New SIM Card Rules From December 1st 2024 : కేంద్ర ప్రభుత్వం కొత్త ఏడాది నుంచి సిమ్ కార్డు ధ్రువీకరణ విధానంలో కీలక మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం కొత్త సిమ్ కార్డు తీసుకోవాలంటే.. అవసరమైన పత్రాలను భౌతికంగా ఇవ్వాల్సిందే. కానీ 2024 జనవరి 1 నుంచి ఇలా చేయాల్సిన పని లేదు. అంటే కొత్త ఏడాది నుంచి సిమ్ కార్డు ధ్రువీకరణ కోసం ఫిజికల్ డాక్యుమెంట్స్ ఏవీ సమర్పించాల్సిన అవసరం ఉండదు.
ఆ నిబంధనకు చెల్లుచీటు
కేంద్ర ప్రభుత్వం 2012 ఆగస్టు నుంచి.. ఎవరైనా సిమ్ కార్డ్ తీసుకుంటే, కచ్చితంగా భౌతిక ధ్రువపత్రాలు సమర్పించి, ధ్రువీకరించుకోవాలని నిబంధన విధించింది. ఇటీవలే ఆ నిబంధనను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.
ఈ-కేవైసీ చాలు
E KYC For SIM Card Verification : ఇకపై కొత్త సిమ్ కార్డు తీసుకునేటప్పుడు ఈ-కేవైసీ చేసుకుంటే సరిపోతుంది. కేంద్రం ఈ బాధ్యతలను యూనిఫైడ్ యాక్సెస్ సర్వీసెస్ (UAS), యూనిఫైడ్ లైసెన్స్ (UL) హోల్డర్లకు అందించింది. దీని ద్వారా సిమ్ కార్డ్ మోసాలు చాలా వరకు నివారించవచ్చని కేంద్రం భావిస్తోంది.
శ్రమ, ఖర్చు రెండూ తగ్గుతాయి!
SIM Card eKYC Benefits : ఈ-కేవైసీతో కొత్త సిమ్ కార్డు తీసుకోవడం వల్ల.. వినియోగదారులకు శ్రమ, డబ్బులు రెండూ ఆదా అవుతాయి. ఎలా అంటే.. ప్రస్తుతానికి కొత్త సిమ్ కావాలంటే.. కచ్చితంగా దరఖాస్తు ఫారమ్ నింపాల్సి ఉంది. అలాగే పాస్‌పోర్ట్ సైజు ఫొటో, ఐడెంటిటీ కార్డు, నివాస ధ్రువీకరణ పత్రాల జిరాక్స్‌లను అందించాల్సి ఉంటుంది. కానీ 2024 జనవరి 1 నుంచి ఈ అవసరం ఉండదు. కనుక యూజర్లకు శ్రమ, ఖర్చు రెండూ తగ్గనున్నాయి.
ఆగస్టులోనే మార్పు చేశారు!
భారత ప్రభుత్వం ఈ ఆగస్టులోనే సిమ్ కార్డుల జారీ విషయంలో పలు నిబంధనలను మార్చింది. వాటిని ఇటీవలే అమల్లోకి కూడా తెచ్చింది. దీనిని అనుసరించి, ఇకపై సాధారణ వ్యక్తులకు పెద్ద సంఖ్యలో సిమ్ కార్డులు విక్రయించడంపై నిషేధం విధించారు. అలాగే సిమ్ కార్డులు విక్రయించేటప్పుడు కేవైసీ (నో యువర్ కస్టమర్) చేయడం తప్పనిసరి చేశారు. ఈ బాధ్యత పూర్తిగా టెలికాం ఆపరేటర్లు, ఫ్రాంచైజీలు, పీఓఎస్ ఏజెంట్లు, పంపిణీదారులకే అప్పగించారు. దీని వల్ల సిమ్ కార్డ్ మోసాలు నివారించవచ్చని ప్రభుత్వం ఆశిస్తోంది.
డిజిటల్ ఇండియా
భారతదేశంలో డిజిటల్ ఇండియా కాన్సెప్ట్ ప్రారంభమైనప్పటి నుంచి చాలా మార్పులు జరుగుతున్నాయి. కీలక రంగాలు అన్నీ డిజిటలైజ్ అవుతున్నాయి. అందులో భాగంగా నేడు సిమ్ కార్డు వెరిఫికేషన్ కూడా డిజిటలైజ్ చేస్తున్నారు.
బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలా? ఈ సింపుల్ టిప్స్ పాటించండి!
రూ.5,999కే ఇండిగో ఎయిర్‌లైన్స్ హాలీడే ప్యాకేజ్ - ఫారిన్ టూర్స్‌కు కూడా!