ETV Bharat / science-and-technology

Iphone Updates: కొరుక్కు తినేలా కొత్త 'యాపిల్‌'!

ఇంటి నుంచి బయటకు వెళ్తున్నారు. నోట్‌బుక్స్‌ వంటి బరువులేవీ లేకుండా వెంట ఏదో ఒకటే తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. ఏం పట్టుకెళ్తారు? ఐఫోన్‌ ఒక్కటి చాలు! అదేంటి అనుకుంటున్నారా.. కింది కథనం చూసి తెలుసుకోండి ఐఫోన్​ కొత్త అప్‌డేట్స్‌...

IPHONE
Iphone Updates: కొరుక్కు తినేలా కొత్త 'యాపిల్‌'!
author img

By

Published : Jun 16, 2021, 11:06 AM IST

ఎప్పటికప్పుడు వినూత్న ఆవిష్కరణలతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న యాపిల్‌ సంస్థ సరిగ్గా ఇలాంటి పరిస్థితినే సృష్టించే దిశగా అడుగులేస్తోంది. తాజా వరల్డ్‌వైడ్‌ డెవలపర్స్‌ కాన్ఫరెన్స్‌లో (డబ్ల్యూడబ్ల్యూడీసీ 21) యాపిల్‌ ప్రకటించిన అప్‌డేట్స్‌ను చూస్తే ఇదింకెంతో దూరంలో లేదనే తోస్తోంది. కొత్త ఐఓఎస్‌15, ఐప్యాడ్‌ఓఎస్‌15, మ్యాక్‌ఓఎస్‌ మాంటెరే, వాచ్‌ఓఎస్‌ 8 పరికరాల భవిష్యత్‌ శక్తిని ఈ వాస్తవిక కాల్పనిక సమావేశం కళ్లకు కట్టింది. వీటికి సంబంధించి రోజుకో కొత్త సంగతి బయటపడుతోంది.

సంగీతం, సినిమాలు కలివిడిగా..

చాలా యాప్స్‌లో అతి ముఖ్యమైన అంశం షేర్‌ చేసుకునే వీలుండటం. ఉదాహరణకు- ఫేస్‌టైమ్‌ కాల్‌ చేస్తున్నప్పుడూ ఇష్టమైన సంగీతం వినొచ్చు, సినిమాలు చూడొచ్చు. యాపిల్‌ మ్యూజిక్‌లో పాటను వింటూ దాన్ని షేర్‌ప్లే ద్వారా షేర్‌ చేసుకోవచ్చు. దీన్ని ఎవరైనా పాజ్‌ చేయొచ్చు. తర్వాత పాటలోకి జంప్‌ చేయొచ్చు. యాపిల్‌ టీవీ వీడియోలనూ ఇలాగే షేర్‌ చేసుకోవచ్చు. ఒక్క వీటినే కాదు.. డిస్నీ ప్లస్‌, ట్విచ్‌, మాస్టర్‌క్లాస్‌ వంటి స్ట్రీమింగ్‌ సర్వీసుల వీడియోలనూ షేర్‌ప్లే చేసుకోవచ్చు.

గోప్యతకు పెద్ద పీట

కొత్త అప్‌డేట్స్‌లో అన్నింటికన్నా ముఖ్యమైంది కట్టుదిట్టమైన గోప్యత (ప్రైవసీ). యాప్స్‌ తమ గురించి ఎలాంటి సమాచారాన్ని సేకరిస్తున్నాయో ఐఓఎస్‌ 15 ఎప్పటికప్పుడు పసిగడుతుంది. ఫొటో ఆల్బమ్‌, కాంటాక్ట్‌ జాబితా, మైక్రోఫోన్‌ వంటి వాటిపై యాప్స్‌ పైచేయి సాధిస్తే వెంటనే తెలియజేస్తుంది. ఇలా ఆయా కంపెనీల ప్రకటనల కోసం తమను ట్రాక్‌ చేయొచ్చో లేదో నిర్ణయించుకోవటానికి అవకాశం కల్పిస్తుంది. ఐపీని ట్రాక్‌ చేయకుండా యాప్‌ ట్రాకింగ్‌ ట్రాన్స్‌పరెన్సీ అడ్డుకుంటుంది మరి. ఇది ట్రాకర్లకు ఐపీ చిరునామా కనిపించకుండా చేస్తుంది. మరో భారీ మార్పు మెయిల్‌ యాప్‌. కొన్ని మెయిల్‌ సందేశాలు పిక్సెల్స్‌ ద్వారా మనల్ని ట్రాక్‌ చేస్తుంటాయి. మెయిల్‌ ఇకపై డిఫాల్ట్‌గా ఐపీ అడ్రస్‌ వీటికి చిక్కకుండానూ చేసేస్తుంది.

.

మరింత అనువుగా ఫేస్‌టైమ్‌

కరోనా విజృంభణ నేపథ్యంలో యాపిల్‌ ఎప్పటికప్పుడు ఫేస్‌టైమ్‌లో కొత్త మార్పులు తెస్తూనే ఉంది. వీడియో సమావేశంలో ఉన్నప్పుడు ఏదైనా కాల్‌ వస్తే వీడియో చాట్‌ చేయటం, లింక్స్‌ షేర్‌ చేసుకోవటం వంటివి వీటిల్లో కొన్ని. యాపిల్‌ ఇక్కడితోనే ఆగిపోవటం లేదు. ఆండ్రాయిడ్‌, విండోస్‌ పరికరాలు వాడేవారు సైతం ఈ లింక్స్‌ను వెబ్‌ ద్వారా యాక్సెస్‌ చేసుకోవటానికీ వీలు కల్పించనుంది. దృశ్యాలు, మాటలు మరింత స్పష్టంగా, ‘సజీవ’ంగా ఉండే విధంగానూ తీర్చిదిద్దనుంది. స్పేషియల్‌ ఆడియో ఫీచర్‌ మూలంగా ఫేస్‌టైమ్‌ కాల్స్‌లో పాల్గొంటున్నవారు మన గదిలో ఉన్నారేమో అనే భావన కల్గిస్తుంది. అంటే స్క్రీన్‌కు కుడివైపున ఉన్న వ్యక్తి మాట్లాడుతుంటే కుడి వైపు స్పీకర్‌ నుంచి మాటలు వినిపిస్తాయి. వెనక దృశ్యాలను మసక బరచి మాట్లాడుతున్నవారే స్పష్టంగా కనిపించేలా చేసే సదుపాయమూ రానుంది.

ఒకేసారి మ్యాక్‌తో ఇతర పరికరాలూ..

యూనివర్సిటీ కంట్రోల్‌ యాప్‌ మరో అధునాతన పరిజ్ఞానం. నమ్మకమైన యాపిల్‌ వినియోగదార్లకిది సంతోషాన్ని కలిగిస్తుందనటం నిస్సందేహం. మ్యాక్‌ఓఎస్‌ మాంటెరే తాజా వర్షన్‌లో ఇదో మంచి అప్‌డేట్‌. దీంతో ఒకే సమయంలో మ్యాక్‌బుక్‌, ఐప్యాడ్‌ వంటి ఇతర యాపిల్‌ పరికరాలనూ వినియోగించుకోవచ్చు. ఉదాహరణకు ఐఫోన్‌లో ఏదో వార్తను చూస్తున్నారనుకోండి. కావాలంటే దీన్ని మ్యాక్‌బుక్‌లోనూ చదువుకోవచ్చు. లేదూ ఐప్యాడ్‌ నుంచి ఐమ్యాక్‌లోకి లింకును కాపీ చేసుకోవచ్చు. యూనివర్సిటీ కంట్రోల్‌ ద్వారా ఒకే మౌజ్‌ లేదా కీబోర్డుతో వివిధ యాపిల్‌ పరికరాలను యాక్సెస్‌ చేసుకోవచ్చు. ఒక పరికరం నుంచి మరో పరికరంలోకి ఫైళ్లను డ్రాగ్‌ చేసుకోవచ్చు. వీడియోలు, ఫొటోలతో ఎక్కువగా పనిచేసేవారికిది ఎంతగానో ఉపయోగపడుతుంది.

మా మంచి ఎయిర్‌పాడ్స్‌

ఎయిర్‌పాడ్స్‌ ప్రొలో ‘కన్వర్జేషన్‌ బూస్ట్‌’ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. ఇది రద్దీ ప్రాంతాల్లోనూ చుట్టుపక్కల శబ్దాల తీవ్రతను తగ్గించేసి, ఎదురుగా ఉన్నవారి మాటలు స్పష్టంగా వినపడేలా చేస్తుంది. ఎయిర్‌పాడ్స్‌ ప్రొ, ఎయిర్‌పాడ్స్‌ మాక్స్‌లను ఎక్కడ పెట్టామో మరచిపోతే ఫైండ్‌ మై నెట్‌వర్క్‌ ద్వారా ఎక్కడున్నాయో కూడా తెలుసుకోవచ్చు.

తాళం చెవులకు చెల్లు!

తాళం చెవులు ఎక్కడో పెట్టటం, మరచిపోవటం తరచూ ఎదుర్కొనేది. ఇకపై ఐఫోన్‌ వినియోగదార్లకు ఇలాంటి ఇబ్బందులేవీ ఉండకపోవచ్చు. ఇల్లు, ఆఫీసు, హోటల్‌.. వేటి తలుపులనైనా డిజిటల్‌ కీస్‌తోనే తేలికగా తెరిచేందుకు మార్గం సుగమం కానుంది! వచ్చే మూడు, నాలుగు నెలల్లో వెయ్యికి పైగా హోటళ్లలో ఈ పరిజ్ఞానాన్ని ఆరంభించాలని హయత్‌ హోటల్స్‌ ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది కూడా.

ఆరోగ్య భాగ్యం

ఆరోగ్యం విషయంలో యాపిల్‌ వాచ్‌, హెల్త్‌ యాప్‌ ప్రత్యేకతలు అందరికీ తెలిసిందే. వాచ్‌ ధరించినా, హెల్త్‌ యాప్‌తో కూడిన ఐఫోన్‌ పట్టుకున్నా చాలు. గుండె వేగం, నడక/పరుగు తీరుతెన్నుల వంటి సమాచారమంతా సేకరిస్తుంది. అడుగులు వేస్తున్న తీరును బట్టి యాపిల్‌ హెల్త్‌ మనం స్థిరంగా నడుస్తున్నామా? లేదా? బ్యాలెన్స్‌ తప్పుతున్నామా? అనేదీ గుర్తిస్తుంది. నడుస్తున్నప్పుడు స్థిరంగా ఉండటానికి చిట్కాలూ సూచిస్తుంది. కింద పడిపోయే ముప్పు పెరుగుతుంటే ముందే హెచ్చరిస్తుంది. కృత్రిమ కాలు అమర్చుకున్నవారికి, కాలికి లేదా పాదానికి సర్జరీ చేయించుకున్నవారికిది ఎంతగానో ఉపయోగపడనుంది. అసిస్టివ్‌ టచ్‌ ఫీచర్‌ ద్వారా ఒంటి చేత్తోనే.. అంటే చేతి కదలికలతోనే యాపిల్‌ వాచ్‌ను ఆపరేట్‌ చేయొచ్చు. ఒక్క చేయి మాత్రమే గలవారికి, చేయి సరిగా కదలించలేనివారికిది ఎంతగానో ఉపయోగపడగలదు.

వాచ్‌ ఓఎస్‌8లో మైండ్‌ఫుల్‌నెస్‌ యాప్‌ కూడా తోడవనుంది. ఇది బ్రెత్‌ యాప్‌నకు కొనసాగింపు. కొత్త యానిమేషన్‌ చిత్రాలు, ఇతర ఫీచర్లతో మానసిక ప్రశాంతతకు తోడ్పడేలా దీన్ని మెరుగుపరచారు. తాజా ఫిట్‌నెస్‌ యాప్‌ అయితే తాయ్‌ చీ, పైలేట్ల వంటి వ్యాయామాలనూ నేర్పిస్తుంది.

ఒకేసారి ఎన్నో పనులు

ఒకే సమయంలో రకరకాల పనులు చేసుకోవటానికి వీలుగా ఐప్యాడ్‌ ఓఎస్‌ 15 కొత్త హంగులతో ముస్తాబు కానుంది. విడ్జెట్లు ఆకర్షణీయంగానే కాదు, పెద్దగానూ దర్శనమివ్వనున్నాయి. తెర మీద అన్నింటికన్నా పైన మల్టీటాస్కింగ్‌ మెనూ కనిపిస్తుంది. ఫుల్‌ స్క్రీన్‌ మీద యాప్స్‌ సృష్టించుకోవచ్చు. ఇతర యాప్స్‌ను చూడాలనుకుంటే తెరను స్ప్లిట్‌ చేసుకోవచ్చు. హోం స్క్రీన్‌ను యాక్సెస్‌ చేయాలనుకుంటే విండోస్‌ను తెరకు ఒక పక్కకు జరుపుకోవచ్చు. దీంతో ఇతర యాప్స్‌లతో పనిచేయటం తేలికవుతుంది. నోట్స్‌ యాప్‌లోనూ ఎక్కువ మంది భాగస్వాములయ్యేలా మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇతరులకు పంపించిన డాక్యుమెంట్‌లో సహ ఉద్యోగులను ట్యాగ్‌ చేయటానికీ అవకాశముంటుంది.

క్విక్‌ నోట్స్‌ అనే కొత్త ఫీచరూ అందుబాటులోకి రానుంది. ఇది నోట్స్‌ తీసుకునే యాప్‌ను ఇతర యాప్‌ల మీద తేలియాడేలా చేస్తుంది. ఇతర యాప్‌లను మూయకుండానే తేలికగా నోట్స్‌ తీసుకోవటానికిది వీలు కల్పిస్తుంది. ఇక స్విఫ్ట్‌ ప్లేగ్రౌండ్స్‌ కొత్త వెర్షన్‌ అయితే యాప్స్‌ తయారీని నేర్చుకోవటానికి, రూపొందించటానికి.. ఐప్యాడ్‌, ఐఫోన్‌ యాప్‌లను యాప్‌ స్టోర్‌లో సబ్‌మిట్‌ చేయటానికి వీలు కల్పిస్తుంది. మ్యాక్‌ లేకపోయినా యాప్స్‌ను సమర్పించొచ్చు.

మరిన్ని కొత్తందాలు

నోటిఫికేషన్లు ప్రాధాన్యం: ఆన్‌-డివైస్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో నోటిఫికేషన్లను ప్రాధాన్య క్రమంలో అమర్చుకోవచ్చు. దీంతో అత్యవసరమైన నోటిఫికేషన్‌ అన్నింటికన్నా పైన కనిపిస్తుంది. సిరి ఇకపై ఎయిర్‌పాడ్స్‌లోనూ నోటిఫికేషన్లను ప్రకటిస్తుంది.

సరికొత్త వెదర్‌ యాప్‌: ఫుల్‌ స్క్రీన్‌ మ్యాపులు, పరిస్థితులకు అనుగుణంగా మారిపోయే లేఅవుట్లతో వాతావరణ సమాచారం మరింత ఆకర్షణీయంగా దర్శనమిస్తుంది.

కొత్త సెటప్‌: ప్రస్తుతం ఐఫోన్‌ను వాడుతున్నవారు తాత్కాలికంగా డేటాను ఐక్లౌడ్‌లో భద్రపరచుకోవచ్చు. దీంతో కొత్త ఐఫోన్‌కు తేలికగా సమాచారాన్ని పంపుకోవచ్చు. సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోకపోయినా దీన్ని వాడుకోవచ్చు.

సౌండ్‌ కంట్రోల్‌: ధారాళంగా మాట్లాడలేనివారు క్లిక్‌, క్లాప్‌, ఊ, యూ వంటి శబ్దాలతోనూ ఐఫోన్‌ను వాడుకోవచ్చు. ఇందుకోసం స్విచ్‌ కంట్రోల్‌ ద్వారా ఆడియో స్విచ్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

3డీ గ్లోబ్‌: పర్వతాల వంటివి మరింత స్పష్టంగా కనిపించేలా యాపిల్‌ మ్యాప్స్‌లో ఇంటరాక్టివ్‌ 3డీ గ్లోబ్‌ దర్శనమివ్వనుంది.

ఇదీ చూడండి: ఇంటర్నెట్​ వేగంలో టాప్ 10 దేశాలివే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.