ETV Bharat / science-and-technology

వారణాసి ఐఐటీలో ప్రాంతీయ అంతరిక్ష అకాడమీ: ఇస్రో - ఉత్తరప్రదేశ్ వార్తలు

ఉత్తర్​ప్రదేశ్​లోని ఐఐటీ (బెనారస్​ హిందూ విశ్వవిద్యాలయం)లో అంతరిక్ష ప్రాంతీయ అకాడమీ కేంద్రాన్ని స్థాపించనుంది ఇస్రో. ఇందుకోసం ఐఐటీ-ఇస్రో మధ్య ఒప్పందం కుదిరింది. విద్యార్థులలో అంతరిక్ష పరిశోధన సామర్థ్యాలను పెంపొందించడమే అకాడమీ ఉద్దేశమని ఐఐటీ డైరక్టర్​ తెలిపారు.

ISRO to open Regional Academic Centre for Space at IIT (BHU)
త్వరలో ఐఐటీ (బీహెచ్​) లో ప్రాంతీయ అంతరిక్ష అకాడమీ: ఇస్రో
author img

By

Published : Dec 23, 2020, 7:52 PM IST

Updated : Feb 16, 2021, 7:53 PM IST

ఉత్తరప్రదేశ్​ వారణాసిలోని ఐఐటీ(బెనారస్​ హిందూ విశ్వవిద్యాలయం)లో అంతరిక్ష ప్రాంతీయ అకాడమీ కేంద్రాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) స్థాపించనుంది. ఈ మేరకు ఐఐటీ(బీహెచ్​యూ), ఇస్రోల మధ్య అవగాహన ఒప్పందం-ఎంఓయూ కుదిరింది. పరిశోధన, అభివృద్ధి రంగాలపై విద్యార్థులలో అభిరుచిని పెంపొందించాలన్న ఉద్దేశంతోనే దీనిని స్థాపించనున్నామని ఇస్రో తెలిపింది. దీని ద్వారా స్వల్ప , దీర్ఘకాలిక ప్రాజెక్టులు చేసేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించింది.

బీటెక్​, ఎంటెక్​ విద్యార్థుల కోసం స్వల్వకాలిక ప్రాజెక్ట్​లు ఉంటాయని పేర్కొంది ఐఐటీ. పీహెచ్​డీ చేయలనుకునే వారికి దీర్ఘకాలిక ప్రాజెక్ట్​లను అందించనున్నట్లు వెల్లడించింది.

ఈ అకాడమీ ద్వారా అంతరిక్షానికి సంబంధించిన సాంకేతికతపై విద్యార్థులు పట్టు పెంచుకోవచ్చని ఐఐటీ(బీహెచ్​యూ) డైరక్టర్ ప్రొఫెసర్​ ప్రమోద్ కుమార్​ జైన్ తెలిపారు. అకాడమీ ద్వారా ఉత్తరప్రదేశ్​ , మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాలలో అంతరిక్షానికి సంబంధించిన సాంకేతిక కార్యక్రమాల నిర్వహణకు ఇస్రో కృషి చేస్తుందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: దేశాభివృద్ధిలో ఐఐటీలది కీలకపాత్ర: కిషన్ రెడ్డి

Last Updated : Feb 16, 2021, 7:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.