అత్యాధునిక ఫీచర్లతో ఎప్పటికప్పుడు కొత్త ల్యాప్‌టాప్‌లు వస్తున్న నేపథ్యంలో దేనిని కొనుగోలు చేయాలో తేల్చుకోవడం అంత సులువు కాదు. ఇక రూ.15 వేల బడ్జెట్లో అది మరీ కష్టం. అయితే మీకోసం కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. భారత్‌లో లభించే రూ.15లోపు బెస్ట్ ల్యాప్‌టాప్స్‌పై ఓ లుక్కేయండి.
1.ఐబాల్ కాంప్బుక్ ప్రీమియో వీ3.0
బడ్జెట్లో దొరికే ఉత్తమ ల్యాప్‌టాప్ ఐబాల్ కాంప్బుక్ ప్రీమియో వీ3.0. ఇందులో క్వాడ్‌కోర్ పెంటియమ్ ప్రాసెసర్‌తో పాటు 4జీబీ ర్యామ్ లభిస్తుంది. 1080పీ టచ్‌స్క్రీన్‌తో ఈ రేంజ్లో లభించే నాణ్యమైన నోట్‌బుక్ ఇది.
ఫీచర్లు:
ఓఎస్ - విండోస్ 10 హోమ్
డిస్ప్లే - 14" (1920 x 1080)
ప్రాసెసర్- ఇంటెల్ పెంటియమ్ క్వాడ్ కోర్- ఎన్4200, 1.1గిగాహెర్ట్జ్
మెమొరీ- 32జీబీ
డైమెన్షన్- 334x222x24
గ్రాఫిక్ ప్రాసెసర్- ఇంటెల్ ఇంటిగ్రేటెడ్ హెచ్డీ 505
ధర - రూ.13,900
2. మైక్రోమ్యాక్స్ నియో ల్యాప్‌టాప్ పెంటియమ్-ఎన్3700 (2021)
ఈ నియో ల్యాపీ రూ.15వేల కన్నా కొద్దిగా ఎక్కువ. కానీ అందుకు తగ్గ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇంటెల్ పెంటియమ్ ఎన్3700 క్వాడ్ కోర్ చిప్సెట్, 1.6గిగాహెర్ట్జ్ క్లాక్, ఇంటెల్ హెచ్డీ గ్రాఫిక్స్‌తో వస్తుంది. విండోస్ 10ఓఎస్‌పై పనిచేస్తుంది.
ఫీచర్లు:
ఓఎస్- విండోస్ 10 హోమ్
డిస్ప్లే- 14.1" (1366 x 768)
ప్రాసెసర్- పెంటియమ్-ఎన్3700, 1.6గిగాహెర్ట్జ్
మెమొరీ- 500జీబీ
బరువు- 1.5
డైమెన్షన్- 23.7 x 34.1 x 2.1
గ్రాఫిక్ ప్రాసెసర్- ఇంటిగ్రేటెడ్
ధర- రూ.15,990
ఇదీ చూడండి: ల్యాప్‌టాప్ కొంటున్నారా.. అయితే వీటిపై ఓ లుక్కేయండి