కొవిడ్-19 టీకా కార్యక్రమాన్ని వేగవంతం (maharastra vaccination rate) చేయటానికి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. కనీసం టీకా ఒక డోసు వేసుకున్నవారికి మాత్రమే రేషన్, పెట్రోల్, గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయాలని డీలర్లు, ఏజెన్సీలకు మంగళవారం రాత్రి ఆ జిల్లా కలెక్టర్ (maharastra vaccination district wise) ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు పాటించని వారిపై విపత్తు యజమాన్య చట్టం, మహమ్మారి వ్యాధుల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఔరంగాబాద్‌లో వ్యాక్సిన్ కార్యక్రమం మందకొడిగా సాగుతోంది. మహారాష్ట్రలో 74% మంది టీకాలు వేయించుకుంటే ఔరంగాబాద్‌లో అది 55 శాతం మాత్రమే. రాష్ట్రంలోని 36 జిల్లాల్లో 26వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలోనే జిల్లా అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు.