ETV Bharat / science-and-technology

OnePlus 12 Release : కొత్త హంగులతో వన్​ ప్లస్​ 12.. కెమెరా, ఫీచర్స్​ అదుర్స్! - వన్​ప్లస్​ 12 బ్యాటరీ

OnePlus 12 Specifications : ప్రముఖ మొబైల్​ ఫోన్​ తయారీ సంస్ధ వన్​ప్లస్​ త్వరలో తన కొత్త మొబైల్​ను లాంఛ్​ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే దీనికి సంబంధించిన ప్రత్యేకతల గురించి ఇప్పుడు నెట్టింట తెగ చర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ అవేంటంటే ?

OnePlus 12 specifications leak
OnePlus 12 specifications
author img

By

Published : Jul 1, 2023, 3:27 PM IST

One Plus 12 Mobile Update : వినియోగదారులకు అందుబాటులోకి రాకమందే వన్​ప్లస్ 12 ఫోన్​ నెట్టింట సంచలనాలు సృష్టిస్తోంది. మొబైల్​కు సంబంధించిన కొన్ని అత్యాధునిక ఫీచర్లు ఇందుకు కారణం.​ అయితే ఈ ఏడాది చివరిలో ఈ మొబైల్​ రీలీజ్​కు సన్నాహాలు చేస్తున్నట్లు టాక్​ రాగా.. ఆ విషయాన్ని మొబైల్​ తయారీ సంస్థ అధికారికంగా ధ్రువీకరించలేదు. కానీ ఊహించిన దాని కంటే మునుపే ఈ ఫోన్ యూజర్ల చేతిలో సందడి చేయనుందట. వన్​ప్లస్​ 11 కంటే మెరుగైన క్వాలిటీతో ఈ ఫోన్​ విడుదల కానుందని సమాచారం. దీని కెమెరా, పనితీరు, ఛార్జింగ్ విభాగాలలో ముందు మోడల్​ కంటే చాలా అప్‌గ్రేడెడ్​గా ఉండే అవకాశం ఉందని టాక్.

టిప్‌స్టర్ ఎక్స్‌పీరియన్స్ మోర్ అనే సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. వన్​ప్లస్​ 12 డిసెంబర్‌లో లాంఛ్​ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ మొబైల్​.. క్వాల్​కమ్​ సంస్థ ఇప్పటి వరకు అనౌన్స్​ చేయని.. Qualcomm Snapdragon 8 Gen 3 SoC అనే ప్రాసెసర్​తో విడుదల కానుందట.

One plus 12 Camera : ఇందులోని సెల్ఫీ కెమెరా కోసం సెంటర్-అలైన్డ్ హోల్-పంచ్ డిస్‌ప్లే కటౌట్‌ను ఉపయోగించారట. 2K రిజల్యూషన్‌తో రూపొందిన ఈ మొబైల్ ​ స్క్రీన్ అంచులు కాస్త కర్వ్డ్​గా ఉంటుందని టాక్​. అయితే ఫోన్ డిస్‌ప్లే ఎంత సైజ్​లో ఉంటుందన్న విషయంపై ఇంతవరకు క్లారిటీ లేదు. ఒకే వేళ దీని డిస్​ప్లే కూడా వన్​ప్లస్​ 11ను పోలి ఉంటే, వన్​ప్లస్​12 కూడా 6.7ఇంచెస్​లో AMOLED డిస్‌ప్లే కలిగి ఉండవచ్చని సమాచారం. ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌లోనే కొనసాగిస్తుందట.

One plus 12 Back Panel : ఫోన్ బ్యాక్​ ప్యానల్​ పైభాగంలో ఓ సర్క్యూలర్​ కెమెరాను పొందుపరిచారు. 50-మెగాపిక్సెల్ సోనీ IMX 9-సిరీస్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరాతో పాటు 64-మెగాపిక్సెల్ ఓమ్నివిజన్ OV64B పెరిస్కోప్ లెన్స్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా.. ఈ ఫోన్​కు హైలైట్​గా నిలవనుందని టాక్.

One Plus 12 Battery : ఈ కొత్త ఫోన్​ 5,000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండగా.. వైర్​డ్​ ఛార్జింగ్‌ సామర్థ్యం 150 వాట్స్​ వరకు ఉంటుందని సమాచారం. అదే సమయంలో వన్​ప్లస్​ 11.. 5,000mAh బ్యాటరీతో సహా 100W ఫాస్ట్ ఛార్జింగ్​ సపోర్ట్​ను కలిగి ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.