ETV Bharat / science-and-technology

చంద్రయాన్​-4కు ఇస్రో రెడీ- జాబిల్లి నుంచి మట్టి తీసుకురావడమే టార్గెట్​ - ఇస్రో చంద్రయాన్​ 4 డేట్​ టైమ్​

ISRO Chandrayaan 4 Mission : చంద్రయాన్‌-3 విజయంతో అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర లిఖించిన భారత్‌.. మరో కీలక ప్రాజెక్టుకు సిద్ధమైంది. చంద్రయాన్‌-4 లేదా లుపెక్స్‌ పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా.. చంద్రుడి పైనుంచి రాళ్లు, మట్టి నమూనాలను భూమి మీదకు తీసుకురావాలని ఇస్రో భావిస్తోంది. పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న స్పేస్ అప్లికేషన్‌ సెంటర్ డైరెక్టర్‌ నీలేశ్‌ దేశాయ్‌.. చంద్రయాన్‌-4 గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ISRO Chandrayaan 4 Mission
ISRO Chandrayaan 4 Mission
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 20, 2023, 6:38 AM IST

ISRO Chandrayaan 4 Mission : అగ్ర దేశాలకు సాధ్యంకాని చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ను సాఫ్ట్‌ ల్యాండ్‌ చేసి చరిత్ర సృష్టించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో.. ఇప్పుడు చంద్రయాన్‌-4 ప్రయోగానికి సిద్ధమైంది. లుపెక్స్‌ పేరుతో చంద్రుడిపై నుంచి రాళ్లు, మట్టిని తీసుకొచ్చే ప్రాజెక్టు వైపు ఇస్రో అడుగులు వేస్తోందని స్పేస్ అప్లికేషన్‌ సెంటర్ డైరెక్టర్‌ నీలేశ్‌ దేశాయ్‌ తెలిపారు.

350 కేజీల బరువైన..
ISRO Moon Mission Chandrayaan 4 : చంద్రుడి ఉపరితలంపై అన్వేషణకు సిద్ధమవుతున్నామని.. ఇందుకోసం లునార్‌ పోలార్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ మిషన్‌ను సిద్ధం చేస్తున్నామని నీలేశ్​ దేశాయ్​ వెల్లడించారు. చంద్రయాన్‌-4లో జాబిల్లి ఉపరితలంపై 90 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద ల్యాండర్‌ దిగనుందని.. ఇందులో 350 కేజీల బరువు ఉన్న రోవర్‌ను పంపనున్నట్లు ఆయన తెలిపారు. ఇది కిలోమీటరు మేర చంద్రుడిపై తిరుగనుందని సమాచారం.

'ఐదు నుంచి పదేళ్ల సమయం'
"చంద్రయాన్‌-3 మిషన్ జీవిత కాలం ఒక ల్యూనార్‌ డే అంటే.. భూమిపై 14 రోజులతో సమానం. చంద్రయాన్‌-4 జీవిత కాలం ఏడు లునార్‌ డేలు.. అంటే దాదాపు భూమిపై వంద రోజులు సమానమైన కాలం పనిచేస్తుంది. ఆ సమయంలో రోవర్‌లోని పరికరాలు చంద్రుడిపై రాళ్లు, మట్టి నమూనాలను సేకరించి భూమి మీదకు తీసుకొస్తాయి. ఈ ప్రాజెక్ట్‌ కోసం రెండు లాంచ్‌ వెహికల్స్‌ను సిద్ధం చేయాల్సి ఉంటుంది. దీనికి ఐదు నుంచి పదేళ్ల సమయం పడుతుంది" అని నీలేశ్​ దేశాయ్‌ వెల్లడించారు. చంద్రయాన్‌-3 విజయం తర్వాత మరింత పెద్ద సవాల్‌కు సిద్ధం కావాలని ప్రధాని మోదీ.. ఇస్రో శాస్త్రవేత్తలకు సూచించారని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం జపాన్‌ అంతరిక్ష సంస్థ జాక్సాతో కలిసి ఇస్రో పనిచేస్తోందని చెప్పారు.

Chandrayaan 3 Status : ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 ఆగస్టు 23వ తేదీన జాబిల్లి దక్షిణ ధ్రువం సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. దీంతో దక్షిణ ధ్రువం వద్ద దిగిన తొలి దేశంగా భారత్ కీర్తి పతాకాల్లో నిలిచింది. ల్యాండర్‌ విక్రమ్‌, రోవర్‌ ప్రజ్ఞాన్‌ 14 రోజుల పాటు చంద్రుడి గురించి విలువైన సమాచారం అందించాయి. చంద్రుడిపై సల్ఫర్ ఆనవాళ్లను గుర్తించింది ప్రజ్ఞాన్. చంద్రుడిపై ఉష్ణోగ్రతలను నమోదు చేసింది. అనంతరం చంద్రుడిపై చీకటి కావడం వల్ల సెప్టెంబర్‌ 2న రోవర్‌, 4న ల్యాండర్‌ను శాస్త్రవేత్తలు నిద్రాణస్థితికి పంపారు. 14 రోజుల తర్వాత సెప్టెంబర్‌ 22న అక్కడ సూర్యోదయం కావడం వల్ల ఇస్త్రో శాస్త్రవేత్తలు వాటి బ్యాటరీలను పూర్తిగా ఛార్జ్‌ చేసి మేల్కొలిపేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ అవి సఫలం కాలేదు. అయితే.. రోవర్ పని పూర్తైందని, అది మేల్కోకపోయినా నష్టమేమీ లేదని ఇస్రో స్పష్టం చేసింది.

  • Chandrayaan-3 Mission:
    🇮🇳Vikram soft-landed on 🌖, again!

    Vikram Lander exceeded its mission objectives. It successfully underwent a hop experiment.

    On command, it fired the engines, elevated itself by about 40 cm as expected and landed safely at a distance of 30 – 40 cm away.… pic.twitter.com/T63t3MVUvI

    — ISRO (@isro) September 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Chandrayaan 3 Moon Images : కెమెరామ్యాన్ 'విక్రమ్​'తో 'ఇస్రో'.. భూమికి కన్పించని జాబిల్లి అవతలి వైపు ఫొటోలు ఇవే..

Chandrayaan 3 Latest Update : చంద్రుడిపై దుమ్మురేపిన విక్రమ్​ ల్యాండర్​.. ఏకంగా 2 టన్నుల మట్టి గాలిలోకి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.