Latest Earbuds Under 1000 : నేడు ఇయర్‌బడ్స్ వాడడం చాలా ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్కరూ వైర్లెస్ ఇయర్ బడ్స్ వాడడానికి ఇష్టపడుతున్నారు. అందుకే టాప్ బ్రాండ్స్ అన్నీ.. ప్రీమియం ఇయర్బడ్స్తోపాటు, సామాన్యులకు అందుబాటులో ఉండే బడ్జెట్ ఇయర్‌బడ్స్‌ను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు పోటీపడుతున్నాయి. లేటెస్ట్గా బోట్, నాయిస్ కంపెనీలు బడ్జెట్ ధరలో సరికొత్త ఇయర్‌బడ్స్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేశాయి. అవే boAt Airdopes Alpha TWS, Noise Buds Aero TWS. వాటి స్పెసిఫికేషన్స్, స్పెషల్ ఫీచర్స్ గురించి చూద్దాం.
ఎయిర్‌డోప్స్ ఆల్ఫా టీడబ్ల్యూఎస్
Airdopes Alpha TWS Features : ఎయిర్‌డోప్స్ ఆల్ఫా టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్.. ప్లాస్టిక్ కేసులో రౌండ్ ఎడ్జ్‌తో వస్తాయి. ఓపెన్ ఫిట్ డిజైన్‌తో.. హెప్టిక్ బేస్డ్ టచ్ కంట్రోల్‌తో ఇవి పనిచేస్తాయి. 13mm బాస్ బూస్ట్ డ్యూయెల్ డ్రైవర్స్ ఉన్న ఈ ఇయర్‌బడ్స్‌లో బోట్ కంపెనీ సిగ్నేచర్ సౌండ్ టెక్నాలజీ ఉపయోగించారు. అందువల్ల దీనిలో మంచి హైక్వాలిటీ ఆడియోను ఎంజాయ్ చేయవచ్చు.
ఈ TWS ఇయర్‌బడ్స్‌లో క్వాడ్ మైక్రోఫోన్ యారీ, బోట్ ఈఎన్ఎక్స్ టెక్నాలజీ వాడారు. అందువల్ల బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ వినిపించదు. కాల్స్ మాట్లాడేటప్పుడు కూడా ఎలాంటి అంతరాయాలు కలగవు. ఈ ఇయర్‌బడ్స్ బీస్డ్ మోడ్‌లో.. 50ms లో-లేటెన్సీతో పని చేసి, యూజర్‌కు మంచి సౌండ్ క్వాలిటీని అందిస్తాయి. ముఖ్యంగా గేమింగ్స్ ఇష్టపడేవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఎయిర్‌డోప్స్ ఆల్ఫా టీడబ్ల్యూఎస్ స్పెసిఫికేషన్స్
Airdopes Alpha TWS Specs : యూజర్లు ఎయిర్‌డోప్స్ ఆల్ఫా ఇయర్‌బడ్స్‌తో నిర్విరామంగా 35 గంటలపాటు మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయవచ్చు. ఈ ఇయర్‌బడ్స్‌లో 300mAh బ్యాటరీ, టైప్ పోర్టు ఉంటాయి. వీటికి అదనంగా ఒక్కో ఇయర్‌బడ్‌కు ప్రత్యేకంగా 35mAh బ్యాటరీ ఉంటుంది. దీనిని 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే.. మీరు 2 గంటలపాటు మ్యూజిక్‌ను ఆస్వాదించవచ్చు.
TWS ఇయర్‌బడ్స్.. బ్లూటూత్ 5.3 సపోర్టుతో వస్తుంది. అంతేకాకుండా IPX5 splash రెసిస్టెన్స్ ఇస్తుంది. మరో ముఖ్యమైన ఫీచర్ ఏమిటంటే.. ఐడబ్ల్యూపీ సాంకేతికతో 10 మీటర్ల దూరం నుంచి కూడా ఈ ఇయర్‌బడ్స్‌ను పెయిర్ చేయవచ్చు. అలాగే ఇవి సిరి, గూగుల్ అసిస్టెంట్ లాంటి వాయిస్ అసిస్టెంట్స్‌ను, ఇన్-ఇయర్ డిటెక్షన్‌ను సపోర్ట్ చేస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో బోట్ Airdopes Alpha TWS ధర రూ.799గా ఉంది.
నోయిస్ బడ్స్ ఏరో
Noise Buds Aero specs : నాయిస్ కంపెనీ ఇన్-ఇయర్ డిజైన్, మ్యాట్ ఫినిష్ విత్ క్రోమ్ యాక్సెంట్‌తో 'బడ్స్ ఏరో' ఇయర్‌బడ్స్‌ను ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ బడ్స్ 13mm డ్రైవర్స్‌తో, ఎన్విరాన్మెంట్ సౌండ్ రిడక్షన్ టెక్నాలజీతో వస్తాయి. సౌండ్ క్వాలీటీ చాలా బాగుంటుంది. ముఖ్యంగా కాల్స్ మాట్లాడేటప్పుడు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ వినిపించదు.
ఈ నాయిస్ బడ్స్ ఏరో.. 50ms లో-లేటెన్సీ కలిగిన డెడికేటెడ్ గేమింగ్ మోడ్‌తో వస్తుంది. ఇది ఒక్కసారి ఫుల్‌గా ఛార్జ్ చేస్తే.. 45 గంటలపాటు పని చేస్తుంది. దీనిలో యూఎస్బీ టైప్ సీ పోర్టు ఉంటుంది. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కూడా ఉంది. కేవలం 10 నిమిషాలు ఛార్జింగ్ పెడితే 120 నిమిషాల పాటు పనిచేస్తుంది.
Noise Buds Aero features : నాయిస్ బడ్స్ ఏరో.. బ్లూటూత్ 5.3 సపోర్టుతో వస్తుంది. హైపర్ సింక్ టెక్నాలజీ వల్ల ఈ ఇయర్‌బడ్స్‌ను చాలా తొందరగా పెయిర్ చేసుకోవడానికి వీలవుతుంది. అలాగే టచ్ కంట్రోల్స్, IPS5 రేటింగ్ వాటర్, స్వీట్ రెసిస్టెన్స్, ఏఏసీ ఆడియో కోడెక్ సపోర్ట్ ఉంటాయి. ఛార్కోల్ బ్లాక్, స్నో వైట్ కలర్ వేరియంట్స్‌లో లభించే ఈ నాయిస్ బడ్స్ ఏరోకు ఒక సంవత్సరం పాటు వారంటీ కూడా ఉంటుంది.
Noise Buds Aero Price : ప్రస్తుతం ఈ నాయిస్ బడ్స్ ఏరో ఇయర్‌బడ్స్‌ను మింత్రా లేదా నాయిస్ కంపెనీ వెబ్సైట్ నుంచి కేవలం రూ.799కే కొనుగోలు చేయవచ్చు.