ETV Bharat / science-and-technology

25 నిమిషాల్లో మొబైల్​ ఫుల్​ ఛార్జింగ్​.. 4K క్యూఎల్​ఈడీతో TV.. 'వన్​ప్లస్'​ కొత్త ప్రొడక్ట్​లు ఇవే!

వన్​ప్లస్.. సరికొత్త మొబైల్స్, ప్రొడక్ట్స్‌తో మరోసారి సిద్ధమైంది. ఫిబ్రవరి 7న వన్‍ప్లస్ మెగా లాంఛ్​ ఈవెంట్ సందర్భంగా విడుదల చేసే ప్రొడక్టుల గురించి ఆ సంస్థ వెల్లడిస్తోంది. అసలు వన్​ప్లస్​ కొత్త ప్రొడక్టులు ఏంటి? వాటి ప్రత్యేకతలు? ధరల వివరాలు మీకోసం..

one plus new products will launch on february7

author img

By

Published : Feb 1, 2023, 4:44 PM IST

సరికొత్త మొబైల్స్, ప్రొడక్ట్స్‌తో మరోసారి సిద్ధమైంది వన్ ప్లస్. ఫిబ్రవరి 7న వన్‍ప్లస్ మెగా లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్‍లో విడుదల చేసే ప్రొడక్టుల గురించి ఆ సంస్థ వెల్లడిస్తోంది. వన్‍ప్లస్ 11ఆర్ 5జీ మొబైల్‍ను కూడా అదే ఈవెంట్‍ ద్వారా ఇండియన్ మార్కెట్లోకి లాంఛ్​ చేయనున్నట్టు సంస్థ వెల్లడించింది. దాంతో పాటు వన్‍ప్లస్ 11 5జీ ఫ్లాగ్‍షిప్ మొబైల్, వన్‍ప్లస్ బడ్స్ ప్రో 2 టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్, వన్‍ప్లస్ తొలి కీబోర్డు, వన్‍ప్లస్ టీవీ 65 క్యూ2 ప్రో స్మార్ట్ టీవీ, వన్‍ప్లస్ 11ఆర్ 5జీ విడుదల కానున్నాయి. వీటిన్నంటి గురించి తెలుసుకుందాం.

8 జెన్‌ ప్రాసెసర్లతో...
వన్‌ప్లస్‌ 11 సిరీస్‌లో రెండు స్మార్ట్‌ఫోన్లను తీసుకొస్తుంది. వన్‌ప్లస్‌ 11ఆర్‌లో స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 1+ ప్రాసెసర్‌ను, వన్‌ప్లస్ 11 5జీలో స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 8 జీబీ ర్యామ్‌/128 జీబీ స్టోరేజ్‌, 16 జీబీ/256 జీబీ వేరియంట్లలో ఈ మొబైల్స్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్లలో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారట. వీటి ధర రూ.40,000 ఉండనుందట.

one plus new products will launch on february7
వన్​ప్లస్ 11R 5G

వన్‌ప్లస్ పాడ్..
'ప్యాడ్‌' టీజర్‌ ఫొటోను వన్‌ప్లస్‌ తన ట్విట్టర్​లో ఖాతాలో షేర్‌ చేసింది. దాని ప్రకారం చూస్తే... ట్యాబ్‌ వెనుక భాగం, ముందు భాగంలో సింగిల్‌ కెమెరాలుంటాయి. అల్యూమినియం ఫ్రేమ్‌తో ఈ డివైజ్‌ను రూపొందించారట. ఇందులో 11.6 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. ట్యాబ్‌ కుడివైపు సైడ్‌లో టచ్‌ సెన్సర్‌, వాల్యూమ్‌ కంట్రోల్‌ బటన్స్ ఇస్తున్నారట. ట్యాబ్‌ ధర రూ. 35 వేల నుంచి రూ.40 వేల మధ్య ఉండొచ్చని అంచనా.

వన్​ప్లస్ ప్యాడ్​ ఫీచర్లు

4K క్యూఎల్‌ఈడీ ప్యానెల్‌తో..
వన్‌ప్లస్ స్మార్ట్‌ టీవీని 4K క్యూఎల్‌ఈడీ ప్యానెల్‌తో తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇందులో డాల్బీ అట్మాస్‌, విజన్‌ సపోర్ట్‌, 70 వాట్‌ స్పీకర్స్ వంటి ఫీచర్లు ఉంటాయని సమాచారం. దీని ధర రూ.70000 ఉంటుందని తెలుస్తోంది.

వన్​ప్లస్ బడ్స్ ప్రో2

గూగుల్‌ స్పాషియల్‌తో..
వీటిన్నంటితో పాటు వన్‌ప్లస్ బడ్స్‌ ప్రో ఇయర్‌ బడ్స్‌ను విడుదల చేస్తోంది. ఇందులో యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌, గూగుల్ స్పాషియల్‌ ఆడియో సపోర్ట్‌ ఫీచర్లు ఉంటాయని సమాచారం. దీని ధర రూ.10 వేలు ఉంటుందట.

ఇవీ చదవండి:

కోడి కూతకు.. కుక్క అరుపునకు.. అర్థం తెలిసిపోతుంది.. కృత్రిమ మేధతో అద్భుత సృష్టి..

అన్నింటికీ ఒకటే ఛార్జర్​.. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించే దిశగా భారత్ అడుగులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.