ETV Bharat / science-and-technology

అంగారకుడి గుట్టు తేల్చే ప్రయోగాల్లో కీలక ముందడుగు!

2018లో నాసా పంపిన ఇన్​సైట్ ప్రోబ్​​ కీలక సమాచారాన్ని భూమికి చేరవేసింది. దాని ద్వారా మార్స్​ అంతర్భాగంలో ప్రకంపనలు, లోపలి పొరలు, మార్స్​ కేంద్రానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవటంలో కీలక అడుగు పడింది. ఈ సమాచారం అరుణ గ్రహంపై జీవం పుట్టుకను తెలుసుకునేందుకు ఉపయోగపడనుందని నాసా పేర్కొంది.

mars
అంగారకునిపై ప్రకంపనలు
author img

By

Published : Jul 23, 2021, 8:51 PM IST

ఇతర గ్రహాల మీద ఏం జరుగుతుందనే అంశం మానవులకు ఎప్పటికీ నిత్యనూతనంగానే ఉంటుంది. అందుకే అటువంటి ఆసక్తికరమైన వాటి గురించి తెలుసుకోవడానికి సౌర కుటుంబంలోని ఉండే గ్రహాలు, ఉపగ్రహాల మీద అనేక ప్రయోగాలు చేపట్టారు. ఇందులో భాగంగానే అంగారకుడి గుట్టు తేల్చేందుకు 2018లో మార్స్​ ఇన్​సైట్ ప్రోబ్​​ ఉపగ్రహాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా పంపించింది. అది అరుణుడికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంపించింది. వాటిలో ప్రముఖంగా అంగారకుడిపై భూకంపాలు, లోహాలు, పొరల గురించిన కీలక సమాచారాన్ని అందించింది.

నాసా పంపిన మార్స్ ఇన్​సైట్​ ల్యాండర్​లో భూకంప కదలికలను నమోదు చేసే సెస్మోమీటర్​ను పంపారు. ఇన్​సైట్​ అంగారక గ్రహాన్ని చేరిన కొన్ని నెలల్లోనే అక్కడ ప్రకంపనలు నమోదయ్యాయి. అయితే ఆ గ్రహంపై ఇప్పటివరకు అనేకసార్లు వాటిని గుర్తించారు. ఆ ప్రకంపనలు అనేవి ఉల్కాపాతం వల్ల జరిగాయా? లేక అంగారకుడి అంతర్భాగంలో జరిగిన వివిధ చర్యల వల్ల చోటు చేసుకున్నాయా అనేది పూర్తిస్థాయిలో అంచనా వేయలేకపోయారు. సెస్మోమీటర్​ అనేది మార్స్​లోని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పని చేస్తుంది. అక్కడ వచ్చే గాలులు కూడా పరికరం పనితీరును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. మరోవైపు గ్రహంలోపల ఏర్పడే చర్యలను అంచనా వేయాలంటే వాటిలో ఎక్కువ భాగం ఇనుముతో కూడిన కోర్ కలిగి ఉండటం వల్ల సాధ్యపడటం లేదని.. శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీని వల్ల భూ గ్రహం మీద పొందినంత సులభంగా లెక్కకట్టడం కుదరదని భావిస్తున్నారు. ఆ గ్రహంలో ఎన్ని పొరలు ఉంటాయి అనే దానిపై కూడా వాస్తవ లెక్కలు లేవు.

అంతు చిక్కని మార్స్​ కేంద్రం..

అంగారక గ్రహం కేంద్రం కనుగొనడం అనేది దాదాపు అసాధ్యమైన విషయం. దీని కోసం శాస్త్రవేత్తలు భూ ప్రకంపనల ద్వారా కేంద్రాన్ని కనుక్కోవాలని ప్రయత్నిస్తున్నారు. దీని ఫలితంగా అంగారక గ్రహం వ్యాసార్థం 1,830 కిలోమీటర్లు అని ప్రాథమిక అంచనాకు వచ్చారు. కానీ అది శాస్త్రవేత్తలు అనుకున్న దానికన్నా ఎన్నోరెట్లు పెద్దది. ఈ కేంద్రంలో భారీ మూలకాలు అయిన ఇనుము, సల్ఫర్​లు ఉన్నాయని నిపుణులు తేల్చారు. ఇది ద్రవరూపంలో ఉందని చెప్పుకొచ్చారు.

లోపలి పొరలు..

భూమిపై 100ఏళ్లకు పైగానే భూకంపాలకు సంబంధించిన సమాచారం ఉంది. వీటి ద్వారా భూమిలోపల కొన్ని పొరలు కూడా ఏర్పడ్డాయి. అదే విధంగా మార్స్​లో కూడా పొరలు ఉన్నాయి. నిజానికి ఇవి అరుణ గ్రహం​ కేంద్రం వరకూ ఒకేలా ఉండవు అని అంటున్నారు నిపుణులు. భూమిలోపల ఉండే లిథోస్పియర్ మార్స్​లో 400 కిలోమీటర్ల నుంచి 600 కిలోమీటర్ల మందంతో ఉందని వారు కనుగొన్నారు. ఈ పొర చాలా మందంగా ఉందని పేర్కొన్నారు. అయితే ఆ పొరలు నీటితో కలసి రసాయన చర్యలకు లోనైతే జీవం పుట్టుకకు ఆనవాళ్లు దొరకవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

మొత్తంగా చూస్తే గ్రహాలకు సంబంధించిన ప్రకంపనలపై ఓ కీలక ముందడుగు పడిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. భవిష్యత్తులో మరెన్నో మార్స్​ అంతరిక్ష కార్యకలాపాలకు ఇది ఆలవాలంగా నిలుస్తుందని చెప్తున్నారు.

ఇదీ చూడండి: 'హబుల్ టెలిస్కోప్'​పై నాసా కీలక ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.