Jio Bharat phone sale starts in India : రిలయన్స్ జియో శుక్రవారం ఇండియన్ మార్కెట్లో 'జియో భారత్ 4జీ' ఫోన్ అమ్మకాలు ప్రారంభించింది. ఇంటర్నెట్ ఎనేబుల్డ్ 4జీ ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్ ధర కేవలం రూ.999 మాత్రమే.
ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో కంపెనీ.. అతి తక్కువ ధరకే, ప్రీపెయిడ్ ప్లాన్స్‌తో ఈ బడ్జెట్ ఫోన్‌ను తీసుకొచ్చింది. 2జీ యుగంలో చిక్కుకుపోయిన వినియోగదారులను.. 4జీ టెక్నాలజీకి అప్‌గ్రేడ్ చేయడమే లక్ష్యంగా దీనిని తీసుకొస్తున్నట్లు జియో వెల్లడించింది. '2జీ ముక్త్ భారత్' లక్ష్యంగా తాము పనిచేస్తున్నట్లు స్పష్టం చేసింది.
తొలి దశలో 1 మిలియన్ ఫోన్స్!
రిలయన్స్ జియో మొదటి దశలో 1 మిలియన్ జియో భారత్ ఫోన్లను విక్రయించాలని నిర్ణయించింది. ఇక రీఛార్జ్ ప్లాన్స్ విషయానికి వస్తే.. యూజర్లు రూ.123 నెలవారీ ప్లాన్‌ను తీసుకుంటే.. అపరిమిత కాల్స్‌తో పాటు, 14జీబీ డేటాను పొందవచ్చు. రూ.1234 వార్షిక రీఛార్జ్ ప్లాన్ తీసుకుంటే... అన్లిమిటెడ్ కాల్స్ + రోజుకు 0.5జీబీ డేటా చొప్పున మొత్తంగా 168జీబీ డేటా వినియోగించుకోవచ్చు.

జియో భారత్ వీ2 4జీ ఫోన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్
jio Bharat phone specifications : జియో భారత్ వీ2 4జీ పేరుతో వస్తున్న ఈ ఫోన్లో 4జీ ఇంటర్నెట్ కనెక్టివిటీ సహా మరెన్నో ఫీచర్స్ ఉంటాయి.
- డిస్ప్లే : 1.77 అంగుళాల QVGA TFT డిస్ప్లే
- బ్యాటరీ : 1000mAh బ్యాటరీ
- కెమెరా : 0.3 మెగాపిక్సెల్ కెమెరా
- స్టోరేజ్ : 128జీబీ స్టోరేజ్ సపోర్ట్ (ఎస్డీ కార్డు)
jio Bharat phone features : ఈ జియో భారత్ 4జీ ఫోన్లో.. హెడ్‌ఫోన్ జాక్, టార్చ్, ఎఫ్ఎం రేడియో లాంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇంకా ఈ ఫోన్లోని జియోపే యాప్ ద్వారా సులువుగా యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు. అలాగే జియో సినిమా, స్పోర్ట్స్ చూడవచ్చు. జియో సావన్ యాప్ ద్వారా వేలాది పాటలు వినవచ్చు.

ఫ్రీ అండ్ కాంప్లిమెంటరీ ఫోన్స్!
రిలయన్స్ జియో వివిధ రాష్ట్రాల్లో, ప్రదేశాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించి, కొంత మంది వ్యక్తులకు కాంప్లిమెంటరీగా జియో భారత్ ఫోన్లను అందించింది. మరి కొంత మందికి తన జియోస్టోర్ల ద్వారా కేవలం రూ.700కే జియోఫోన్‌ను విక్రయించింది.
ప్రపంచం మొత్తం 5జీ విప్లవానికి సిద్ధమవుతుంటే.. భారత్‌లో ఇంకా చాలా మంది 2జీలోనే ఇరుక్కుపోయారు. అలాంటి వారికి 4జీ నెట్‌వర్క్‌ను పరిచయం చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని రిలయన్స్ జియో అధినేత ముఖేశ్ అంబానీ పేర్కొన్నారు. ప్రజల జీవనోపాధి, ఆర్థిక స్థితిగతుల మెరుగుదలకు సాంకేతికత ఎంతో అవసరమని, అందుకే హైస్పీడ్ ఇంటర్నెట్ను ప్రజలందరికీ చేరువ చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.