ETV Bharat / science-and-technology

ISRO Chandrayaan 3 : లక్ష్యం దిశగా చంద్రయాన్​-3.. చివరి కక్ష్య తగ్గింపు సక్సెస్​ - చంద్రయాన్ త్రీ వికీపీడియా

ISRO Chandrayaan 3 Update : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ- ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 మిషన్‌.. లక్ష్యంగా దిశగా దూసుకుతోంది. కక్ష్యను తగ్గించే చివరి ప్రక్రియను విజయంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో ప్రకటించింది. రేపు ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండర్‌ మాడ్యూల్‌ను విడగొట్టేందుకు ప్రణాళిక రూపొందించినట్లు ఇస్రో ఛైర్మన్‌ సోమ్‌నాథ్‌ తెలిపారు.

ISRO Chandrayaan 3 Update
ISRO Chandrayaan 3 Update
author img

By

Published : Aug 16, 2023, 10:05 AM IST

Updated : Aug 16, 2023, 10:59 AM IST

ISRO Chandrayaan 3 Update : చంద్రుడిపై అన్వేషణకు బయల్దేరిన చంద్రయాన్‌-3 వ్యోమనౌక చివరి ఘట్టానికి చేరువైంది. బుధవారం ఉదయం 8.30 గంటలకు చివరిది, ఐదో కక్ష్య తగ్గింపు ప్రక్రియ విజయవంతమైంది. ఈ మేరకు ఇస్రో ఓ ప్రకటన విడుదల చేసింది. అంతరిక్ష నౌక 153 కిలోమీటర్లు X 163 కిలోమీటర్ల కక్ష్యలోకి చేరినట్లు తెలిపింది. గురువారం ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండింగ్‌ మాడ్యూల్‌ విడగొట్టే ప్రక్రియ చేటట్టేందుకు ప్రణాళిక రూపొందించినట్లు ఇస్రో వెల్లడించింది.

  • Chandrayaan-3 Mission:

    Today’s successful firing, needed for a short duration, has put Chandrayaan-3 into an orbit of 153 km x 163 km, as intended.

    With this, the lunar bound maneuvres are completed.

    It’s time for preparations as the Propulsion Module and the Lander Module… pic.twitter.com/0Iwi8GrgVR

    — ISRO (@isro) August 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Chandrayaan - 3 Location Live : ఈనెల 23న అంతరిక్ష నౌక సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్న ఇస్రో.. అందుకోసం డీబూస్ట్ అనే పద్ధతిని అనుసరించనుంది. అడ్డంగా ప్రయాణం చేస్తున్న చంద్రయాన్‌-3 చివరి 30 కిలోమీటర్లకు చేరుకునే సరికి నిట్టనిలువునా ల్యాండ్ కానుంది. ఈ అంతరిక్ష నౌక వేగాన్ని చివరి 30 కిలోమీటర్ల ఎత్తు నుంచి తుది ల్యాండింగ్‌కు చేర్చే ప్రక్రియ అత్యంత కీలకమని ఇస్రో ఛైర్మన్ ఎస్​.సోమ్‌నాథ్ తెలిపారు. ల్యాండింగ్ ప్రక్రియ మొదలైనప్పుడు అంతరిక్ష నౌక వేగం సెకనుకు 1.68 కిలోమీటర్లుగా ఉంటుందని ఆయన చెప్పారు. ఈ ప్రక్రియ సమయంలోనే చంద్రయాన్-2 లో సమస్య ఏర్పడినట్లు సోమ్‌నాథ్‌ వెల్లడించారు.

Chandrayaan - 3 Launch Date On Moon : గతనెల 14న చంద్రయాన్‌ - 3 ప్రయోగం చేపట్టగా అంతరిక్ష నౌక ఈనెల 5న చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది. చంద్రమామకు చేరువయ్యేందుకు ఈనెల 6, 9, 14 తేదీల్లో మూడుసార్లు కక్ష్య తగ్గింపు ప్రక్రియలు విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో ప్రకటించింది. చంద్రయాన్‌-3 మిషన్‌ పురోగతి సాధించినకొద్దీ.. చంద్రగ్రహంపై అడుగుపెట్టేందుకు వీలుగా అంతరిక్ష నౌక కక్ష్యను క్రమంగా తగ్గించే ప్రక్రియ చేపట్టింది. అంతా సజావుగా సాగితే ఈ నెల 23 సాయంత్రం ల్యాండర్‌ చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనుంది.

"చంద్రుడికి దగ్గరగా మరో అడుగు పడింది. ఐదో కక్ష్య తగ్గింపు ప్రక్రియ విజయవంతమైంది. చంద్రయాన్ 3 153 కిలోమీటర్లు X 163 కిలోమీటర్ల కక్ష్యలోకి చేరింది. దీంతో కక్ష్య తగ్గింపు విన్యాసాలు పూర్తయ్యాయి" కేంద్ర మంత్రి డా. జితేంద్ర సింగ్ ట్వీట్ చేశారు.

  • "A step closer towards the Moon! Today’s successful firing, needed for a short duration, has put #Chandrayaan3 into an orbit of 153 km x 163 km, as intended. With this, the lunar bound maneuvres have been completed," MoS Science & Technology Dr Jitendra Singh tweets.

    (File… pic.twitter.com/7XnT83MNXW

    — ANI (@ANI) August 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Chandrayan3 Full Details : జాబిల్లిపై అన్వేషణకు దూసుకు వెళ్లిన చంద్రయాన్‌-3

జూన్‌లో జాబిల్లిపైకి ఇస్రో చంద్రయాన్‌-3.. 2024 చివర్లో గగన్‌యాన్‌

Last Updated : Aug 16, 2023, 10:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.