ఇటీవల అమలులోకి తెచ్చిన నూతన ప్రైవసీ పాలసీలను ఉపసంహరించుకోవాలని వాట్సాప్‌ను కేంద్రం ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయంపై ఎలక్ట్రానిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వాట్సాప్‌కు లేఖ రాసినట్లు తెలిపాయి. దీనిపై స్పందించేందుకు వాట్సాప్‌కు ఏడు రోజుల గడువు ఇచ్చినట్లు పేర్కొన్నాయి. ఈలోపు సరైన సమాధానం రాకుంటే అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ హెచ్చరించినట్లు వివరించాయి.
నూతన ప్రైవసీ పాలసీల విషయంలో వాట్సాప్ భారతీయ చట్టాలను ఉల్లంఘించినట్లు కేంద్రం పేర్కొన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్త నిబంధనలు యూజర్ల గోప్యతకు, భారతీయ వినియోగదారుల హక్కులను భంగం కలిగించే విధంగా ఉన్నాయని అభిప్రాయపడినట్లు వివరించాయి.