుకుంటే గనుక ఈ యాప్ ( Famous Pregnancy Apps ) మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కాగా, ఈ యాప్ మనకు ఫ్రీ, ప్రీమియం వెర్షన్ రెండింటిలోనూ లభ్యమవుతుంది.
ఓవియా ప్రెగ్నెన్సీ ట్రాకర్..
Ovia Pregnancy Tracker : పైన తెలిపిన యాప్‌లు అందించే దాదాపు అన్ని ఫీచర్లను ఈ ఓవియా ప్రెగ్నెన్సీ ట్రాకర్లోనూ ఆస్వాదించవచ్చు. వీటితో పాటు ఈ యాప్ ముఖ్యంగా గర్భంతో ఉన్నప్పుడు, ఆ తర్వాత మీ ఆరోగ్యం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుపుతుంది. అంటే శిశువు ఎదుగుదల కోసం.. మీరు ఆహారంలో చేర్చుకోవాల్సిన విటమిన్స్, న్యూట్రియంట్స్ గురించి సమగ్ర సమాచారాన్ని రిమైండర్ల రూపంలో అందిస్తుంది. అంతేకాకుండా మన శరీర బరువును కూడా ఇది పర్యవేక్షిస్తుంటుంది. దశలవారీగా మీ పిండంలో జరుగుతున్న మార్పులపై ఓ కచ్చితమైన అవగాహనను ఈ యాప్( Which Pregnancy App Is Best ) మీకు కలిగిస్తుంది. దీనితో పాటు అమ్మ ప్రెగ్నెన్సీ అండ్ బేబీ ట్రాకర్లోనూ మీరు ఓ ప్రత్యేకమైన ఫీచర్‌ను ఆస్వాదించవచ్చు. అదే.. కమ్యూనిటీ ఫీచర్. అంటే ఈ యాప్‌ను వినియోగిస్తున్న ఇతర తల్లుల నుంచి గర్భానికి సంబంధించిన విలువైన సలహాలు, సూచనలు పొందవచ్చు. వారికి ఎదురైన అనుభవాలను పంచుకోవడమే కాకుండా.. వారితో నేరుగా సంభాషించవచ్చు.
బేబీ సెంటర్ ప్రెగ్నెన్సీ ట్రాకర్..
Baby Center Pregnancy Tracker : బేబీ సెంటర్ ప్రెగ్నెన్సీ ట్రాకర్ మీ పెరుగుతున్న శిశువు గురించి ఉపయోగకరమైన సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు అందిస్తుంది. రోజులు గడిచేకొద్దీ మీ బిడ్డ పరిమాణం, అభివృద్ధి దశలు లాంటి వివరాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ప్రెగ్నెన్సీ ట్రాకర్‌లో బర్త్ క్లబ్ అనే ఓ ప్రత్యేక సెగ్మెంట్ ఉంది. దీనిలో మీకు బిడ్డ పుట్టే అంచనా తేదీని నమోదు చేయాలి. మీలాగే ఇతరులు కూడా చేస్తారు. అప్పుడు ఒకే రోజు పిల్లలకు జన్మనిచ్చే తల్లులు అందరినీ ఒకే చోటుకు చేర్చుతుంది బేబీ సెంటర్ ప్రెగ్నెన్సీ ట్రాకర్. దీని ద్వారా మీరు ఇతర గర్భిణులతో.. పిల్లలకు సంబంధించిన మంచి చెడులను చర్చించుకోవచ్చు. అవసరమైతే వారి సలహాలు, సూచనలు స్వీకరించవచ్చు.
గమనిక : పైన తెలిపిన టాప్ 5 ప్రెగ్నెన్సీ ట్రాకర్ యాప్స్ గురించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. అయితే ఈ యాప్స్ వాడకం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యక్తిగత వైద్యుని సంప్రదించిన తరువాతనే ఇలాంటి యాప్స్ వాడాలి. ఇప్పటికే వీటిని వాడుతూ ఉంటే.. ఎటువంటి చిన్న సందేహం లేదా అనుమానం వచ్చినా మీ వ్యక్తిగత డాక్టర్‌ను వెంటనే సంప్రదించడం శ్రేయస్కరం.