ETV Bharat / science-and-technology

ల్యాప్‌టాప్‌ వేడెక్కుతోందా?..ఈ జాగ్రత్తలు పాటించండి - laptop overheating and shutting down

Laptop Overheating Solution: ప్రస్తుత కరోనా సమయంలో ల్యాప్​టాప్​ల వాడకం తప్పనిసరైంది. ఇంటి నుంచే పని కారణంగా రోజంతా ల్యాపీని ఉపయోగిస్తున్నాం. కొన్నిసార్లు మనం ఉపయోగించే ల్యాపీలు ఒక్కసారిగా వేడెక్కుతుంటాయి. కారణం తెలుసుకునేలోపే అందులోంచి పొగలు రావడం, లోపలి కాంపొనెంట్లు కాలిపోవడం వంటివి జరుగుతాయి. ఇంతకీ ల్యాప్‌టాప్‌ వేడెక్కడానికి అసలు కారణం ఏంటి? వేడెక్కకుండా ఉండాలంటే ఏం చేయాలి?

laptop overheating symptoms
ల్యాప్‌టాప్‌
author img

By

Published : Jan 16, 2022, 9:33 AM IST

Laptop Overheating Solution: ఉన్నచోటు నుంచే పని చేసుకునేందుకు ల్యాప్‌టాప్‌లు ఎంతో సౌకర్యంగా ఉంటాయి. లాక్‌డౌన్‌ సమయంలో ఆన్‌లైన్‌ క్లాసుల నుంచి ఆఫీస్‌ వర్క్‌ వరకు ఎన్నో రకాలుగా వీటిని ఉపయోగించారు. అయితే కొన్నిసార్లు మనం ఉపయోగించే ల్యాపీలు ఒక్కసారిగా వేడెక్కుతుంటాయి. కారణం తెలుసుకునేలోపే అందులోంచి పొగలు రావడం, లోపలి కాంపొనెంట్లు కాలిపోవడం వంటివి జరుగుతాయి. ఇంతకీ ల్యాప్‌టాప్‌ వేడెక్కడానికి అసలు కారణం ఏంటి? వేడెక్కకుండా ఉండాలంటే ఏం చేయాలి?

ఎందుకు వేడెక్కుతుంది?:

Laptop Overheating Symptoms: ల్యాప్‌టాప్ వేడెక్కకుండా అందులోని కూలింగ్ ఫ్యాన్‌లు పనిచేస్తాయి. కొన్నిసార్లు ఈ ఫ్యాన్లపైకి దుమ్ము చేరుకోవడం వల్ల వాటి పనితీరు నెమ్మదిస్తుంది. దీంతో అవసరమైన కూలింగ్‌ను ల్యాపీకి అందించలేవు. కొన్ని ల్యాప్‌టాప్‌లలో కూలింగ్ ఫ్యాన్లు ఉండవు. అలాంటి వాటిలో ఉత్పత్తయ్యే వేడి ల్యాప్‌టాప్‌ బాడీ ఫ్రేమ్‌కు అన్ని వైపులా ఉండే వెంటిలేటర్లు, ఎగ్జాస్ట్‌ ద్వారా బయటికి వెళుతుంది. అలానే ల్యాప్‌టాప్‌కు అవసరమైన కూలింగ్ బయట నుంచి అందుతుంది. ఒకవేళ వీటికి దుమ్ము పట్టినా ల్యాప్‌టాప్‌కు సరిపడినంత కూలింగ్ అందక వేడెక్కే అవకాశం ఉంది. వీటితోపాటు థర్మల్‌ పేస్ట్‌ లేదా థర్మల్‌ పాడ్ పాడైనా వేడెక్కే అవకాశం ఉంది. థర్మల్‌ పాడ్ లేదా థర్మల్‌ పేస్ట్‌ ప్రాసెసింగ్ యూనిట్ల నుంచి వేడిని కూలింగ్‌ ఫ్యాన్లకు చేరవేస్తుంది. ఇది ప్రాసెసర్‌, హీట్‌ సింక్‌కు మధ్య ఉంటుంది.

ల్యాప్‌టాప్‌ హీట్‌ని ఎలా తెలుసుకోవాలి?

Laptop Overheating Sound: ల్యాప్‌టాప్‌ ఆన్‌ చేసిన ప్రతిసారీ అందులోని కూలింగ్ ఫ్యాన్లు ఎక్కువ వేగంతో తిరుగుతున్న శబ్దం వినిపిస్తున్నా, ల్యాపీ పనితీరు నెమ్మదించినట్లు అనిపించినా వేడెక్కుతున్నట్లు అనుమానించాల్సిందే. హెచ్‌డబ్ల్యూ మానిటర్‌ అనే టూల్‌ను ఉపయోగించి ల్యాప్‌టాప్ హీట్‌ను తెలుసుకోవచ్చు. ఇది మీ ల్యాప్‌టాప్‌లో ఏయే పార్ట్‌లు ఎంత వేడవుతున్నాయనేది తెలియజేస్తుంది.

laptop overheating symptoms
ల్యాప్​టాప్​ వేడెక్కకుండా జాగ్రత్తలు

వేడెక్కకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

Precautions to Cool Down Overheating Laptop:

  • ల్యాప్‌టాప్‌ వేడెక్కుతుందని గుర్తించిన వెంటనే ముందుగా కూలింగ్ ఫ్యాన్లను శుభ్రం చేయాలి. ఎందుకంటే ఇవి ల్యాప్‌టాప్‌లో ఎంతో కీలకమైన సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్‌ (సీపీయూ), గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్‌ (జీపీయూ)కు అవసరమైన కూలింగ్‌ను అందిస్తాయి. వీటిపై దుమ్ము చేరితే ఫ్యాన్ల పనితీరు మందగించి, ఎయిర్‌ఫ్లోను అడ్డుకుంటాయి. వీటిని శుభ్రం చేసే ముందు ఈ సూచనలు పాటించడం మేలంటున్నారు టెక్ నిపుణులు.
  • ల్యాప్‌టాప్‌ను షట్‌డౌన్‌ చేసి కేబుల్స్‌, బ్యాటరీని తొలగించాలి. తర్వాత మీ ల్యాప్‌టాప్‌ ఓపెన్‌ చేసి కూలింగ్‌ ఫ్యాన్లను దూది లేదా ఇయర్‌బడ్స్‌ను ఐసోప్రొఫైల్ ఆల్కహాల్‌లో ముంచి శుభ్రం చేయాలి. అయితే ఐసోప్రొఫైల్‌ ఆల్కహాల్ ల్యాప్‌టాప్ కాంపొనెంట్స్‌పై లేకుండా పూర్తిగా ఆవిరి అయ్యేలా తుడవాలి. దూది లేదా ఇయర్‌బడ్స్‌ బదులు వాక్యూమ్‌ క్లీనర్ కూడా ఉపయోగించవచ్చు.
  • కొన్ని వాక్యూమ్‌ క్లీనర్స్‌ ఎక్కువ ప్రెజర్‌ను విడుదల చేస్తాయి. కాబట్టి, అనుభవం లేకుంటే ఉపయోగించపోవడం మేలు. ప్రెజర్‌ ఎక్కువయితే ల్యాప్‌టాప్‌లోని సున్నితమైన భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. తక్కువ ప్రెజర్‌ ఉండే ఎయిర్‌ పంప్‌లతో కూడా కూలింగ్‌ ఫ్యాన్‌లు శుభ్రం చేయొచ్చు. తర్వాత ల్యాప్‌టాప్‌ ఎగ్జాస్ట్‌, వెంటిలేటర్లను సున్నితమైన బ్రెజిల్స్‌ ఉన్న బ్రష్‌తో శుభ్రం చేయాలి.
  • ల్యాప్‌టాప్‌ వెనుక భాగం ఓపెన్ చేయడం, కూలింగ్ ఫ్యాన్, వెంటిలేటర్లు వంటి వాటిని శుభ్రం చేసిన అనుభవం లేకుంటే, సర్వీస్‌ ప్రొవైడర్లు ఆశ్రయించమని నిపుణులు సూచిస్తున్నారు.

అలాంటి పొరపాటు చేయకండి..

చాలా మంది తమ ల్యాపీలను ఇంట్లో మంచం, దిండు లేదా సోఫాలపై ఉంచి పనిచేస్తుంటారు. అలా చేయడంవల్ల ల్యాప్‌టాప్‌లలోని వెంటిలేటర్లు, ఎగ్జాస్ట్‌ మూసుకుపోయి ఎయిర్‌ఫ్లోను అడ్డుకోవడంతో వేడి బయటికి వెళ్లదు. దాంతో లోపలి భాగాల్లో వేడి మొదలై ల్యాప్‌టాప్ వేడెక్కుతుంది. అందుకే ల్యాప్‌టాప్‌ను ఉపరితలం చదరంగా ఉన్న టేబుల్‌పై ఉంచాలి. వీలైతే ల్యాప్‌టాప్‌ కింది భాగం గాలి తగిలేలా ల్యాప్‌టాప్‌ స్టాండ్ ఉపయోగిచండం మేలంటున్నారు నిపుణులు.

కూలింగ్ ప్యాడ్ తప్పనిసరి

laptop overheating symptoms
కూలింగ్ ప్యాడ్ తప్పనిసరి

Laptop Cooling Pad: చాలా తక్కువ మంది ల్యాప్‌టాప్‌లకు కూడా విడిగా కూలింగ్ పాడ్ ఉపయోగిస్తుంటారు. మరి ల్యాప్‌టాప్‌లకు కూలింగ్ పాడ్ ఉపయోగించాలా..? వద్దా అంటే ఉపయోగించడమే ఉత్తమం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ల్యాప్‌టాప్‌ను టేబుల్ మీద ఉంచి ఉపయోగిస్తున్నప్పుడు కిందివైపు ఉండే వెంటిలేటర్స్ ద్వారా ఎయిర్‌ఫ్లో ఆగిపోయే అవకాశం ఉంది. దానివల్ల ల్యాప్‌టాప్‌లోని కొన్ని సున్నితమైన భాగాలు కాలిపోవచ్చు. అందుకే ల్యాప్‌టాప్‌లో ఎయిర్‌ఫ్లో నిరంతరాయంగా జరగాలంటే కూలింగ్ పాడ్‌ ఉపయోగించడం ఉత్తమం.

ఇదీ చదవండి: ఒడిలో ల్యాపీకి.. అనువైన గ్యాడ్జెట్‌లు

ఈ-సిమ్​ అంటే ఏమిటి? అసలు అదెలా పనిచేస్తుంది?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.